సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ
'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు'
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఈ భాగంలో అనుభవం:
- శిరిడీ దర్శనంతో క్యాన్సర్ మాయం
శిరిడీ సాయిబాబా భక్తురాలు మీను తన స్నేహితురాలు సంధ్య అనుభవాన్ని పంచుకుంటున్నారు.
బాబా ఇంకా మనతోనే, మన మధ్యనే ఉన్నారు. మన ప్రార్థనలన్నీ వింటున్నారు. అందుకు నిదర్శనమైన నా స్నేహితురాలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
శ్రీమతి సంధ్య ఖురానా అనే నా స్నేహితురాలు బాబా అనుగ్రహాన్ని పొందింది. బాబా తన ప్రాణాలను కాపాడారు. ఆమె క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నందున డాక్టర్లందరూ ఇంకేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆరు నెలల పాటు ఆమె ఏమీ తినలేదు. నిరంతరం ఏడుస్తూనే ఉండేది. ఏ క్షణంలోనైనా తన శ్వాస ఆగిపోతుందని ప్రతిక్షణం తనకున్న ఒక్కగానొక్క కొడుకు గురించి ఆందోళనపడుతూ తన భర్తతో కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని పదేపదే చెబుతూ ఉండేది. కుటుంబసభ్యులందరూ బాధలో కూరుకుపోయి ఉన్నారు. ఇల్లంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అటువంటి సమయంలో బాబా అద్భుతం చేశారు. ఏ జన్మలో పెనవేసుకున్న ఋణానుబంధమో బాబా ఆమెకు పునర్జీవితాన్ని ప్రసాదించటానికి వచ్చారు. నిజానికి అప్పటికి సాయిబాబా ఎవరో ఆమెకు తెలియదు.
ఒకరాత్రి కలలో ఆమెకు బాబా కనిపించారు. ఆయన, “బేటా, రో క్యోం రహే హో? డాక్టర్స్ నే జవాబ్ దియా హై. మైనే తో అభీ తక్ కోయీ జవాబ్ నహీ దియా. తుమ్ మేరే పాస్ శిరిడీ ఆవో” ("బిడ్డా నువ్వెందుకు ఏడుస్తున్నావు? వైద్యులు తమ సమాధానం చెప్పారు. నేనింతవరకు నా సమాధానం ఇవ్వలేదు. నువ్వు నా దగ్గరకు శిరిడీ రా") అని చెప్పారు. ఆమెకు మెలకువ వచ్చి అటు ఇటు చూసింది కానీ, ఎవరూ లేరు. ఆమెకేమీ అర్థంకాక మళ్ళీ నిద్రపోయింది. ఆమె సరిగ్గా వినలేదని అనుకున్నారేమో, బాబా మళ్ళీ దర్శనమిచ్చారు. "బేటా ఉఠో, ఔర్ మేరే పాస్ ఆవో" ("బిడ్డా, లే! నా దగ్గరకు రా") అని అన్నారు. ఈసారి కూడా ఆమె మళ్ళీ నిద్రపోయింది. చివరికి బాబా స్వయంగా ఉదయం 5 గంటలకు ఆమెను మేల్కొల్పి, "బేటా! శిరిడీ ఆవో, సబ్ ఠీక్ హో జాయేగా" ("శిరిడీ రా.. అంతా బాగుంటుంది") అని అన్నారు. ఆమె ఈసారి తన భర్తను లేపి అంతా వివరించింది. అతనికి కూడా సాయిబాబా గురించి గానీ, శిరిడీ గురించి గానీ తెలియనందున తెలిసినవాళ్ళని శిరిడీ గురించి అడిగారు. వాళ్ళ ద్వారా బాబా గురించి తెలుసుకుని శిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
ట్రైన్ ఎక్కాక వాళ్ళు మన్మాడ్ వరకు వెళ్లాలా, కోపర్‌గాఁవ్ వరకు వెళ్లాలా అని వాళ్ళని, వీళ్ళని అడుగుతున్నారు. అంతలో బాబా వాళ్లకు కనపడి, "మీరు మన్మాడ్ చేరుకోవాలి. అక్కడ టాక్సీ తీసుకోవాలి" అని చెప్పి అదృశ్యమైపోయారు. బాబా చెప్పినట్లే వాళ్ళు శిరిడీ చేరుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె సమాధిమందిరంలో బాబా విగ్రహం ముందు నిలబడింది. అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టి ఆమె స్పృహకోల్పోయింది. వెంటనే ఆమె భర్త ఆమెను తీసుకుని బయటకు వెళ్ళాడు. స్పృహ వచ్చిన వెంటనే ఆమె, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఏదైనా తినాలనుకుంటున్నాను" అని చెప్పింది. ఆరు నెలల తరువాత మొదటిసారి ఆమె మళ్ళీ ఆహారం తీసుకుంది. తరువాత వాళ్ళు అన్నిచోట్లా దర్శనాలు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించి, "ఏమిటి ఈ అద్భుతం. ఇప్పుడీమె ఆరోగ్యం నార్మల్‌గా ఉంది" అన్నారు. తరువాత పాత రిపోర్టులను, కొత్త రిపోర్టులను చూసి నిర్ఘాంతపోయారు. ఈవిధంగా సాయిబాబా ఆమె ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు సంధ్య సాయిబాబాకి అంకిత భక్తురాలు. సాయిబాబా మన అందరినీ తన బోధలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
మీనూ గుప్తా.
source:http://www.shirdisaibabaexperiences.org/2009/05/shirdi-sai-baba-devotee-experience.html

Sandhya ji a specially blessed devotee of Sai.
ReplyDeleteAnd Sai showed his mercy and magic onher
Bless me also , Sai
🙏🙏🙏
బాబా ఎంతటి సమర్థుడో,ఎంతటి దయామయుడో ఇలాంటి అనుభవాల తో తెలుస్తోంది.తన మాటను బాబా ఎప్పుడూ వమ్ము కనీయడు బాబాను నమ్మినవారిని శరణు వేడిన వారిని ఎలా వదిలేస్తాడు. బాబా తప్పకుండా రక్షిస్తారు.
Deleteఓం సాయిరాం.
ఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm sai ram
ReplyDeleteAdbutam inaa leela 🙏🙏👌
🌼🌼🌻
Sai maharaj Sannidi
Varshikotsava Subhakankshaalu💐💐💐
చాలా చాలా ధన్యవాదాలు సాయి. మన సాయి ప్రేమ ఇలాగె మన అందరిపై వర్షిస్తూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుత్నున్నాను సాయి
DeleteLove u baba,meeru ilage mimmalni nammina vallanrharini kapadandi deva,om sai sree sai Jaya Jaya sai, om sai sree sai dwarakamayi
ReplyDeleteSai nath maharaj ki jai.
ReplyDeleteఓ దయామయి ఓ కరుణామయి సాయి నీవే అందరికీ అండగా వుండి రక్షిస్తున్నవే నిన్ను ఏమని పోగడను ఏమని వర్ణించను. ఓ కరుణా సాగర నీ దయాహృదయనికి నా మనఃపూర్వక ప్రణామాలు తండ్రి. ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteIlanti anubhavalu chadivinapudu dairyam vasthundhi
ReplyDeletesai naa samasyalu ani neeku telusu
ReplyDeleteplease bless me sai
emi ardham kani paristhithilo unnanu
dari chupinchu sai
om sai ram
ReplyDeletealways be with me