కర్ణాటకకు చెందిన బాబా భక్తుడు డాక్టర్ జి.ఆర్.విజయకుమార్ ఇలా చెప్తున్నారు:
నేనిప్పుడే సారంగబాద్‌కి చెందిన సాయి సోదరుడు శ్రీ టి.ఏ.శ్రీరామనాథన్ వద్దనుండి ఒక లేఖ అందుకున్నాను. ఆ లేఖ యథాతథంగా క్రింద ఇవ్వబడింది.
"25 ట్యూన్ చేస్తే సిలోన్ రేడియో వస్తుంది - సాయితో ట్యూన్ అయితే సాయి అనుగ్రహం లభిస్తుంది"
ఎంత సత్యం ఈ మాటలు! 1982వ సంవత్సరంలో జరిగిన రెండు సంఘటనల నుండి నేను రక్షింపబడ్డ విషయం గుర్తుకువస్తున్నాయి. ఆ రెండు సందర్భాలలో బాబా అనుగ్రహం సమయానికి అందడం వల్లనే నేను రక్షింపబడ్డాను.
నేను కర్ణాటక మల్నాడ్ పరిసరాలలో పనిచేసేవాడిని. అక్కడ వర్షపాతం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఎటుచూసినా పచ్చదనం, సుందరమైన పర్వతాలు, అందమైన ప్రకృతిదృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. జూన్, జూలై, ఆగష్టు నెలల్లో వర్షాలతో చాలావరకు సూర్యుడ్ని అసలు చూడలేము.
1982, జులై 7 నా జీవితంలో చాలా అదృష్టవంతమైన రోజు. ఆరోజు నేను నా బుల్లెట్ బైక్ మీద ఎలెమడ్లు ఎస్టేట్ లో ఉన్న మా ఇంటినుండి 4 కిలోమీటర్ల దూరంలోని కరికొండలో ఉన్న ఆసుపత్రికి వెళ్తున్నాను. నేను కొండమీద ఎగుడుదిగుడుగా, వంకరటింకరగా ఉన్న రోడ్డుపై, దట్టమైన అడవి మార్గంగుండా వెళ్తున్నాను. నేను హెల్మెట్, రెయిన్ కోటు ధరించినా కూడా ఎడతెరిపి లేని వర్షంలో దాదాపు పూర్తిగా తడిసిపోయాను. ఉదయం 9 గంటలవుతున్నా ఇంకా మంచుగా కూడా ఉంది. నా పెళ్ళి తరువాత నేను బైకు వేగాన్ని 90 km నుంచి దాదాపు సగానికి తగ్గించాను. కొన్నిసార్లు అంతకన్నా తక్కువ వేగంతో నడుపుతున్నాను. నేను అలా నెమ్మదిగానే బండి నడుపుతుండగా, అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినపడింది - ఒక పొడుగాటి భారీ వృక్షం వేర్లతో సహా పెకిలించబడి పడిపోతోంది. ఆ భయంకర శబ్దానికి నేను నిశ్చేష్ఠుడినై బైకు మీద అదుపు కోల్పోయాను. నన్ను రక్షించే దైవం కోసం 'సాయిరామ్' అని గట్టిగా అరుస్తూ నాకు తెలియకుండానే బ్రేకులు వేసాను. నా పని అయిపోయింది అనుకున్నాను. అదే సమయంలో ఆ చెట్టు పెద్ద శబ్దంతో రోడ్డుకు అడ్డంగా పడింది. నా బైక్ వెళ్ళి ఆ చెట్టుబోదెకు గుద్దుకుని, ఇంజన్ ఆగిపోయింది. నేను బండిమీదనుండి ఎగిరి క్రిందపడి, వెంట్రుకవాసిలో చెట్టుకు గుద్దుకోకుండా బయటపడ్డాను. అంతా క్షణాలలో జరిగిపోయింది. నిదానంగా లేచి చుట్టూ చూసాను. నిజం చెప్పాలంటే నాకు ఏ దెబ్బలూ తగలలేదు, బైకు కూడా కొంచెంగానే దెబ్బ తింది. అది చాలా పాతచెట్టు. వేగంగా గాలి వీచడం