- బాబా సందేశం నిజమై తీరుతుంది
- సాయితండ్రి నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతున్నారు
- బాబా ఉనికి సత్యం
బాబా సందేశం నిజమై తీరుతుంది
సాయిభక్తురాలు అనూష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
బాబా ఆశీస్సులతో అక్టోబరు నెలలో నాకు పెళ్లి అయ్యింది. ఆ అనుభవాన్ని నేను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు వీసా ఎలా అనుగ్రహించారో మీతో పంచుకుంటాను. నా భర్త విదేశాల్లో ఉంటున్నారు. నేను తన దగ్గరకు వెళ్ళడానికి అవసరమైన వీసా కోసం అక్టోబరు నెలలో దరఖాస్తు చేశాను. అయితే తరువాత నాకు ఆఫీసు నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు నేను క్వశన్ అండ్ ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, "మకరసంక్రాంతికి నువ్వు అనుకున్నది జరుగుతుంది" అని వచ్చింది. నేను సంతోషించాను. కానీ బాబా ఒక మెలిక పెట్టారు. నేను వీసా కోసం చేసుకున్న దరఖాస్తు రద్దు అయ్యింది. దాంతో నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ వీసా కోసం దరఖాస్తు చేశాను గానీ, ఏప్రిల్, మే నెల వరకు వీసా దొరకదని అందరూ అన్నారు. నాకు వీసా వచ్చేలా అనుగ్రహించమని నేను బాబాను గట్టిగా వేడుకున్నాను. కానీ మనసులో, 'బాబా! నేను అనుకున్నది సంక్రాంతికి జరుగుతుంది అన్నావు, ఇదేనా జరగటం?' అని అనుకునేదాన్ని. రోజూ బాబా ముందు దీపం పెట్టేటప్పుడు, చాలా బాధగా ఆయన వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వచ్చేసేదాన్ని. బాబా ఏమి చేశారో చూడండి! దొరకదనుకున్న వీసా అపాయింట్‌మెంట్ దొరికేలా చేశారు. అది కూడా ఆయన మాట ఇచ్చినట్టే సంక్రాంతిరోజే నా వీసా ఇంటర్వ్యూ. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఏమౌతుందోనని వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు కూడా నేను చాలా భయపడ్డాను. నేను అలా మధనపడుతున్నప్పుడు బాబా నాకు ఎలా సమాధానం ఇచ్చారో తెలుసా! మన 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్' ద్వారా బాబా ఫోటోతో ఉన్న ఒక సందేశం నాకు వచ్చింది. (దానిని ఈ క్రింద జతపరుస్తున్నాను, చూడండి.) అది చదివాక మనసుకు చాలా ఆనందం కలిగింది. ఇంటర్వ్యూలో నాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. క్యూలో ఉన్నప్పుడు ‘బాబా’ అని తలచుకోగానే అప్పటిదాకా నా ముందు ఉన్న సమస్యను తొలగించి నాకు ఏ సమస్యా లేకుండా చేశారు. చివరికి బాబా చెప్పిన సమయానికి ఆయన ఆశీస్సులతో నాకు వీసా వచ్చింది. ఇంత ప్రేమ చూపే బాబాకు ఏమని కృతజ్ఞతలు చెప్పేది? మనిషిని కదా, సహనంగా ఉండలేక ఆ తండ్రిని నిందిస్తూ ఉన్నందుకు ఆయనను క్షమించమని అడగటం తప్ప. "థాంక్యూ సో మచ్ బాబా!!"
సాయితండ్రి నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతున్నారు
అమెరికా నుండి సాయిభక్తురాలు శ్రీమతి సౌజన్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకి నా వందనం. మేము అమెరికాలో నివాసముంటున్నాము. మాకు ఇద్దరు పిల్లలు. చిన్నతనంనుండి బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రతి వారం నేను బాబా గుడికి వెళ్తుండేదాన్ని. సాయితండ్రి నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతున్నారు. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన చాలా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇటీవల బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. కరోనా సమయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. కానీ ఒకరోజు అనుకోకుండా మేము మా స్నేహితుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రెండు రోజులుండి తిరిగి వచ్చాక మావారికి జలుబు చేసింది. అసలే కరోనా సమయం కాబట్టి జలుబుకి కూడా చాలా భయపడ్డాము. బాబాకు నమస్కరించి, "మావారికి జలుబు తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకొని, బాబా ఊదీని మావారికి పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. బాబా దయవలన ఒక్కరోజులోనే తన జలుబు తగ్గిపోయింది. అదే సమయంలో మా పాప తనకు ఒళ్ళునొప్పులుగా ఉన్నాయని చెప్పింది. నేను వెంటనే తనకు బాబా ఊదీ పెట్టి, బాబా నామస్మరణ చేస్తూ పడుకోబెట్టాను. నా తండ్రి సాయినాథుని దయవల్ల తను పూర్తిగా కోలుకుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ ఎల్లప్పుడూ మాపై మరియు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్లీజ్ బాబా!"
బాబా ఉనికి సత్యం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
మా ఇంటిలో అద్దెకు ఉన్నవాళ్ళు ఖాళీ చేసినందున మా నాన్నగారు ఎవరైనా త్వరగా ఆ ఇంటిలో అద్దెకు చేరాలని అనుకున్నారు. అయితే, దాదాపు రెండు, మూడు నెలలు ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. నాన్న బాబాకి గొప్ప భక్తులు. అతను చాలా బాబా లీలలను అనుభవించారు. అయినప్పటికీ ఒకరోజు అతను సాయి మందిరం ముందుగా వెళ్తూ, "మీరు నిజంగా ఉంటే, ఈరోజే మా ఇంటిలో అద్దెకు చేరాలి" అని బాబాను సవాలు చేశారు. "అలా జరిగితే ఆ రోజు నుండే ఐదు దీపాలతో సాయి పూజ ప్రారంభిస్తాన"ని బాబాకి మాట కూడా ఇచ్చారు. ఆశ్చర్యం! అద్భుతం! మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఇంటిలోకి అదేరోజు సాయంత్రం అద్దెకు చేరారు. ఇది కేవలం బాబా దయవల్లనే! "ధన్యవాదాలు బాబా".
జై జై సాయిరామ్!
source:http://www.shirdisaibabaexperiences.org/2020/06/shirdi-sai-baba-miracles-part-2753.html#experience4
Om sairam
ReplyDelete🙏💐🙏 ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺
Om sai ram ji I want to write one leela.sai blessed my son with vaccine.he is fine.om saima
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
633 days
ReplyDeleteSairam
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba ma mother health arogyanga vundali thandri
ReplyDeleteBaba santosh salary hike ayyi mng shift ravali thandri
ReplyDelete