ఈ భాగంలో అనుభవాలు:
- ప్రణాళిక బాబాదే అయినప్పుడు ఇబ్బందులు అవే తొలగిపోతాయి
- బాబా తన బిడ్డలను రక్షిస్తారు
ప్రణాళిక బాబాదే అయినప్పుడు ఇబ్బందులు అవే తొలగిపోతాయి
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
సాయిబంధువులందరికీ ఓం సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వాహకులకు కూడా ఓం సాయిరాం! నేను ఇంతకుముందు అనుభవంలో 'సాయి మహాపారాయణ'లో చేరటం గురించి మీతో పంచుకుంటానని చెప్పాను. ఆ అనుభవం కొంచెం పెద్దగా ఉంటుంది, ఓపికగా చదవగలరు. (నా మొదటి అనుభవం 'ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు' చదవాలనుకునేవారు ఇక్కడ ఇవ్వబడే లింకుపై క్లిక్ చేసి చదవగలరు - https://saimaharajsannidhi.blogspot.com/2020/01/303.html )
కొన్ని నెలల క్రితం నాకు ఒక టెలిగ్రామ్ గ్రూపులో మహాపారాయణ గురించిన మెసేజ్ వచ్చింది. పారాయణలో చేరాలంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ మెసేజ్‌లో. కానీ అప్పటికి నాకు దాని గురించి కొంచెం కూడా తెలీదు. కానీ, ఆ నెంబరుని 'బాబా పారాయణ' అని సేవ్ చేసుకున్నాను. వాళ్ళని మాత్రం కాంటాక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో, ఏంటో, అసలు నేను పారాయణ చేయగలనా? ఇలా చాలా ప్రశ్నలతో ఆగిపోయాను. (ఇంకా వేరే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి వాళ్ళని అడగలేను.) ఆ తర్వాత మన 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్'లో భక్తుల అనుభవాలు చదవటం మొదలుపెట్టాను. మహాపారాయణ గురించి మర్చిపోయాను కూడా. అప్పుడపుడు బ్లాగులో అనుభవాలు చదివేటప్పుడు, భక్తులు వాళ్ళ మహాపారాయణ అనుభవాలు షేర్ చేసినప్పుడు మళ్లీ గుర్తొచ్చేది. బ్లాగ్ నిర్వాహకులను MP(మహాపారాయణ) గురించి అడిగాను. వాళ్ళు, "ప్రస్తుతం మాకు తెలియదు, తెలియగానే చెప్తాము" అన్నారు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. మళ్లీ ఒకరోజు మహాపారాయణ గుర్తొచ్చి మొదట మెసేజ్ పెట్టిన వాళ్ళనే(టెలిగ్రామ్ గ్రూప్) ధైర్యం చేసి అడిగాను, నాకు MP గ్రూపులో చేరాలని ఉంది అని. కానీ రిప్లై ఇవ్వలేదు(ఇప్పటికి కూడా). నాకు కొంచెం కూడా నిరాశగా అనిపించలేదు. నేను పారాయణ చేయటం బాబాకి అంగీకారమయితే ఆయనే దారి చూపిస్తారని ఊరుకున్నాను. మీరు నమ్మరు గానీ, నేను అలా అనుకున్న 24 గంటల లోపే సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ వాళ్ళు MP(మహాపారాయణ) గురించి షేర్ చేశారు. ఎంత సంతోషంగా అనిపించిందో మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా కదా! వెంటనే బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పి MP వాళ్ళని సంప్రదించాను. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. నా ప్రశ్నలన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చారు. నా సందేహాలన్నిటినీ నివృత్తి చేశారు. వెంటనే నన్ను గ్రూపులో చేర్చుకోవడం, రోల్ నంబర్, హౌస్ కేటాయించటం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాబా ఆశీస్సులతో రాఖీ పండుగ రోజు మొదటి పారాయణ చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఏ ఇబ్బంది వల్ల పారాయణ కుదరదేమోనని కొన్ని నెలల పాటు MPలో జాయిన్ అవకుండా ఉన్నానో అదే ఇబ్బంది బాబా నాకు మొదటి పారాయణరోజునే కల్పించారు. అంటే, 'ఏ రోజుల్లో అయినా నువ్వు పారాయణ చెయ్యొచ్చు' అని బాబా నాకు ఇచ్చిన సంకేతమది అని అనిపించి చాలా ఆనందించాను. తాను మనలని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటారనేది నాకు ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలియచేశారు నా తండ్రి, నా గురువు, నా దైవం అయిన సాయి భగవానుడు. విషయం ఎంత చిన్నదైనా పెద్దదైనా బాబాకి అప్పగించి మన ప్రయత్నం మనం చేస్తే అంతా ఆయనే చూసుకుంటారు.
నేను పారాయణ మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే MP వాళ్ళు నన్ను క్లాస్ టీచర్ని చేశారు. నేను చేయలేనేమో అని భయపడ్డాను. కానీ వాళ్ళు, "ఏం టెన్షన్ లేదు, మీకు తోడుగా మేము ఉన్నాము. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా మేము చెప్తాం" అని నన్ను ప్రోత్సహించారు. వాళ్ళ రూపంలో బాబానే అదంతా చేయిస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే CT(క్లాస్ టీచర్)గా మొదటి పారాయణ సరిగ్గా నా పుట్టినరోజునాడు మొదలయ్యింది. ఇంతకంటే వేరే నిదర్శనం కావాలా నన్ను CT చేసింది బాబానే అని తెలియటానికి? అందరూ చాలా శ్రద్ధతో పారాయణ చేస్తున్నారు. ఏ ఇబ్బందీ లేకుండా పారాయణ జరిగిపోతోంది. ప్రణాళిక బాబాదే అయినప్పుడు ఇబ్బందులు ఎందుకుంటాయి? ఇలాగే మిగతా వారాలు కూడా పారాయణ సాఫీగా జరిగిపోతుందని నాకు తెలుసు. ఎందుకంటే బాబా చేతిలో నేనొక పరికరం మాత్రమే. అంతా ఆయనే చేయిస్తున్నారు.
ఇప్పటికే చాలా ఎక్కువ రాశానేమో కదా! ఓపికగా చదివినందుకు చాలా ధన్యవాదాలు సాయిరాం! బాబా ప్రేమలో మునిగినవాళ్ళకి బాబా లీలలు ఎంత చదివినా, ఎన్ని చదివినా తనివి తీరదు అని ఇంత వివరంగా రాశాను.
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా తన బిడ్డలను రక్షిస్తారు
సాయిభక్తురాలు శారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం బాబా తన బిడ్డలకు ఎంతలా రక్షణనిస్తారో తెలియజేస్తుంది. పెద్ద కారు ప్రమాదం నుండి బాబా మమ్మల్ని రక్షించారు. ఒకరోజు మేము కారులో వెళ్తుండగా చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కారు మొత్తం క్రాష్ అయ్యి పూర్తిగా ధ్వంసం అయ్యింది. కానీ అందులోనుండి నేను, మా చిన్నపాప క్షేమంగా బయటకు వచ్చాము. బాబా దయతో మాత్రమే మేము సజీవంగా బయటపడ్డాము. ఎలా మమ్మల్ని రక్షించారో ఆయనకు మాత్రమే తెలుసు. నిజంగా ఇది ఒక అద్భుతం. మరో ముఖ్యవిషయం, మొత్తం తునాతునకలైన కారులో ఉన్న బాబా విగ్రహం ఏమాత్రం చెక్కుచెదరలేదు. "శతకోటి ధన్యవాదాలు బాబా!"

Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete