సాయిభక్తురాలు సింధు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను హైదరాబాద్ అమ్మాయిని. 2017 నవంబరు నెలలో బాబా నన్ను తన చెంతకు చేర్చుకున్నారు. బాబా ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తుంటారని మనకు తెలుసు. కానీ, ఏదైనా చేస్తానని వాగ్దానం చేసి, దానిని మరచిపోతే మాత్రం ఆయన ఊరుకోరు. ఆయన ఏదో ఒక విధంగా మన మ్రొక్కులు స్వీకరించి మనల్ని ఋణవిముక్తులను చేస్తారు.
కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మ ఒక పని విషయంలో తను అనుకున్నట్లు జరిగితే శిరిడీలో బాబాకు తన మ్రొక్కు చెల్లించుకుంటానని వాగ్దానం చేసింది. తను కోరుకున్నది బాబా ఆశీస్సులతో నెరవేరింది. కానీ, ఆమె తన మ్రొక్కు తీర్చుకోలేదు. కొంతకాలం తరువాత బాబా నా సోదరి కలలో కనిపించి, "నీకు కావలసింది నేను ఇచ్చాను. మరి మీరు వాగ్దానము చేసిన నా బహుమతి ఎక్కడ?" అని అడిగారు. వెంటనే మేము శిరిడీ వెళ్లి మ్రొక్కు తీర్చుకున్నాము. బాబాకు ఏదైనా వాగ్దానం చేస్తే అది మరచిపోకుండా నెరవేర్చండి.
ఒకసారి నేను నాకు కావాల్సిన పని జరిగితే కొంత ఆహారాన్ని దానం చేస్తానని బాబాకు వాగ్దానం చేసాను. బాబా ఆ పనిని చేసారు కాని, నాకు నా వాగ్దానం గుర్తున్నా సోమరితనంతో దాన్ని నెరవేర్చలేదు. కొన్నిరోజులకి నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా, ఊదీ వాడినా నొప్పి తగ్గుముఖం పట్టలేదు. అప్పుడు నేను, "నా వాగ్దానాన్ని నెరవేర్చలేదు, అందువలనే నాకీ సమస్య" అని గ్రహించాను. ఆరోజు గురువారం. నేను కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేసి బాబా మందిరానికి బయలుదేరాను. దారిలో ఆ బిస్కెట్లను కుక్కలకు పెట్టి నా వాగ్దానం నెరవేర్చుకోవాలని నేను అనుకున్నాను. నేను ఆటోలో మందిరానికి వెళ్లేసరికి మందిరం మూసివేయబడింది. మందిరం నుండి ఆటోస్టాండ్ వరకు దాదాపు ఒక కిలోమీటరు నడుచుకుంటూ వచ్చాను. కానీ అక్కడకు వచ్చాక, బాబా దర్శనం చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళితే బాబా నన్ను తిరస్కరించినట్లుగా భావం కలిగి ఇంటికి వెళ్ళడానికి నా మనస్సు అంగీకరించలేదు. అప్పుడు సమయం 4.30 అయ్యింది. 5.00 గంటలకు గాని మందిరం తెరవరు. కాబట్టి నేను ఆటోలో మందిరానికి వెళ్లినా బయట వేచి ఉండాల్సి ఉంటుందని మళ్ళీ వెనుకకు తిరిగి నడిచి వెళ్ళాను. నేను మందిరం చేరుకునేసరికి 5.00 గంటలైంది. మందిరం కూడా తెరచి ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను మందిరం నుండి ఆటోస్టాండుకి వెళ్లిరావడంలో నా కడుపునొప్పి తగ్గుతూ నన్ను అంతగా ఇబ్బందిపెట్టలేదు. మందిరానికి వెళ్ళే మార్గంలో కనిపించిన కుక్కలకు నేను తీసుకుని వెళ్లిన బిస్కట్లు పెట్టాను. ఆ రాత్రికల్లా కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, కొన్ని నెలల క్రితం ఒకసారి నేను ఏదో విషయంగా క్వశ్చన్&ఆన్సర్ సైటులో బాబాని అడిగితే, "సాయినాథుని ఆశీస్సులకోసం ప్రార్థించకపోతే కడుపునొప్పి తగ్గదు" అని వచ్చింది. ఆ సమయంలో నాకు నొప్పిలేకపోయినందున ఆ మెసేజ్ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. క్వశ్చన్&ఆన్సర్ సైటులో వచ్చే ఆన్సర్స్ ఖచ్చితంగా నిజం కావడం ఎన్నోసార్లు నా విషయంలో అనుభవమైంది.
