సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆళంది శ్రీపద్మనాభేంద్రస్వామి



శ్రీసాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో ఆళందిస్వామి అనుభవం గురించి ఈవిధంగా ఉంది:

ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడు. అతను తీవ్రమైన చెవిపోటుతో బాధపడుతుండేవాడు. ఆ కారణంగా అతనికి నిద్రకరువైంది. నివారణోపాయాలు పనికిరాలేదు. చివరికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినా ప్రయోజనం లేకపోయింది. అతనికి ఏమి చేయుటకు తోచలేదు. ఆ స్థితిలో అతనికి బాబా గురించి తెలిసి శిరిడీ వచ్చాడు. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని మాధవరావు దేశ్‌పాండే (షామా) ఆ స్వామి తరపున బాబాకు మనవి చేశాడు. బాబా అతనిని, “అల్లా అచ్ఛా కరేగా (అల్లా మంచి చేస్తాడు)అని ఆశీర్వదించారు. బాబా ఆశీస్సులను అందుకొని స్వామి పూణే పట్టణానికి వెళ్లాడు. వారం రోజుల తరువాత తన చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం వ్రాశాడు. కానీ వాపు తగ్గనందువలన శస్త్రచికిత్స చేయించుకునేందుకు బొంబాయి వెళ్లాడు. డాక్టరు చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టరు చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది.

ఇకపోతే, శ్రీపద్మనాభేంద్రస్వామి తన అనుభవం గురించి స్వయంగా వ్రాసిన వివరణాత్మక లేఖ 1923వ సంవత్సరం సాయిలీల పత్రికలో ప్రచురితమైంది. ఆ వివరాలు అతని మాటల్లోనే:

“నాకు అత్యంత ప్రియతముడు, బొంబాయి నివాసియైన శ్రీహరిసీతారాం దీక్షిత్ సలహాననుసరించి నేను శిరిడీ దర్శించాను. శ్రీసాయిబాబా దర్శనంతో, వారి కృపాశీస్సులతో నేను అంతులేని ఆనందంలో మునిగిపోయాను. అక్కడున్న చాలామంది భక్తులు నా చెవివాపు గురించి సాయిమహరాజుతో విన్నవించుకోమని సలహా ఇచ్చారు. కానీ నా ఆత్మ, హృదయం అలా చేయడానికి ఇష్టపడలేదు. అందుకు కారణం, నేను కేవలం సాయిమహరాజు దర్శనం కోసం మాత్రమే శిరిడీ వెళ్ళాను, అంతకుమించి నాకు ఏ ఉద్దేశ్యమూ లేదు. ప్రారబ్ధకర్మను అనుభవించి తీరాలని నా దృఢ విశ్వాసం. కానీ చివరికి నా సమస్య గురించి సాయిమహరాజుకి విన్నవించమని మాధవరావు దేశ్‌పాండే(షామా)ను అడిగాను. తరువాత నేను సాయిమహరాజు దర్శనానికి వెళ్ళినప్పుడు షామా నా సమస్య గురించి బాబా వద్ద ప్రస్తావించాడు. అప్పుడు సాయిమహరాజు ప్రేమతో, “అల్లా సబ్ అచ్ఛా కరేగా” (అల్లా అంతా సరిచేస్తాడు) అని అన్నారు. తక్షణం చంచలంగా ఉన్న నా మనసు నిశ్చలమైంది. శ్రీసాయిమహరాజు యొక్క మహిమానిత్వమైన దైవత్వం గురించి వర్ణించడం అసాధ్యం. అది నా మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. పర్యవసానంగా నేను అపారమైన శాంతిని అనుభవించాను.

శిరిడీయాత్ర ముగించుకుని జనవరి 29, గురువారంనాడు నేను ఆళంది వెళ్ళాను. అక్కడ ఫిబ్రవరి 2న జరిగిన శ్రీగురు తుకారాం మహరాజ్ పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొన్నాను. మరుసటిరోజు మంగళవారం నేను బొంబాయి వెళ్ళాను. అక్కడ నేను నా చెవి వెనుక నుండి మెడ వరకు వ్యాపించిన వాపు విషయమై డాక్టర్ అండర్వుడ్‌ని సంప్రదించాను. ఆయన నా చెవిని పరీక్షించి, శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి, దాంతో వాపు నయమవుతుందని చెప్పారు. నిజానికి నా శిరిడీ ప్రయాణానికి ముందు నాగపూర్‌లోని వైద్యుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఆళందిలోని వైద్యుడు కూడా అదే చెప్పాడు. కానీ బొంబాయి వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షనుతో నా చెవినొప్పి, వాపు పూర్తిగా మాయమైపోయాయి. ఇదంతా శ్రీసాయిమహరాజు ఆశీర్వాదమే. అది తల్చుకుంటే నాకు ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి”.

సాయిమహరాజు అడిగిన దక్షిణ:

“నేను సాయిమహరాజుని దర్శించిన మొదటిరోజునే ఆయన నన్ను దక్షిణ అడిగారు. అప్పుడు నేను, “మహరాజ్! నేనొక సన్యాసిని. నా దగ్గర ధనం ఎక్కడుంటుంది?” అని అన్నాను. తరువాత మాధవరావు దేశ్‌పాండేతో బాబా, “స్వామి నాకేమైనా ఇస్తాడేమోనని ఎదురుచూశాను. కానీ అతను ఏమీ ఇవ్వదలుచుకోలేదు. అయినప్పటికీ అతను నా వద్దకు వచ్చాడు కాబట్టి నేను అతనికి ఏమైనా ఇవ్వాలి” (“స్వామీ మలా కాహీ దేతాస్ కా పాహిలే, పరంతు తే కహీ దేణార్ నాహిత్!! తే మజకడే ఆలే ఆహేత్!! తేంవ్హా మలాచ్ త్యాంనా దిలే పాహిజో!!”) అని అన్నారు. మరుక్షణం నేను చింతారహితుడనయ్యాను. ఈ సిద్ధపురుషుల గురించి ఏమి చెప్పేది? వాళ్ళు మానవరూపంలో ఉన్న శ్రీనారాయణులే!”


సోర్స్: బాబా'స్ వాణి బై విన్నీ చిట్లూరి.

10 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. 🙏💐🙏 ఓం సాయిరాం 🙏💐🙏

    ReplyDelete
  3. Om sai Ram yesterday january14. All family members did sai baba vratamu. Sai baba's pooja, saibaba evening siridi sai haratulu we performed. Sai baba kathalu o in the morning we did it yesterday. First we performed Ganapati pooja later on we did sai baba vartamu. With his blessings we did pooja on Thursday January 14.om sai Ram������

    ReplyDelete
  4. Om sairam baba mere bacho par raham karna annaru adhikvaddi dena prabhu om sairam

    ReplyDelete
  5. Apna kritam bane rakhna baba mere bacho par rahem karna apna adhikvaddi dena prabhu

    ReplyDelete
  6. Om sai ram please help us sai

    ReplyDelete
  7. Om Samardha Sadguru Sree Sainathaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo