ఈరోజు భాగంలో అనుభవాలు:
- ముగ్గురు భక్తులకు బాబా తమ ఉనికిని తెలియజేస్తూ చూపిన అద్భుతం.
అద్భుతం 1:
సాయిభక్తురాలు అద్వితీయ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను గత 10 సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. సాయిభక్తులందరికీ నమస్తే! నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం ఒక కోరిక నెరవేరడం గురించి కాదు, బాబా నాకు చూపిన అద్భుతానికి సంబంధించినది.
2018 డిసెంబరులో నేను పారాయణ చేయటానికి పూజగదిలో కూర్చున్నాను. ఎప్పటిలాగే ముందుగా నేను దీపం వెలిగించడానికి అగ్గిపెట్టెను తీసి అగ్గిపుల్ల వెలిగించి దీపం వెలిగించబోయాను. కానీ వత్తి అంటుకోలేదు. నేను మళ్ళీ ఇంకో అగ్గిపుల్ల తీసి, అగ్గిపెట్టె తాకను కూడా తాకలేదు, అంతలోనే ఆశ్చర్యకరంగా అగ్గిపుల్ల దానంతట అదే అంటుకుంది. కళ్ళముందే జరిగిన అద్భుతంతో నేను ఆశ్చర్యపోయాను. 'అగ్గిపుల్ల వెలగడానికి అక్కడ వేరే మంట కూడా ఏమీ లేదు. అలాంటిది అదెలా జరుగుతుంద'ని కళ్ళతో చూసినదాన్ని కూడా నేను నమ్మలేకపోయాను. కొన్నిరోజుల తరువాత 2019, మార్చిలో మళ్ళీ అలాంటి అనుభవమే నాకు జరిగింది. ఆరోజు కూడా నేను పారాయణ చేస్తూ, అగ్గిపుల్ల తీసి, కనీసం వెలిగించే ప్రయత్నం కూడా చేయలేదు, అంతలోనే అగ్గిపుల్ల దానంతట అదే వెలిగింది. నేను ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టుకుని ఉండిపోయాను. ఆయన నాతోనే ఉన్నారని తెలియజేసి నా విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు బాబా చేసిన లీల ఇది. "నా కళ్ళముందు ఇంత అద్భుతాన్ని చూపి, నన్ను మీ లీలకు సాక్షిగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఈ అనుభవాన్ని వ్రాయడంలో నేను నా వంతు ప్రయత్నం చేసినప్పటికీ, అందరికీ అర్థమయ్యేలా సమగ్రవంతంగా వ్రాయలేకపోయినందుకు నన్ను క్షమించండి. ప్రణామాలు దేవా!"
సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2451.html

అద్భుతం 2:
సాయిబంధువులందరికి 'ఓం సాయిరామ్!' నా పేరు షలాఖ. నేను ముంబాయిలో నివాసముంటున్నాను. పదిరోజుల క్రితం రాఖీ పండుగరోజున(2019 ఆగష్టు 15) బాబా చూపిన ఒక అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. చదివి మీరు కూడా ఆనందిస్తారు. మనమంతా తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆఖరికి మన తోబుట్టువు కూడా ఆ సాయినాథుడే అని నమ్ముతాము. అందుకే చాలామంది రాఖీ పండుగరోజున బాబాకు రాఖీ కడుతుంటారు. మనకే కష్టం వచ్చినా తక్షణమే రక్షణనిచ్చేది ఆయనే కదా మరి. ఇక ఆరోజు మా ఇంట్లో జరిగిన అద్భుతమైన లీల చదవండి.
