సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 346వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయి ఒకటవ భాగం

15-2-1912

మామూలుగానే లేచి, ప్రార్థనానంతరం మా పంచదశి తరగతిని ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, శ్రీమతి లక్ష్మీబాయికౌజల్గిలతో నిర్వహించాను. సాయిసాహెబ్ బయటకు వెళ్ళటం చూసి మా తరగతిని కొనసాగించాము. దీని తరువాత నేను మామూలు ప్రకారం మశీదుకు వెళ్ళి సాయిసాహెబ్ చెప్పేది వింటున్నాను. వారు చాలా మంచి ధోరణిలో ఉండి, "తాను కష్టపడ్డాననీ, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాననీ, కేవలం వేపాకులు మాత్రం తిని జీవించాననీ" చెప్పారు. “తనపట్ల భగవంతుడు చాలా ప్రేమగా ఉన్నాడనీ‌, మాంసమంతా పోయి ఎముకలు కూడా మిగలవేమో అన్న పరిస్థతి వచ్చినప్పటికీ ప్రాణం పోలేదనీ" అన్నారు. 

మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయాక మేము భోజనాలకు వచ్చాము. శివరాత్రికి నా భార్య, ఇంకా మిగతావారు కోపర్గాం వెళ్ళాలనుకున్నారు. సాయిసాహెబ్ అది అనవసరమనుకున్నారు కానీ, వారు పట్టుబట్టి చివరకు ఎలాగో అనుమతి సంపాదించుకున్నారు. ఈరోజు మధ్యాహ్న పురాణం అయ్యాక దాదాకేల్కర్ కోసం పరమామృతం తరగతి ఒకటి నిర్వహించాము. ఇదే మొదటిరోజు కనుక పఠనం ఎక్కువగా ముందుకు సాగలేదు. సాయంకాల వ్యాహ్యాళిలో సాయిమహారాజుని చూసి వాడా ఆరతి అయ్యాక, శేజారతికి హాజరయ్యాము. దీనికి బాలాసాహెబ్ కూడా హాజరయ్యాడు. నా దగ్గరకు వచ్చే ముందు అతను మోర్చల్ (నెమలి పింఛాల వింజామర) పట్టుకునేవాడు. అందుకని మళ్ళీ దాన్ని అతనికే ఇచ్చాను. దానిబదులు నేనో వింజామర పట్టుకున్నాను. బాలాసాహెబ్ భాటే చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించాడు.

16-2-1912

నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ కఠినమైన పదజాలంతో కూడిన గొప్ప కరుణను ప్రదర్శించారు. ఉదయ ప్రార్థనానంతరం మేం మా పంచదశి తరగతిని నిర్వహించాము. బండి దొరక్కపోవటం వల్ల మా ఆవిడ, పిల్లలు కోపర్గాం వెళ్ళలేకపోయారు. సాయిబాబా బయటకు వెళ్ళటం మేం చూశాము. మోర్ గావోంకర్ వరాపూజ అనువాదం కాగితాల్ని పంచాడు. కల్యాణ్ భివండి నుంచి ఒక శాస్త్రి వచ్చాడు. బాపూసాహెబ్ జోగ్‌తో ఉంటున్న ఈయన చాలా మంచివాడు. శివరాత్రి సందర్భంగా మేము ఉపవసించాము.

17-2-1912


ఉదయాన్నే లేచి, ప్రార్థనానంతరం మా పంచదశి తరగతి ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, కల్యాణ్‌కి చెందిన కుంటేశాస్త్రి, మోర్ గావొంకర్ లతో నిర్వహించాము. ఈరోజు మూడవ అధ్యాయం ముగించాము. సాయిమహారాజు బయటకు వెళ్ళటం, తిరిగి మరలి రావటం మేము చూశాము. వారు చాలా సరదాగా ఉండి హాస్యధోరణిలో మాట్లాడారు. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయాక మేము భోజనాలు కానిచ్చాము. తన కొడుకు ఉపనయనానికి దీక్షిత్ నాగపూర్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఇక్కడనుండి ఎంత ఎక్కువమందిని వీలైతే అంత ఎక్కువమందిని తనతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు కానీ, అదంతా సాయిసాహెబ్ ఇచ్చే ఆజ్ఞమీద ఆధారపడి ఉంది. మధ్యాహ్నం దీక్షిత్ రామాయణానంతరం మా పరమామృతం తరగతి జరిగింది. అందులో మంచి పురోగతిని సాధించాము. తరువాత సాయిమహారాజుని వ్యాహ్యాళి సందర్భంలో దర్శించాము. తరువాత వాడా ఆరతి, శేజారతి జరిగాయి. శేజారతిలో పట్టుకోవటానికి నాకు పెద్ద వింజామర వచ్చింది. మేం తిరిగి వచ్చేటప్పుడు భివండికి చెందిన కుంటేశాస్త్రి హరికథ చెప్పాడు. ఆయన ఉత్తర గోగ్రహణం కథ చెప్పాడు. ఆయన ఎనభై ఏళ్ళవాడు. ఆ వయసులో ఆయనకున్న సహనం, శక్తి నిజంగా మెచ్చుకోదగినవి. దీక్షిత్ రామాయణం, భీష్మ భాగవతం చదివారు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఈ కొరోనా వ్యాధి బారినపడకుండా సమస్త జనులు సుఖంగా ఉండాలని మన తండ్రి సాయిని ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం సాయి తాతయ్య 🙏🙏🙏

    ReplyDelete
  4. ఓంసాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  5. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete
  6. ఓం సాయిరాం 🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo