సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దాసగణు మహరాజే! - పుండలీకరావు


దత్తావతారంగ, నిప్పులు కడిగే వైదిక సదాచార పరాయణుడుగ,  ఆర్ష ధర్మప్రచారకుడిగ మహారాష్ట్ర దేశంలో ప్రఖ్యాతుడైన శ్రీవాసుదేవానందస్వామి (తేంబేస్వామి), ఫక్తు ముసల్మాను ఫకీరుగ ప్రకటమైన శ్రీసాయిబాబాకు సాష్టాంగనమస్కారాలు అర్పిస్తూ, టెంకాయ పంపడం - అత్యంత ప్రాముఖ్యం కలిగిన విశేష సంఘటన.

ఈ ఉదంతాన్ని మొదట (1906లో) శ్రీ దాసగణు మహరాజ్ తమ "భక్తిసారామృతం"లో గ్రంథస్థం చేసారు. ఆ తరువాత ఈ సాయిలీలను శ్రీహేమాద్పంతు తమ "శ్రీసాయి సచ్చరిత్ర”లో పొందుపరచారు. దరిమిలా, ఆ తరువాత ప్రచురింపబడిన ఎన్నో సాయి చరిత్రలో యీ లీల యథాతథంగా చోటు చేసుకొంది. 

అయితే, విశేషమేమంటే యీ లీలలలో పేర్కొనబడిన పుండలీకరావు, మరెవరో కాదు - శ్రీదాసగణు మహరాజే! ఈ విషయాన్ని శ్రీదాసగణు మహరాజే 1936లో స్వయంగా తమ స్మృతులలో వెల్లడించారు(Devotees Experiences of Sri Sai Baba' Vol. 2, P.30). శ్రీదాసగణు తమ స్మృతులలో ఇలా అంటారు: 

నేనొకసారి పూరీ జగన్నాథ్ యాత్ర చేసాను. దారిలో అంతకు ముందే నాకు సుపరిచితులైన శ్రీ తేంబేస్వామి  (వాసుదేవానంద సరస్వతి) వారిని దర్శించాను. ఆయన నన్ను “శిరిడీ వెళ్తున్నావా?” అని అడిగారు. దానికి నేను “పోతాను! అయితే వెంటనే కాదు. కొన్ని మాసాల తరువాత వెళ్తాను!” అని అన్నాను. అప్పుడు ఆయన “ఇది నేను సమర్పించానని చెప్పి సాయిబాబాకు ఇవ్వు!” అని నా చేతికొక కొబ్బరికాయ నిచ్చారు. ఆ తరువాత నా ప్రయాణాలలో, నా సహచరులు, ఆ టెంకాయ తీసి తినేశారు. నేను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించగానే ఆయన నాతో “ఏమిరా దొంగ వెధవ! నా సోదరుడిచ్చిన టెంకాయ ఏది?” అని అడిగారు.

ఇదేకాక, సాయి చరిత్రలలో పేర్కొనబడిన మరెన్నో ప్రఖ్యాత సాయి లీలలకు శ్రీదాసగణు ప్రత్యక్షసాక్షి అయినా, తన హరికథా సంకీర్తనలలో గానీ, రచనలలోగానీ సాధ్యమైనంత వరకు తన పేరు తరచు రాకుండా జాగర్త వహించేవాడు - శ్రీదాసగణు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆయన: “నేను రచించిన శ్రీసాయిచరిత్రలలో నా పేరు ప్రముఖంగా కనిపించడం ఎందుకని, నా పేరు ఎక్కువసార్లు రాకుండా చూచుకొన్నాను" అంటారు.

సోర్స్ : సాయిపథం వాల్యూం - 3

3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo