ఖపర్డే డైరీ - పదమూడవ భాగం.
28-12-1911
పొద్దున నా ప్రార్థన అయిన తరువాత డా౹౹ హాటే, ఆర్.డి.మోర్‌గావోంకర్ తిరిగి వెళ్ళటానికి అనుమతి పొంది వెళ్ళిపోయారు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్, సి.వి.వైద్య, నటేకర్(హంస) వచ్చారు. హంసతో చాలాసేపు మాట్లాడి, అక్కడికి దగ్గర్లో ఉన్న నానాసాహెబ్ చందోర్కర్, సి.వి.వైద్యలను చూసేందుకు వెళ్ళాను. హంస హిమాలయాల్లో పరివ్రాజకుడుగా పర్యటించి వచ్చినవాడు, గొప్ప భక్తుడు. అందువల్ల అతనితో చర్చ ఆధ్యాత్మికంగా లబ్ధి పొందే విధంగా ఉంది. సి.వి.వైద్యకి ఒక కంట్లో ఏదో బాధ ఉంది కాబోలు, అది చాలా ఎర్రగా వుంది. చందోర్కర్ తన మామూలు ధోరణిలో చాలా సరదాగా ఉన్నాడు. మేము మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాము. మారుతిగా వ్యవహరించబడే త్రయంబకరావు చాలా కోపంగా ఉన్నాడు. అతనికి బద్ధకంగా ఉండటం వల్ల పూజకి రాలేదు. మాధవరావు దేశ్‌పాండే ఈరోజు కొంచెం కులాసాగా ఉన్నాడు. ఈరోజంతా దాదాపు అతను నిలబడే ఉన్నాడు. అసంఖ్యాకంగా ఉన్న అతిథులకు వసతులు కల్పించటం పట్ల దీక్షిత్ అత్యంత శ్రద్ధతో ఉన్నాడు. చందోర్కర్ ఈరోజే కల్యాణ్ వెళ్ళిపోయాడు. అతను వచ్చే ఆదివారం వస్తానన్నాడు. హంసతో కూర్చుని మధ్యాహ్నం నుండి దాదాపు మేము సాయంత్రం సాయిబాబాని దర్శించుకొనే సమయం వరకు, అంటే వారు బయటకు వెళ్ళేవరకు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఈరోజు వారు ఎవర్నీ కూర్చోనివ్వక ఊదీ ఇచ్చి అందర్నీ పంపేశారు. హంస రాధాకృష్ణఆయీ ఇంటికి వెళ్ళి సాయంత్రం అక్కడ గడిపాడు. ఆమె బాగా పాడుతుంది. అద్భుతంగా భజన చేస్తుంది. ఆరోజు భీష్మ భజనలో చాలామంది వచ్చి కలిశారు. ఆ తరువాత దీక్షిత్ రామాయణ పఠనం కొనసాగింది. మోర్సీ నుండి దాదా గోలే వచ్చాడు. నా క్లయింట్ రామారావు కూడా ఇక్కడే ఉన్నాడు. అతను నన్నొక అప్పీలు రాయమన్నాడు. అందుకు నాకు సమయం లేదు.
29-12-1911.