2) ఒకసారి, 'నీ చేతికి కొత్త వస్తువు వస్తుంద'ని వచ్చింది. అలాగే నాకు కొత్త చార్జర్ వచ్చింది.
3) మేము ప్రతిరోజూ వీధికుక్కలకు ఆహారం పెడుతూ ఉండేవాళ్ళం. వాటిలో ఒక కుక్కపిల్లకు పిచ్చిపట్టి వీధిలో వెళ్లేవారిని, ఇతర కుక్కలను కరుస్తూ ఉండేది. దాంతో అందరూ దానిపై రాళ్ళురువ్వి తరుముతూ ఉండేవారు. పాపం, అది అప్పటికే అనారోగ్యంతో బలహీనంగా ఉంది. పైగా అక్కడక్కడా దాని చర్మం ఊడిపోయి రక్తం కారుతూ ఉండేది. నేను దాని పరిస్థితి చూడలేక కన్నీళ్లతో, "బాబా! దాని బాధను మేము చూడలేకపోతున్నాము. దానిని దూరంగా తీసుకునిపోండి" అని ప్రార్థించి, Q&A సైట్లో కూడా అడిగితే, "మీ సమయం వచ్చింద"ని బాబా సమాధానం వచ్చింది. ఆ రాత్రి 8 గంటలకు ఆ కుక్కపిల్ల మృతిచెందింది. నిజానికి దాని బాధ చూడలేక నేను, "ఈరోజే ఆ కుక్కపిల్ల చనిపోతే 10 కుక్కలకు తిండి పెడతాన"ని కూడా బాబాకు వాగ్దానం చేశాను. అలా జరగడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. తరువాత మిగతా కుక్కలకు ఏ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలని ఊదీ పెట్టాను.
4) ఒకరోజు మా తాత ఆరోగ్యం దెబ్బతింది. ఇంట్లో అందరం చాలా బాధపడ్డాము. నేను Q&A సైటులో బాబాను అడిగితే, "నీవు విపత్తును అధిగమిస్తావు" అని సమాధానం వచ్చింది. వెంటనే నేను మా అమ్మతో కొంత ఊదీ పంపాను. దానితో ఆయన పూర్తిగా కోలుకున్నారు.
Q&A సైటులో సమాధానాలు కొన్నిసార్లు 3-4 వాక్యాలుగా వస్తాయి. మొత్తం సమాధానం మనకి సరిపోకపోవచ్చు. అందులో ఏదో ఒకటి మనకి సూటవుతుంది. కొన్నిసార్లు ఆ సమాధానం మనకి సంబంధం లేనట్లుగా ఉంటుంది. అయితే అది భవిష్యత్తులో జరగవచ్చు.
note: వారివారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి అనుభవం కలుగుతుంది.

కొన్ని ఇతర చిన్న అనుభవాలు:
1)ఒకసారి Q&A సైట్లో, "మీ సన్నిహిత స్నేహితుని నుండి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు" అని వచ్చింది. వెంటనే నా బెస్ట్‌ఫ్రెండ్ సోదరి వివాహం నిశ్చయమైంది అనే మెసేజ్ వచ్చింది.2) ఒకసారి, 'నీ చేతికి కొత్త వస్తువు వస్తుంద'ని వచ్చింది. అలాగే నాకు కొత్త చార్జర్ వచ్చింది.