వలన, వర్షం వలన అది వేళ్ళతో సహా బయటికి వచ్చినట్లుంది. ఆ చెట్టు కాండము 5 అడుగులకంటే ఎక్కువ వెడల్పు ఉంది. దాన్ని చూస్తూనే నాకు వణుకుపుట్టింది. అదికానీ నా మీద పడి ఉంటే ఏమై ఉండేదో అని ఊహించడానికే భయంగా ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు, ఎల్లప్పుడూ నన్ను కాపాడే సాయి అనుగ్రహం వల్లనే సమయానికి బైక్ అకస్మాత్తుగా ఆగింది. అదే పెద్ద అద్భుతం. ఆ దగ్గరలో ఉన్న షాపుకి తిరిగివచ్చి, ఎస్టేట్ మేనేజరుకి ఫోన్ చేసి రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టును తొలగించడానికి రెస్క్యూ టీమ్ ని పంపమన్నాను.
రెండవ అనుభవం:
3 నెలల తరువాత అలాంటి అనుభవమే మళ్ళీ నాకు జరిగింది. 1982 అక్టోబర్ 13న నేను నా మిత్రుడు డాక్టరు G.R.గణేశరావుని కలవాలనుకున్నాను. అతను నేనున్న ప్రదేశం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతిగ్రామ్ అనే గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. నా బైక్ పనిచేయనందున, నేను మా కంపెనీ బైక్ (యజ్డీ) తీసుకుని, నా అసిస్టెంట్ మిస్టర్ మింగేలీ డిసౌజాతో శాంతిగ్రామ్ వెళ్ళాను. డాక్టరు గణేశరావుని కలిసి తిరుగు ప్రయాణమయ్యాను. నేను కొండదిగి, ఒక చిన్న వంతెనను దాటాలి. కొండమీద నుండి క్రిందకి బండి నడుపుతుండగా, అకస్మాత్తుగా బైక్ వంకరటింకరగా పోతోంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాఫిక్ లేదు. నాకు బైక్ మీద అదుపు తప్పింది. నేను భయంతో ఒళ్ళు తెలియనిస్థితిలో ఉన్నాను. నా అసిస్టెంట్ 'సార్! సార్!' అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు. కానీ, నాకు ఏదీ వినపడటంలేదు. బండి వెళ్ళి వంతెనకి గుద్దుకుని మేమిద్దరం వెళ్ళి 50 అడుగుల క్రింద ఉన్న నీటి ప్రవాహంలో పడి చనిపోతామేమో అని అనుకున్నాను. బండి మీదనుండి క్రిందపడే లోపల నేను బాబా సహాయం కోసం అరిచాను. బండి వెళ్ళి ఆ వంతెనకి గుద్దుకుంది. మేము వంతెనకు కుడివైపు (రోడ్డువైపుకి) పడ్డాము. సాయినాథుని అనుగ్రహంవల్ల మేమిద్దరం రక్షింపబడ్డాము. అసలు విషయం ఏమిటంటే, బైకు వెనకాల టైరు పంక్చర్ అయినందున బండి అలా అడ్డదిడ్డంగా వెళ్ళింది.
కొంతకాలం తరువాత ఒక ఫారెస్ట్ గార్డు యజ్డీ బైకు మీద వెళ్తుంటే, వెనక టైర్ పంక్చర్ అయ్యి వంతెనకు గుద్దుకుని తక్షణమే చనిపోయాడు.
సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది!

మూలం: సాయిలీలా పత్రిక, డిసెంబర్ - 1983.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏🕉😀😊❤
ReplyDelete🕉 sai Ram
ReplyDelete