ఈరోజు నిద్రలేవటం కొంచెం ఆలస్యమైంది. మేమంతా 'హంస' అని పిలిచే నటేకర్ స్వామితో మాట్లాడుతూ కూర్చున్నాను. నా ప్రార్థన - మొదలైనవి సమయంలో పూర్తిచేయలేకపోవటం వలన సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు చూడలేకపోయాము. వారు మశీదుకు తిరిగి వచ్చేటప్పుడు చూశాను. హంస నాతోనే ఉన్నాడు. సాయిమహారాజు చాలా సరదాగా ఉన్నారు. వారు నీతిపూర్వకమైన ఒక కథ మొదలుపెట్టారు. మేం మారుతి అని పిలిచే త్రయంబకరావు దురదృష్టవశాత్తూ తెలివితక్కువతనంగా అడ్డుకోవటం వల్ల సాయి మహారాజు విషయం మార్చేశారు. ఒక యువకుడు చాలా ఆకలిగా ఉన్నాడని, అతను ప్రతిదీ కావాలనుకొంటాడని అన్నారాయన. ఈ యువకుడు కొంత అన్వేషణ తరువాత సాయిసాహెబ్ తండ్రిగారి వద్దకు వెళ్ళి అక్కడ దయతో పాటు, అతనికి కావలసిన వాటినన్నింటినీ పొందాడు. అతనక్కడ కొంతకాలం ఉండి, దృఢంగా అయ్యానని అనుకొని కొన్ని వస్తువులు సమకూర్చుకొని, కొన్ని నగలను తస్కరించి, మొత్తం మూటకట్టుకొని, అతను ఎక్కడనుండి వచ్చాడో అక్కడకు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. అతను నిజానికి పుట్టిందీ, చెందినదీ సాయిసాహెబ్ తండ్రిగారింటికే అయినా అతనికా విషయం తెలీదు. అతను ఆ మూటను వీధిలో ఓ మూల పెట్టాడు. కానీ అతను సరిగా బయలుదేరేముందే ఎవరో పసికట్టేశారు. అందుకతనికి ఆలస్యమైంది. ఈలోగా దొంగలు అతని మూటనుండి నగలను తీసేసుకున్నారు. అతను బయలుదేరే చోటే వాటిని అతను పోగొట్టుకొన్నాడు. కనుక అతను ఇంటివద్ద పెట్టిన ఇంకా కొన్ని నగలను తీసుకొని బయలుదేరే సమయానికి, మార్గంలో ఉన్న మనుషులు అతన్ని ఆ వస్తువులు దొంగతనం చేశాడన్న ఆరోపణతో పట్టుకున్నారు. కథ ఇక్కడున్నప్పుడు అది మలుపు తిరిగి అర్ధాంతరంగా ఆగిపోయింది. మధ్యాహ్న ఆరతి నుండి తిరిగి వచ్చాక నాతో కలిసి భోజనం చేయమని హంసని అడిగితే అతను నా ఆహ్వానాన్ని మన్నించాడు. అతను చాలా మంచివాడు, నిరాడంబరమైనవాడు. భోజనానంతరం హిమాలయాల్లో తన ప్రయాణం గురించి చెప్పాడతను. తను ఎలా మానన సరోవరం చూశాడో, అక్కడ ఉపనిషత్తులను పాడటాన్ని తను ఎలా విన్నాడో, తను అడుగుజాడలను అనుసరించి గుహలోకి ఎలా వెళ్ళాడో, అక్కడ ఒక మహాత్ముడిని ఎలా చూశాడో, ఎలా ఆ మహాత్ముడు బొంబాయిలో ఆరోజు తిలక్ నేరారోపణ గురించి చెప్పాడో, ఎలా ఆ మహాత్ముడు అతన్ని తన సోదరుడికి (సహ పాఠకుడు) పరిచయం చేశాడో, చిట్టచివరికి తన గురువును కలసి తను ఎలా కృతార్థుడైనాడో అవన్నీ చెప్పాడు. తరువాత మేము మశీదుకు వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాం. నేనింకా ఇక్కడ రెండు నెలలు ఉండాలని ఈ మధ్యాహ్నం ఆయన నాకు కబురు చేశారు. ఈ సందేశాన్ని ధృవపరచి తన 'ఊది'కి చాలా గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయని చెప్పారు వారు. గవర్నరు ఒక ఈటెతో వచ్చాడనీ, అయితే సాయిమహారాజు తనకున్న వాక్చాతుర్యంతో ఆ గవర్నరుని శాంతపరచి చివరికి అతన్ని బయటకు తరిమేశామని చెప్పారు. భాష అలంకారికంగా ఉండటం వల్ల వివరించటం చాలా కష్టం. సాయంత్రం శేజారతికి హాజరయ్యాము. భీష్మ భజన, దీక్షిత్ రామాయణ పఠన జరిగింది.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete