సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 681వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు
  2. ఆకాశంలో సంభవించిన ప్రమాదం - బాబా రక్షణ

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలు మరియు సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


నా పేరు రాంబాబు. మేము విజయనగరంలో నివసిస్తున్నాము. నేను, నా భార్య రోహిణి ఈమధ్య సంక్రాంతి సెలవుల్లో బాబాను దర్శించుకోవడానికి శిరిడీ ప్రయాణమయ్యాము. బాబాను దర్శించుకుని తిరిగి విజయనగరం రావడానికి ట్రైన్ రిజర్వేషన్ విజయవాడ వరకు మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. విజయవాడ నుంచి విజయనగరానికి అన్ని ట్రైన్లూ వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. అయినా సరే రెండు ట్రైన్లుకి టికెట్లు బుక్ చేశాను. వాటిలో ఒకటి సాయంత్రం ఐదు గంటలకి, రెండవది రాత్రి పది గంటలకి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. శిరిడీ నుంచి బయలుదేరే ముందురోజు ఆ ట్రైన్ల వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాదేమోనని తత్కాల్‌లో కూడా ప్రయత్నించాను, కానీ కన్ఫర్మ్ టికెట్ దొరకలేదు. పోనీ, విజయవాడ నుంచి విజయనగరానికి బస్సులో వెళ్ళిపోదామని అనుకుంటే ఏ ఒక్క బస్సు కూడా మరుసటిరోజు నా డ్యూటీ సమయానికి విజయనగరం చేరుకునేలా లేదు. అయినప్పటికీ, మమ్మల్ని ఏ ఇబ్బందీ లేకుండా విజయనగరం చేరుస్తారనీ, సమయానికి నేను డ్యూటీకి వెళ్లేలా చూస్తారనీ నాకు బాబాపై ఎంతో నమ్మకం. చివరికి ఆ రెండు ట్రైన్లలో రాత్రి 10 గంటల ట్రైనుకి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ మధ్యన ఉన్న ఐదు గంటల విరామ సమయంలో మేము విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాము. అప్పుడు అర్థమైంది, బాబా ఎందుకు 10 గంటల ట్రైనుకి టికెట్లు కన్ఫర్మ్ చేశారోనని. శిరిడీ ప్రయాణానికి ముందు మేము కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుందామని అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. అందుకే కాబోలు బాబా మా ప్రయాణ ప్రణాళికను ఈ విధంగా సిద్ధం చేశారు. కరుణామయుడైన బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే మాపై ఉండాలని కోరుకుంటున్నాను.


సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!


ఆకాశంలో సంభవించిన ప్రమాదం - బాబా రక్షణ
నా పేరు సత్య. నేను యు.ఎస్.ఏ.లో నివాసముంటున్నాను. ఇటీవల సాయిబాబా ఆశీస్సులతో ఆకాశం నడిమధ్యలో సంభవించిన ప్రమాదం నుండి నేను రక్షింపబడ్డాను. ఆ క్షణాన బాబా నాకు ప్రసాదించిన ఆ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. దాన్నే నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
ఈమధ్యకాలంలో ఒక గురువారంనాడు నేను ఉంటున్న చోటునుండి మా స్నేహితులు ఉండే ప్రాంతానికి విమానంలో ప్రయాణమయ్యాను. ప్రయాణం మధ్యలో ఉండగా గాలిలో పలుసార్లు తీవ్రమైన అల్లకల్లోలం సంభవించింది. దాంతో నాతో సహా ప్రయాణీకులందరూ మరణభయంతో సహాయం కోసం కేకలు పెట్టారు. అయినా ఆకాశంలో మాకు సహాయం చేయడానికి ఎవరుంటారు? దాదాపు అవి నా ఆఖరి క్షణాలు అనిపించి మానసికంగా చాలా ఒత్తిడి పెరిగి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తీవ్రమైన ఆందోళనలో కొద్ది నిమిషాలు గడిచాక, నేను సాయి మహరాజ్ సన్నిధి టెలిగ్రామ్ గ్రూపు ఓపెన్ చేసి సాయినాథుని స్తోత్రాలు స్మరించి, చాలామంది సాయిభక్తుల అనుభవాలు చదివాను. అంతే, బాబా ఆశీస్సులతో గాలిలో ఏర్పడిన అల్లకల్లోలం తగ్గుముఖం పట్టి కొద్దిసేపట్లో మా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తరువాతి మరో గంట ప్రయాణం ఎంతో ప్రశాంతంగా జరిగింది. నేను ఎప్పుడూ ఒకటే విశ్వసిస్తాను, "ఎవరినైనా ఏ ఆపదనుండైనా రక్షించగలరంటే అది సాయిబాబా మాత్రమే" అని.
"థాంక్యూ సో మచ్ బాబా!"

8 comments:

  1. You are correct.baba only saves us.no body is there to save us.sai has that power.I trust him in my life.Om saima

    ReplyDelete
  2. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo