సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా నా ప్రార్ధన విన్నారు - పోయిన గాజు దొరికింది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు దీపన్విత దాస్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! మేము యు.ఎస్.ఏ లో ఉంటున్నాం. ఈమధ్యనే మేము ఒక స్వీట్ సిటీకి మారాము. ఇక్కడ మా ఇంటికి దగ్గర్లోనే బాబా మందిరం ఉండటంతో ప్రతి గురువారం బాబాని దర్శించుకునే అవకాశం లభించింది. ఇక్కడ బాబాని చూస్తే శిరిడీలో బాబాని చూసిన అనుభూతి కలుగుతుంది. నేను చాలా బాబా లీలలు చూశాను. వాటిలో ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ అనుభవం 2016లో మా బాబుకి రెండేళ్ల వయసున్నప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు జరిగింది. అప్పుడు మేము జైపూర్ లో ఉన్న మా మామగారి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవడానికి వెళ్ళాం. సొంతవాళ్ళతో పండుగ జరుపుకోవడంతో మేము ఎంతో సంతోషించాము. ముఖ్యంగా మా బాబు మొదటిసారి ఇండియా రావడంతో తన తాత, నాన్నమ్మ, ఇంకా ఇతర కుటుంబసభ్యులతో చాలా ఆనందంగా గడిపాడు. దీపావళి రోజంతా మేము పూజ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. సాయంత్రం పూజకి కాస్త ముందు మా అత్తగారు రెండు బంగారుగాజులు నాకు బహుమతిగా ఇచ్చారు. వెంటనే నేను వాటిని వేసుకుని, గాభరాగా పూజలో కూర్చున్నాను. తర్వాత దైవ దర్శనార్థం స్థానిక గుడులకు వెళ్ళాం. ఆరోజు దీపావళి కావడంతో రోడ్లన్నీ బాగా రద్దీగా ఉన్నాయి. అంతటా మందుగుండు సామాను కాలుస్తూ ఆనందంగా ఉన్నారు. నేను ఇంటికి తిరిగి వస్తూనే నా చేతులు చూసుకుంటే ఒక గాజు కనిపించలేదు. దీపావళి పండుగనాడు బంగారుగాజు పోవడం శుభసూచకం కాదని నాకు చాలా ఆందోళనగా అనిపించింది. మా అత్తగారు చాలా మంచివ్యక్తి. తను నన్ను ఏమీ అనకుండా,  "పోయిందేదో పోయింది. దాని గురించి ఏమీ దిగులుపడకు" అని చెప్పారు. కానీ నాకు బాధగానే ఉంది. ఇంట్లో చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉండటంతో నేను గాజులు వెదకడానికి బయటికి వెళ్ళలేకపోయాను. పైగా బయట కూడా  జనసందోహం ఎక్కువగా ఉంది. నేను చాలా దిగులుగా, "బాబా! నాకు సాయం చేయండి" అని ప్రార్థించడం మొదలుపెట్టాను. రాత్రి ఇంట్లో, ఇంటిచుట్టూ, గార్డెన్లో, డాబాపై వెతికాను, కానీ ఎక్కడా గాజు దొరకలేదు. ఆ దిగులుతోనే పడుకున్నాను. కానీ దీపావళినాడు అత్తగారు తన చేతులతో ఇచ్చిన ఆ బంగారుగాజులు నాకెంతో విలువైనవిగా భావించి రాత్రంతా, "గాజులు దొరికేలా చేయమ"ని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఉదయాన తొందరగా లేచి, త్వరగా తయారై మేము గుడికి వెళ్ళిన దారిలో వెతకడానికి బయలుదేరాను. ఇంట్లో అందరూ, "ఏం ప్రయోజనం ఉండదు. దీపావళి రాత్రి తర్వాత ఇండియాలోని రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!" అన్నారు. కానీ బాబా నా గాజులు నాకు ఇప్పిస్తారని పూర్తి నమ్మకంతో ఇంటినుండి బయలుదేరాను. పదిహేను నిమిషాలు నడిచానో, లేదో రోడ్డు మధ్యలో గాజు నొక్కబడిపోయి, పగిలిపోయి కనిపించింది. చూస్తూనే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కన్నీళ్ళతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ బాబాకే తెలుసు, ఎన్ని బైకులు, కార్లు దాని మీదనుంచి వెళ్ళుంటాయో! కానీ మిరాకిల్ ఏమిటంటే, ఎవరి కంట్లోనూ అవి పడలేదు. తరువాత స్థానికంగా ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చి, గాజు దొరికిన విషయం చెప్తే, ఎవరూ నమ్మలేకపోయారు. నాకు తెలుసు బాబా నా ప్రార్థన వింటారని. "బాబా! రోజురోజుకీ నా భక్తి వృద్ధి చెందుతూ ఉండేలా నన్ను అనుగ్రహించండి".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo