సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 689వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. కోరిన వెంటనే బాబా అనుగ్రహిస్తారు
  2. సాయి ఉన్నారు

కోరిన వెంటనే బాబా అనుగ్రహిస్తారు


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నాకు, సాయికి మధ్య తల్లీకూతుళ్ళకు ఉన్న అనుబంధం ఉందని చెప్పటానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అనునిత్యం నేను సాయిచాలీసా చదువుతూ నిద్రలేస్తాను. ఈ బ్లాగులో వచ్చే సాయిలీలలు కూడా తెల్లవారుఝామునే చదివి ఆ తరువాత నా దినచర్యలో పాల్గొంటాను. నాకు సాయి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.


ఇటీవల మా అబ్బాయికి పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. సాయి కృప వలన వారంరోజుల్లో పెళ్ళి నిశ్చయమైంది. మా అబ్బాయి కాస్త నిదానస్థుడు. ఆ అమ్మాయి చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంటుంది. అయితే మా అబ్బాయి ఒక్కోసారి ‘ఆ అమ్మాయిది చిన్నపిల్లల్లాంటి మనస్తత్వం’ అనీ, మరోసారి ‘అమ్మో, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్’ అనీ అనుకునేవాడు. తను ఆ విషయం నాతో చెప్పినప్పుడు, “నువ్వు ఎక్కువగా మాట్లాడవు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. నేను కూడా గలగలా మాట్లాడతాను కదా. మీ నాన్నగారేమో నిదానం” అని చెప్పాను. తరువాత నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఇద్దరూ ఒకరి మనసును మరొకరు చక్కగా అర్థంచేసుకునేలా అనుగ్రహించండి” అని కోరుకున్నాను. ఆరోజు నుంచి మా అబ్బాయి మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకోవటం చూసి ఎంతో ఆనందించాను. మనకు కావలసింది అదే కదా. మనము కోరిన వెంటనే బాబా మనకు అనుగ్రహిస్తారు.


ఇప్పుడు చెప్పబోయే అనుభవం 2021, జనవరి 31వ తారీఖున జరిగింది. అంతకు వారం రోజుల ముందునుంచి నాకు కొద్దిగా బి.పి. ఎక్కువగా ఉండటంతో పాటు ఒళ్ళునొప్పులు కూడా ఉన్నాయి. ఆరోజు కూడా ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి ఈ బ్లాగులో ప్రచురించిన బాబా లీలలను చదువుతున్నాను. అలా చదువుతూ ఉన్నప్పుడు నా కుడికన్ను అదిరింది. అప్పుడప్పుడు కన్ను అదరటం సహజమే. కానీ ఎందుకో నాకు చాలా భయమేసింది. రెండు నిమిషాల్లో కన్ను అదరటం తగ్గిపోతుందేమో అనుకున్నాను. కానీ 5 నిమిషాలు అయినప్పటికీ అదరటం తగ్గలేదు. అప్పుడు నేను బాబాను స్మరించుకుని, “బాబా! త్వరగా నా కన్ను అదరటం తగ్గేలా చూడండి. ఇది సాధారణ అదురే అయివుండాలి” అని ప్రార్థించాను. తరువాత ‘బాబా, బాబా’ అంటూ బాబా నామాన్ని స్మరించసాగాను. బాబా అనుగ్రహంతో కొద్దిసేపట్లోనే కన్ను అదరటం పూర్తిగా తగ్గిపోయింది. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను బాబానే కొలుస్తాను. నేను మా అమ్మను ఎలా పిలుస్తానో అలాగే ప్రతిరోజూ బాబాను కూడా ‘సాయీ, సాయీ’ అని పిలుస్తుంటాను. బాబా ఎన్నోసార్లు నాకు స్వప్నదర్శనమిచ్చారు. కొన్నిసార్లు ఆ స్వప్నాలలో, ‘నీకు మంచి జరుగుతుంది’ అనీ, ‘నాకు అన్నం పెట్టు’ అనీ చెప్పారు.


ఓం శిరిడీ సాయిరాం.


సాయి ఉన్నారు


పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులకు నా నమస్కారాలు. చాలాకాలంగా ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ‘సాయి ఉన్నారు’ అన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నాను. చాలా సందర్భాల్లో సాయి కరుణ నాపై ఉన్నదని తెలియపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల మా అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేకపోయేసరికి రెండుసార్లు డాక్టర్లను సంప్రదించి అమ్మకు ట్రీట్‌మెంట్ ఇప్పించాము. అయినప్పటికీ అమ్మ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒకరోజు నా రోజువారీ పూజాకార్యక్రమంలో భాగంగా, ‘మా అమ్మగారి ఆరోగ్యం మెరుగుపడేలా అనుగ్రహించమ’ని సాయిని ప్రార్థిస్తూ, “మా అమ్మగారు కోలుకుంటే ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని సాయికి విన్నవించుకున్నాను. ఆ మరుసటిరోజు మేము వేరొక డాక్టర్ దగ్గరకు అమ్మను తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ ఇప్పించాము. బాబా దయవల్ల మా అమ్మగారి ఆరోగ్యం మెరుగై ఇంతకుముందులా అన్ని పనులూ చేసుకుంటున్నారు. అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటున్నాను.



6 comments:

  1. Om sai ram i liked today's 2 sai leelas. Sai bless my mom she is bed ridden. She is 90 years old. She is suffering from bed sores. She can't sit. There is care taker. My f_in_ law also sufferd lot in his old age. We also arranged care taker. We can't see their suffering in last stage.. Please take care of them. My father in law passed away last December

    ReplyDelete
  2. Om sai ram my right eye always blinking
    Please bad events stop baba.please bless us sai.be with us sai

    ReplyDelete
  3. Baba amma arogyam manchiga cheyi thandri pleaseeee

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo