సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి భక్తుల అనుభవమాలిక -3

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఈరోజు భాగంలో అనుభవాలు:
  • బాబా తన హస్తస్పర్శతో నా తలరాతను మార్చి పునర్జన్మను ప్రసాదించారు.
  • శ్రీరాముడి పుట్టినరోజున జన్మిస్తాడు.


బాబా తన హస్తస్పర్శతో నా తలరాతను మార్చి పునర్జన్మను ప్రసాదించారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః
నా పేరు మోదడుగు వాసు. నేను నెల్లూరు నివాసిని. అసలే షుగర్, బి.పి పేషంటునైన నేను హఠాత్తుగా 2013, నవంబర్ 25న తీవ్రమైన అనారోగ్యానికి గురైనాను. 102డిగ్రీల జ్వరంతో నెల్లూరులోని వైద్యుడిని సంప్రదిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. మందులతో జ్వరం తగ్గడం, మరలా పెరగడం, ఇలా రోజులు గడుస్తుండేవి. ఇంతలో జాండిస్ కూడా అటాక్ అయ్యింది, రక్తశాతం తగ్గిపోయింది. ఏమీ అర్థంకాని పరిస్థితి. సాయిబాబా భక్తుడనైన నేను ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత, రాత్రి టిఫిన్ చేసిన తర్వాత మెడిసిన్ వేసుకుని సాయినాథుని స్మరిస్తూ నిద్రలోకి జారుకునేవాడిని. అలా ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలో ఉండగా బాబా దర్శనమిచ్చి, తన అమృతహస్తాలతో నా నుదుటిపై స్పృశించారు. తరువాత 7వ రోజు చెన్నైలోని విజయ హెల్త్ సెంటర్కి వెళ్ళాము. డాక్టర్లు పరీక్షించి నా శ్రీమతితో, "పరిస్థితి చాలా విషమంగా ఉంది. ముందు జనరల్ వార్డులో జాయినవ్వండి. పరిస్థితిలో మార్పు రాకపోతే I.C.U.లో చేర్చాల్సి ఉంటుంది" అని చెప్పారు. నా భార్య, "బాబా! నా భర్తని కాపాడండి" అని దీనంగా ప్రార్థించింది. తరువాత బాబా దయవలన 9వ రోజుకి నా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఆయన కృపాకటాక్షములతో త్వరలోనే కోలుకున్నాను. బాబా ఇచ్చిన పునర్జన్మగా భావించి ప్రతిరోజూ ఆయనకు ధన్యవాదములు తెలుపుకుంటూ, భజనలు, సత్సంగములు చేసుకుంటూ బాబా సేవలో పూర్తిగా తరిస్తున్నాము. ఇప్పుడు మేమెంతో సంతోషంగా ఉన్నాము. ఆ సాయినాథుని ఆశీస్సులు లేకపోతే నేను లేను. ఈ మెయిల్ ద్వారా బాబాకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను. ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు.

శ్రీరాముడి పుట్టినరోజున జన్మిస్తాడు.
ఒక అజ్ఞాత సాయిభక్తురాలి అనుభవం:

నేను సాయిభక్తురాలిని. అంతటా ఆయన ఉనికిని అనుభవించేలా నన్ను అనుగ్రహించారు బాబా. గత ఏడాది నేను ప్రెగ్నెంట్ గా  ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో ఆశలతో, ఆలోచనలతో చాలా ఆనందంగా ఉన్న సమయంలో మావారు ఆఫీసులో ఉన్న పరిస్థితుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. దాంతో నేను ఆందోళనకు గురయ్యాను. తరచూ "బాబా! మావారికి మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో దయచేసి చెప్పండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేనలా అడిగిన ప్రతిసారీ బాబా నుండి అనుకూలమైన సమాధానం వస్తూ ఉండేది. ఐతే మధ్యలో ఒకసారి నేను బాబాని అడిగినప్పుడు, "శ్రీరాముడి పుట్టినరోజున జన్మిస్తాడు" అని వచ్చింది. బాబా ఏం చెప్తున్నారో నాకప్పుడు అర్థంకాలేదు. బాబా లీల అది. 2018, మార్చి 25న శ్రీరామనవమి వచ్చింది. సరిగ్గా ఆరోజే బాబా ఆశీస్సులతో మాకు బాబు పుట్టాడు. అప్పుడు అర్థమైంది, 'శ్రీరామనవమి రోజు జన్మిస్తాడు' అని బాబా చెప్పిన మాటకు అర్థం. అలా బాబా మా బాబు జన్మదినాన్ని ముందుగానే సూచించారు. "లవ్ యు బాబా! మీరే నాకన్నీ".

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo