సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 81వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 81వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 144

శ్రీ అబ్దుల్  భాయ్ కి వచ్చిన అనుభవం.

అబ్దుల్ నాందేడ్ నివాసి. బాబా సమాధి చెందడానికి సుమారు 9-10 సంవత్సరాల ముందు శిరిడీకి బాబా సేవకోసమై వచ్చి నివసించసాగాడు. బాబా సమాధి చెందిన తరువాత కూడా, జీతం వంటివి తీసుకోకుండా కేవలం అన్నవస్తాల వంటివి తీసుకొని సమాధికి సేవ చేసుకోసాగాడు. బాబా దేహధారిగా ఉన్న రోజులలో తనపై చాలా పని భారం ఉండేది. ఆ పనంతా తాను ఎంతో ప్రేమగా, భక్తిగా చేసుకొనేవాడు. తాను ఎప్పుడు చావడిలో ఉండేవాడు. ప్రస్తుతం సమాధికి దగ్గరగా ఒక గదిలో ఉంటున్నాడు. రాత్రిపూట కూడా విశ్రాంతి తీసుకోకుండా ఖురాన్ చదువుకుంటూ చాలా సమయం గడిపేవాడు. ప్రస్తుతం కూడా అదే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కానీ, ఇంట్లో వాళ్లందరినీ వదలి తాను శిరిడీలో ఉండసాగాడు. వాళ్ళ తల్లిగారు మరియు కొడుకు అప్పుడప్పుడు శిరిడీకి వచ్చేవారు. తన భార్య కూడా ఒకసారి శిరిడీకి వచ్చింది. కానీ, తాను ఎటువంటి మోహానికి లోనుకాకుండా సేవ చేసుకుంటూ, శిరిడీలోనే ఉండేవాడు. అబ్దుల్ బాబా కొడుకు వివాహం గురించి చింత తన తల్లిగారికి ఉండేది. తాను ఒక చోట వివాహం కుదర్చడానికి ప్రయత్నించింది, కాని అబ్బాయి తండ్రి ఫకీరుగా మారడం వలన మా అమ్మాయిని ఇచ్చే ప్రసక్తి లేదని వాళ్ళ తల్లిగారు తేల్చి చెప్పేసారు. ఆ తరువాత ఆమె వచ్చి బాబా దగ్గర ఫిర్యాదు చేసింది. అప్పుడు బాబా ఆమెతో "కొంచెం ఓపిక పట్టు. ఆందోళన చెందవద్దు. అబ్బాయికి మంచి అమ్మాయి దొరుకుతుంది. వాళ్ళకై వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు” అని చెప్పారు. తరువాత కొన్ని రోజులకు బాబా చెప్పిన విధంగానే జరిగింది.  ఒకసారి అబ్దుల్ యొక్క తల్లిగారు మరియు కుమారుడు ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక గృహస్తుని కలవడం జరిగింది. ఆ గృహస్థు “మీరు మా అమ్మాయిని వివాహం చేసుకోండి” అని విన్నవించాడు. తనకు కొంతమంది “అబ్బాయి తండ్రి ఫకీరుగా మారాడు” అని చెప్పారు. దానికి తాను “అబ్బాయి తండ్రి ఫకీరు అయినా, నాకు అభ్యంతరం లేదు. మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇస్తున్నాను” అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ విధంగానే వివాహం కూడా వెనువెంటనే జరిగిపోయింది. ఆ గృహస్థుకు వివాహం జరగాల్సిన పెద్దకూతురు ఉంది. ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. ఆమెకు కాకుండా చిన్న కూతురికి చేస్తే, పెద్ద అమ్మాయి సంబంధం రద్దయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ గృహస్థు ఆగకుండా, వాళ్ళ చిన్నమ్మాయిని అబ్దుల్ కుమారునికి ఇచ్చి వెనువెంటనే వివాహం చేసాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo