- బాబా ఆశీస్సులతో నెరవేరిన కోరికలు
- ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
బాబా ఆశీస్సులతో నెరవేరిన కోరికలు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో కొన్ని అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను.
మొదటి అనుభవం - వెంటనే శస్త్రచికిత్స అవసరం లేకుండా రక్షించిన బాబా:
గత సంవత్సర కాలంగా నేను గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. కరోనా కారణంగా హాస్పిటల్‌కి వెళ్లడానికి నేను ఇష్టపడలేదు. ప్రతి నెలా నేను బాబాను ప్రార్థిస్తూ బాబా దయవల్ల కాస్త ఉపశమనం పొందుతుండేదాన్ని. కానీ డిసెంబరు నెలలో నేను ఇంకా వేచి ఉండలేక హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టరు కొన్ని రకాల పరీక్షలు మరియు స్కానింగ్ చేసి రిపోర్టుల కోసం మరుసటిరోజు రమ్మని చెప్పారు. నేను బాబాను ప్రార్థించి, "బాబా! నేను మిమ్మల్ని ఎక్కువగా ఏమీ అడగదల్చుకోలేదు. కానీ నేను ఇప్పుడు శస్త్రచికిత్సకు సిద్ధంగా లేను. నాకు రెండు మూడు నెలల సమయం కావాలి బాబా" అని వేడుకున్నాను. మరుసటిరోజు హాస్పిటల్‌కి వెళ్తే, రిపోర్టులు పరిశీలించిన డాక్టరు, "తిత్తి మరియు గర్భాశయం వ్యాప్తి చెందినందువల్ల కొన్ని చెప్పుకోదగ్గ పెద్ద సమస్యలున్నాయి. ప్రస్తుతానికి కొన్ని మందులు ఇస్తాను. రెండు నెలల పాటు ఆ మందులు వాడి మళ్ళీ రండి. అప్పటి పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుందాము" అని చెప్పారు. నేను కోరుకున్నట్లే బాబా రెండు నెలల సమయం ఇచ్చారు. బాబా కృపవలన కేవలం మందులతో నాకు పూర్తిగా నయం కావచ్చని ఆశిస్తున్నాను.
రెండవ అనుభవం - ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకున్న మా అబ్బాయి:
11 సంవత్సరాల మా అబ్బాయి మా పొరుగింటి స్నేహితులతో కలిసి పండుగ సెలవులకు మొదటిసారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కరోనా కారణంగా నేను తనను రైలులో పంపించడానికి ఇష్టపడలేదు. కానీ తను ఆ ప్రాంతాన్ని చూడటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుండటంతో వాడి ఉత్సాహాన్ని చూసి బాబా వద్ద అనుమతి తీసుకొని తనను పంపడానికి సిద్ధపడ్డాను. నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నేను మీ అనుమతితో మా అబ్బాయిని పంపుతున్నాను. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తను సురక్షితంగా ఇంటికి చేరుకునేలా మీరే చూడాలి బాబా" అని ప్రార్థించాను. తను వాళ్లతో వెళ్లి 6 రోజులపాటు తన సెలవు దినాలను అక్కడ ఆనందంగా గడిపి బాబా ఆశీస్సులతో సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
మూడవ అనుభవం - అనుకోకుండా అందిన భీమా డబ్బులు:
2009లో నేను ఒక భీమా పాలసీ తీసుకున్నాను. 3 సంవత్సరాలు భీమా మొత్తాన్ని చెల్లించి, ఆపై చెల్లించడం మానేశాను. ఆ భీమా మొత్తాన్ని తిరిగి పొందడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. వాస్తవానికి ప్రస్తుత నా ఫోన్ నెంబరు, చిరునామాలను భీమా సంస్థలో నేను మార్పించుకోలేదు. పాత ఫోన్ నెంబర్ ప్రస్తుతం నా దగ్గర లేదు. ఆ విషయమై నేను బాబాకు చెప్పుకొని, నవగురువార వ్రతం చేస్తానని మ్రొక్కుకున్నాను. హఠాత్తుగా డిసెంబరు నెలలో ఆ భీమా సంస్థకి సంబంధించిన వ్యక్తి నా పాత చిరునామాకి వెళ్లి, నా ఫోన్ నెంబరు సంపాదించి నాకు ఫోన్ చేసి అన్ని వివరాలనూ అప్డేట్ చేశాడు. ఫలితంగా నాకు రావలసిన సుమారు 1.6 లక్షల రూపాయలు నాకు వచ్చాయి. ఇప్పటికి నేను 5 వారాల పూజ పూర్తి చేశాను, ఇంకా 4 వారాలు చేయాల్సి ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా. నేను ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను".
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteJai sairam
ReplyDeleteOm sai ram bless all. Baba be with us. Baba help us. Please place your hand on us
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
640 days
ReplyDeletesairam
🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteOm sai ram baba amma ki sampurna arogyam prasadinchu thandri ����������
ReplyDelete