మావారి పేరు అమోల్. ఆయన చెల్లెలు అశ్విని స్వయంగా వచ్చి తన అన్నకు రాఖీ కట్టే వీలులేక ఒక రాఖీ పోస్టులో పంపింది. రాఖీ పండుగరోజున మావారు బాబాకు తాజా ఎర్రగులాబీలు, పేడాలు తెచ్చారు. మావారి చెల్లెలు పంపిన రాఖీని మా అమ్మాయి మనస్వి వాళ్ళ నాన్న చేతికి కట్టింది. నేను పూజకు అన్నీ సిద్ధం చేస్తుండగా మా చెల్లి విశాఖ వచ్చింది. ఇక్కడ మా సంప్రదాయం ప్రకారం బావకు కూడా రాఖీ కట్టవచ్చు. అందుకే మా చెల్లి మావారి కోసం రాఖీ తెచ్చి మావారి చేతికి కట్టింది. రాఖీలు కట్టడం అయ్యాక ఆరతి ఇవ్వాలి. అందుకోసం నేను ఆరతి పళ్లెంలో దీపం, మిఠాయిలు వగైరా అన్నీ సిద్ధపరచుకున్నాను. హఠాత్తుగా పళ్లెంలోని దీపం ఆరిపోయింది. అదెంతో అపశకునమని నేను చాలా బాధపడ్డాను. "బాబా! నేనేమి తప్పు చేశాను, ఇలా జరిగింది?" అని నాలో నేను చాలా వేదనపడ్డాను. మావారు, "ఏమీ కాదులే, అనవసరంగా ఆందోళనపడకు. వెళ్లి అగ్గిపెట్టె తీసుకుని రా, దీపం వెలిగిద్దాం" అన్నారు. నేను అగ్గిపెట్టె తెచ్చి దీపం వైపు చూసేసరికి పళ్లెంలో ఉన్న దీపం అప్పటికే వెలుగుతూ కనిపించింది. మా అందరి శరీరాలు రోమాంచితమై మేమంతా ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాం. ఎంత అద్భుతం! నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నా వేదన బాబా విన్నారు, నన్ను కరుణించారు. రక్షాబంధన్ రోజు ఆయన తమ ఉనికిని తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదించారు. "బాబా! మీ లీలలు అనంతం. మీరు మాతో ఉన్నారని మీ ఉనికితో తెలియజేసి ఆ రోజును మాకు ప్రత్యేకమైనదిగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు".
సేకరణ: శ్రీమతి మాధవి.
అద్భుతం 3(ఇది నా స్వీయ అనుభవం):
పైన ఇవ్వబడిన మొదటి అనుభవాన్ని నేను ఇంగ్లీషులో చదివి, తెలుగులోకి అనువాదం చేయాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను. అలాంటి స్థితిలో దాదాపు అలాంటిదే అయిన రెండవ అనుభవాన్ని బాబా నా ముందుకు తీసుకొచ్చారు. అది చదివాక గతంలో నాకు జరిగిన ఒక అనుభవం గుర్తుకు వచ్చింది. అప్పుడు నాకనిపించింది, నేను సందిగ్ధంలో ఉన్నానని మళ్ళీ అటువంటి అనుభవాన్నే నా ముందుకు తెచ్చి, నాకు కూడా అటువంటి అనుభవం ఉందని గుర్తుచేసి మరీ 'సందేహం ఏమీ పెట్టుకోకుండా అనువదించమని బాబా సూచిస్తున్నార'ని. అలా ఈ అనుభవాలను మీ ముందుకు తీసుకొచ్చేలా చేశారు బాబా. ఎన్నోసార్లు ఈ బ్లాగు నిర్వహణ తమదేనని సూచించిన బాబా, ఈ అనుభవంతో మరోసారి నిర్ధారించారు. ఇక నాకు జరిగిన అనుభవాన్ని చదవండి.
మా ఇంట్లో రోజూ ఉదయం పూజగదిలో ఒక దీపాన్ని వెలిగిస్తాం. దాదాపు రాత్రివరకు అది వెలుగుతూ ఉండేలా మేము చూసుకుంటాం. అందుకోసం మధ్యమధ్యలో వత్తిని సవరించడం, నూనె వేయడం నేను చేస్తూ ఉంటాను. ఒకరోజు నేను నా అలవాటు ప్రకారం(సరిగా గుర్తులేదు గాని, మధ్యాహ్నం అనుకుంటాను) పూజగదిలోకి వెళ్లేసరికి దీపం ఆరిపోయి ఉంది. సరే వెలిగిద్దామని అగ్గిపెట్టె చేతిలోకి తీసుకుని క్రిందకి చూసేసరికి దీపం వెలుగుతూ కనిపించింది. "ఏమిటిది? కాసేపటిక్రితం వెలిగిలేదే? ఇంతలోనే ఎలా వెలుగుతూ ఉంది?" అని ఆశ్చర్యపోయాను. నా కళ్ళతో చూసిన దాన్ని కూడా నేను నమ్మలేకపోయాను. బహుశా భ్రమపడ్డానేమోనని అనుకుని నేనసలు అది ఒక మిరాకిల్ గా కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ రెండు అనుభవాలు చదివాక ఎన్నోరోజుల క్రితం బాబా నాకు చూపించిన అద్భుత లీలను గుర్తించగలిగాను. అనుభవాన్ని ఇవ్వడమే కాదు, దానిని మనం గ్రహించేలా కూడా బాబా చేస్తారనడానికి ఇదొక నిదర్శనం. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రతిక్షణం నాకు అండగా ఉంటూ వ్యక్తిగతంగానూ, మరోవైపు బ్లాగు విషయాల్లోనూ నాకు సహాయం చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడూ నాకు మార్గదర్శనం చేస్తూ, నన్ను ముందుకు నడిపించండి బాబా!”
No comments:
Post a Comment