సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 645వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు
  2. ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చారు బాబా

బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు


ఒక సాయి భక్తుడు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ఓం సాయిరాం! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి లీలలు అనంతము, వర్ణనాతీతము. వాటిలోనుండి ఒక చిన్న లీలను మీతో పంచుకుంటాను. నేను గత 20 సంవత్సరాల నుండి బాబా భక్తుణ్ణి. నాలో అంచెలంచెలుగా ఆ బ్రహ్మాండనాయకుడిపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్‌లో ఒకరోజు నా భార్యకు హఠాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. అదే తనకు మొదటిసారి ఛాతీనొప్పి రావడం. దాంతో కొంచెం భయపడ్డాను. ఆ తరువాత తనకు బి.పి. చెక్ చేయిస్తే 170 ఉంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నీ బిడ్డను ఇబ్బందిపెట్టకు. తనకు ఛాతీనొప్పి తగ్గి ఆరోగ్యం బాగుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవలన నా భార్య త్వరలోనే మంచి ఆరోగ్యవంతురాలైంది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏమి చేసినా ఆ సాయినాథుని ఋణం తీర్చుకోలేము.


నా అనుభవం:


బాబా సర్వాంతర్యామి. నా భార్య ఆరోగ్యం కుదుటపడితే బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను కదా! కానీ, ఆ లీలను పంచుకోవటంలో కొంచెం ఆలస్యం చేశాను. తరువాత నాకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చింది. బి.పి. చెక్ చేయిస్తే ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను బాబాకు ఇచ్చిన మాట. ఆలస్యం చేసినందుకు క్షమించమని బాబాను వేడుకుని, నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమని ప్రార్థించి, నా ఆరోగ్యం బాగుంటే ఈ రెండు లీలలను బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. మనం తెలుసుకోవలసిన విషయమేమిటంటే, బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు. బాబా ప్రేమమయుడు, సర్వాంతర్యామి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను బాబా ఎల్లప్పుడూ క్షేమంగా చూసుకోవాలని, మేము ఎల్లప్పుడూ బాబా సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా పాదాలకు అనంతకోటి వందనాలు.


ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చారు బాబా


సాయిభక్తుడు శ్రీసత్యనారాయణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు మరియు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. కోవిడ్-19 వలన సుమారు గత 8 నెలల నుంచి మా కుటుంబం కూడా చాలామంది వలె ఎన్నో ఇబ్బందులుపడ్డాము. కానీ, శ్రీసాయిబాబా మమ్మల్ని కంటికి రెప్పవలె కాపాడి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించారు. 


1. కోవిడ్ కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో ఒకసారి నా శ్రీమతికి కాళ్ళు, తొడలు తీవ్రంగా నొప్పిపుట్టసాగాయి. 


2. నా కుమారునికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ నుండి కోలుకున్న తరువాత కూడా అది తగ్గిన తరువాత వచ్చే సమస్యల (post Covid-19 problems) వల్ల తనెంతో ఇబ్బందిపడ్డాడు.

 

3. మా సోదరికి సంతానం లేకపోవటం వలన నేను, మా అన్నదమ్ములు కలిసి తనకు కావలసిన అన్ని వసతులూ కల్పించాము. మేమంతా మా బాధ్యతలను పూర్తిగా నిర్వహించాము. కానీ మా సోదరి యొక్క అత్తవారి తరఫు బంధువులు మాపై ఎన్నోరకాల నిందలు వేసి మాకు చాలా ఇబ్బందులు కలుగజేశారు. దానివల్ల మాకు భౌతికపరమైన ఇబ్బందులెన్నో వచ్చాయి. 


వాటినన్నిటినీ నేను ధైర్యంతో సహిస్తూ, మా సమస్యలను పరిష్కరించమని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయి చరిత్ర పారాయణలు చేశాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీర్చేశారు. బాబాను నమ్ముకుంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుందని అనటానికి ఇవే పూర్తి నిదర్శనాలు


బొడ్డు సత్యనారాయణ 

అడ్వకేట్ 

విజయనగరం.



4 comments:

  1. 🙏💐🙏 ఓం సాయిరాం🙏💐💐

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ బాబా అమ్మ కి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినదుకు థాంక్స్ తండ్రి ఆ ఉ్రాలజీ ప్రాబ్లెమ్ కూడా తొందర్లో క్యూర్ చేయి తండ్రి నిన్నే నమ్ముకున్న నీదే భారం తండ్రి. శతకోటి వందనాలు సాయి సాయి సాయి సాయి.

    ReplyDelete
  3. Baba santosh life happy ga vundela chudu thandri epati nuchi ee problems rakunda chudu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo