సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ నారాయణ్ నీలకంఠ కరాధికార్


బాబా దైవత్వం గురించి కరాధికార్ అనుభవం

నారాయణ్ నీలకంఠ కరాధికార్ అలియాస్ బాపూసాహెబ్ 1893వ సంవత్సరంలో పూణేలో జన్మించాడు. అతనికి 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు వాళ్ళింట్లో గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కొలువై ఉండేది. అతని గురువు పేరు గోపాల్ గురు. కరాధికార్ తన తల్లి, అన్నయ్య వాసుదేవరావులతో కలిసి స్వామి సమర్థుని పూజించే విధంగా అతడిని గోపాల్ గురు ప్రభావితం చేశారు. వాళ్లంతా ప్రతిరోజు సాయంత్రం క్రమంతప్పకుండా గోపాల్ గురు ఆశ్రమంలోని స్వామి సమర్థ ఆరతికి హాజరయ్యేవారు. 1907లో గోపాల్ గురు సమాధి చెందారు. దాంతో ఆయన కుమారుడైన శ్రీ అభాసాహెబ్ చితలే గారిని ఆధ్యాత్మికంగా తమకు మార్గనిర్దేశం చేయమని వాళ్ళు అభ్యర్థించారు. ఆయన వాళ్లకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేయడమే కాకుండా, ఆ కాలంలో ఉన్న ఎంతోమంది సత్పురుషులను కలిసేలా చేశారు. వాళ్ళు కలిసిన కొంతమంది సాధువులు కేస్కర్ మహారాజ్, గొండేవాల్కర్ మహారాజ్, నారాయణ్ మహారాజ్, బాబురావు బెడే, గుళవణి మహారాజ్ మరియు శిరిడీ సాయిబాబా.

నారాయణ్ నీలకంఠ కరాధికార్ సాయిబాబా ద్వారా తను పొందిన అనుభవాన్ని చాలా దృఢంగా ఇలా చెప్తున్నారు: "1914 - 1916 మధ్యకాలంలో నేను చాలాసార్లు శిరిడీ సందర్శించాను. బాబా పాదాలకు సర్వస్యశరణాగతి చెందిన తరువాత నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకున్నాను. కేవలం ఆయన పాదాలు తాకినందునే నేను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి ఎదిగాను. అది పదివేల సంవత్సరాలు తపస్సు చేసినా సాధ్యంకానిది. ఆ అత్యున్నత స్థితి సూర్యచంద్రుల కంటే అతీతం, ఎందుకంటే ఆ దైవత్వం ఆయన భౌతిక శరీరం నుండి అణువణువునా ప్రకాశించేది. 

నేను శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందాను. సంగీతం గురించి నాకు మంచి జ్ఞానం ఉంది. బాబా దర్బారైన ద్వారకామాయిలో నాకు పాడాలని కోరిక ఉన్నందున ఒకసారి బాబాను అనుమతి అడిగాను. బాబా అన్నారు, "ఇప్పుడు కాదు, నీవు కొన్నిరోజులు ఉందామని వచ్చావు. వారం, అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు పాడుదువు" అని. అప్పుడు నా తల ఆయన పాదాల మీద ఉంచాను, ఆ పాదాల యొక్క పవిత్రత నన్ను (నా జీవాత్మను) పూర్తిగా చుట్టుముట్టింది. నేను ఆయన పాదాలపై ఉన్న స్వేదాన్ని(తడి) పవిత్రమైన పాదతీర్థంగా భావించి, నెమ్మదిగా నా నాలుకతో ఆ పాదాలను నాకాను. వెంటనే బాబా, "అరె! ఎందుకు నా పాదాలకు వింతగా నమస్కారం చేస్తున్నావు?" అన్నారు.

సమాప్తం.

Source:  Ref: Sai Prasad Magazine, Deepavali issue, 1999.
Source : Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

5 comments:

  1. Om Sairam ��

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo