ఈ భాగంలో అనుభవాలు:
- దగ్గు నయంచేసి అనారోగ్యంపాలు కాకుండా బాబా కాపాడారు
- ఊదీ చేసిన నొప్పి నివారణ
దగ్గు నయంచేసి అనారోగ్యంపాలు కాకుండా బాబా కాపాడారు
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు శైలజ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను యు.ఎస్.ఏ నుండి శైలజని. సాయిపై అపారమైన విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు దైవికమైన బ్లాగు నిర్వహిస్తున్న వారిని ముందుగా అభినందిస్తున్నాను. నా సమస్యలకు తోటి భక్తుల అనుభవాల ద్వారా సమాధానాలు లభిస్తున్నందున బ్లాగుకు నేను పూర్తిగా బానిసనయ్యాను. నేను ఇంతకుముందు మూడు అనుభవాలను పంచుకున్నాను. మళ్ళీ నా అనుభవాన్ని పంచుకోవడానికి బాబా నాకు అవకాశం ఇచ్చారు.
నేను (2019)మార్చి నెలలో సాయి సచ్చరిత్ర పారాయణ ఒక వారంలో పూర్తి చేశాను. అప్పటినుండి, అంటే సుమారు ఆరునెలలుగా బాబా మా అబ్బాయి ఆరోగ్యం, ఇతర కుటుంబ విషయాలలో బాబా నాకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
బాబా కృపతో మేము వేసవిలో భారతదేశ పర్యటనకు వెళ్ళాము. తక్కువ వ్యవధిలోనే శిరిడీ, తిరుపతి, విజయవాడ వంటి క్షేత్రాలను సందర్శించేలా బాబా మమ్మల్ని అనుగ్రహించారు. ఈ దర్శనాలన్నీ గురువారంనాడే చిరస్మరణీయమయ్యేలా జరిగాయి.
ఇటీవల ఒకసారి మా అబ్బాయి చదివే పాఠశాలలో వైరల్ జ్వరాల కారణంగా చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. మా అబ్బాయి కూడా రెండు రోజుల పాటు రోజంతా దగ్గుతూనే ఉండేవాడు. నేను భయపడి, "బాబా! నా బిడ్డకు వైరల్ జ్వరం రాకుండా చూడండి. తన దగ్గు కూడా రెండురోజుల్లో తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. ఒక తల్లి తన కొడుకుకి వచ్చిన జ్వరాన్ని నయం చేయమని బాబాను ప్రార్థించి, "ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః" అనే మంత్రాన్ని జపించడం వల్ల తన బిడ్డకు నయం అయిందని బ్లాగులో వచ్చిన అనుభవం ద్వారా నాకు ఆ మంత్రం గురించి తెలిసింది. దాంతో నేను మా అబ్బాయికి రోజూ బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇస్తూ, "ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః" అనే మంత్రాన్ని రోజుకు రెండు పూటలా 108 సార్లు జపించడం ప్రారంభించాను. బాబా కృపవలన తనకి జ్వరం రాలేదు. దగ్గు కూడా 2 రోజుల్లో దాదాపు 90% తగ్గిపోయింది. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి మా అబ్బాయికి, మీ భక్తులందరికీ మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించండి".
ఓం సాయిరామ్!
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2596.html

ఊదీ చేసిన నొప్పి నివారణ
సాయిభక్తురాలు శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
జై సాయిరాం!
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు శిరీష. నేను ఇంతకుముందు మీతో కొన్ని అనుభవాలు పంచుకొని ఉన్నాను. ఇప్పుడు మరొక అనుభవం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
రెండు రోజుల క్రితం, అంటే ఆదివారంనాడు మధ్యాహ్నం నాకు కడుపునొప్పి మొదలైంది. తగ్గుతుంది కదా అని నేను ఇంట్లో ఉండే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాను. సాయంత్రానికి తగ్గలేదు సరికదా నొప్పి బాగా ఎక్కువయింది. ఇంక ఆ బాధ భరించలేక హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ గారు అసిడిటీకి సంబంధించిన రెండు ఇంజక్షన్లు వేసి కొన్ని మందులు ఇచ్చారు. కానీ ఇంటికి వచ్చిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీని నా పొట్ట మీద రాసుకొని, “బాబా! ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, నాకు ఈ నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. అంతే! వెంటనే బాబా అద్భుతమైన తమ మహిమను చూపించారు. ఐదు నిమిషాలలోపే నొప్పి తగ్గడం మొదలైంది. ఆ తరువాత పూర్తిగా తగ్గిపోయింది. బాబా! ఎప్పుడూ ఇలానే నీ భక్తులందరినీ అన్నివేళలా రక్షించు తండ్రీ!"
సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

Om Sri sairam🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete