సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబాను దర్శించిన ఒక స్త్రీ



ఒక స్త్రీకి 25 ఏళ్ళ వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు. తన తోటి బంధువులకు, స్నేహితులకు సరైన వయస్సులో పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టారు. కానీ తనకు మాత్రం పెళ్లి కాకపోవడంతో ఆమె తనను తాను కుటుంబానికి భారంగా భావించింది. మనసంతా బాధతో నిండిపోగా ఆమెకు జీవితం దుర్భరంగా తోచింది. అటువంటి స్థితిలో ఆమె తన స్నేహితులలో ఒకరి ద్వారా బాబా గురించి విన్నది. వెంటనే ఆమె మనసులోనే బాబాకు నమస్కరించుకుని, "సంవత్సరంలోపు నాకు పెళ్ళై జీవితంలో స్థిరపడితే శిరిడీ వచ్చి మీ పాదాలకు నమస్కరించి, మీకు ఒక కొబ్బరికాయను సమర్పించుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకుంది. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు 'తనకు తెలియకుండా తన తల్లిదండ్రులు తనకోసం తగిన వరుడిని చూశార'ని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. బాబాను ప్రార్థించినట్లే సంవత్సరంలోపు ఆమెకు పెళ్ళై అత్తవారింట స్థిరపడింది. ఇక తన మ్రొక్కును తీర్చుకోవడం మిగిలింది.

ఆమె తన మ్రొక్కు గురించి, శిరిడీ దర్శించాలన్న తన కోరిక గురించి  అత్తవారింట చెప్పింది. కానీ వాళ్ళకు బాబాయందు విశ్వాసం లేకపోవడంతో శిరిడీ వెళ్లడానికి అనుమతించలేదు. ఆమె ఎంతో నిరాశ చెందినప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా తన భర్తను శిరిడీ వెళ్ళడానికి అనుమతినిమ్మని అడుగుతూ ఉండేది. చివరికి అతను అనుమతినిస్తూ, "కానీ మేమెవ్వరం నీతో రాలేము. నువ్వు ఒంటరిగా శిరిడీ వెళ్లాల్సి ఉంటుంది" అని ఆమెతో చెప్పాడు. భర్త అనుమతించడంతో ఆమె ఎంతో సంతోషంగా శిరిడీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొని, ఒక కొబ్బరికాయను తీసుకుని శిరిడీకి ప్రయాణమైంది.

ఆమె శిరిడీ చేరుకున్నాక స్నానాదులు ముగించుకొని మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకుంది. కొంతసేపు అక్కడే కూర్చున్న తరువాత బాబా అనుమతి తీసుకొని తన బసకు వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక తన ముక్కుకి ఉండాల్సిన నత్తు(ముక్కెర) లేదని గమనించింది. వెంటనే అన్నిచోట్లా వెతికింది కానీ, అది ఎక్కడా కనపడలేదు. అంతలో బాబాకు కొబ్బరికాయ సమర్పించుకోలేదని గుర్తొచ్చి జరిగిన నష్టానికి ఏడుస్తూ అసంతృప్తిగా ద్వారకామాయికి వెళ్ళింది. బాబా చాలా ప్రసన్నంగా కూర్చొని ఉన్నారు. నిర్మలమూ, ప్రశాంతమూ అయిన బాబా రూపాన్ని చూసి ఆమె మాట్లాడకుండా ఉండలేక, "బాబా! నాకు పెళ్ళైతే మీకు సమర్పిస్తానని మాటిచ్చిన కొబ్బరికాయ ఇదిగో, తీసుకోండి. నా కోరిక నెరవేరడంతో నాకు మీ మీద అవధులు లేనంతగా భక్తిప్రపత్తులు పెరిగాయి. దాంతో నా మ్రొక్కు తీర్చుకోవడానికి ఒంటరిగా ఇంత దూరం వచ్చాను. కానీ ఇక్కడ నేను నా నత్తును పోగొట్టుకున్నాను. అది చాలా అశుభసూచకం. పైగా నేను నా భర్త, అత్తమామల ఆగ్రహాన్ని ఎదుర్కోవాలి" అని బాధపడింది. ఆమె చెప్పిందంతా ఓపికగా విన్న బాబా ఎంతో ప్రశాంతంగా, "అనవసరంగా బాధపడకు. నీ నత్తు నీతోనే ఉంది" అని అన్నారు. ఆమె ఆత్రంగా తన ఒంటిమీద ఉన్న బట్టలు విదిలించి నత్తు కోసం గాలించింది. కానీ, అది కనపడలేదు. అయితే, అప్పటికే తన తిరుగు ప్రయాణానికి ఆలస్యమవుతుండటంవల్ల ఆమె బాబాతో, "ఈ కొబ్బరికాయ తీసుకోండి బాబా" అని అంది. అందుకు బాబా, "కొబ్బరికాయ నీది. నువ్వే పగులగొట్టు" అని అన్నారు. కానీ ఆమె ఆ కొబ్బరికాయను బాబా చేతికే ఇవ్వసాగింది. బాబా పదేపదే, "దీనిని పగులగొట్టు" అని అనసాగారు. ఇలా కొంతసేపు జరిగాక చివరికి ఆమె ఆ కొబ్బరికాయను బాబా ముందు పగులగొట్టి, ఆ రెండు కొబ్బరిచిప్పలను బాబా చేతికి అందివ్వబోతుండగా వాటిలో ఒకదాంట్లో తన నత్తు ఉండటం గమనించింది. ఆశ్చర్యంతో పదేపదే ఆ నత్తును చూస్తూ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోగా కృతజ్ఞత నిండిన మనసుతో ఆమె బాబాను చూడగా బాబా చిన్నగా నవ్వారు.

సోర్సు: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్ని చిట్లూరి.

11 comments:

  1. ఓమ్ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
    సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్
    షిర్డీ కే దాతా సబ్సే మహాన్!!🙏💐🙏

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Om sai ram baba amma ni rakshinchu thandri sainatha

    ReplyDelete
  5. నేను ఒక సాయి భక్తుడను
    మా ఇంట్లో ఒక బంగారు కమ్ముల జత కనపడలేదు.2.3.రోజులు వెతికాము కానీ కనపడలేదు.కమ్మలు కనపడితే
    ఈ విషయం బ్లాగ్లో పోస్ట్ చేస్తానని అనుకొని మరల వెతికను. అప్పుడు కమ్మలు కనపడ్డాయి సాయిబాబాకు ధన్యవాదాలు.ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸🌸🌸

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo