తమ్మాజీ శిరిడీ నివాసి. యుక్తవయస్సులో ఉన్నప్పుడు కుస్తీలో ఖ్యాతిగాంచాలన్నది అతని ఆశయంగా ఉండేది. కానీ అతని తల్లిదండ్రులు ఆర్థికంగా పేదవారైనందున పాలు వంటి పౌష్ఠికాహారం అతనికి అందించలేకపోయేవారు. అటువంటి ఆహారం కఠినమైన శ్రమతో కూడుకున్న కుస్తీ పోటీలకు చాలా అవసరం. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్న అతడు, "ఎంతోమంది భక్తులకు బాబా చాలా డబ్బులు ఇస్తారు. నేను కూడా ఆయన దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడుగుతాను" అని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే బాబా దగ్గరకు వెళ్లి, గొప్ప మల్లయోధుడు కావాలన్న తన కోరికను చెప్పాడు. బాబా ఓపికగా అతను చెప్పినదంతా విని, "యోగుల, సాధువుల ధనం మీద ఆధారపడటం మంచిది కాదు. నీకు కొంత పొలం ఉంది కదా, పోయి దానిని జాగ్రత్తగా దున్ను. నీ పొలంలో కుండనిండా ఇత్తడి నాణాలున్నాయి" అన్నారు. బాబా మాటలను ప్రమాణంగా తీసుకుని, మర్నాడే తమ్మాజీ తన పొలాన్ని చాలా శ్రద్ధగా దున్నడం మొదలుపెట్టాడు. బాబా ఆశీస్సులతో తాను ఖచ్చితంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తానని తనకి తెలుసు. అందువలన మల్లయోధుడు కావాలన్న తన ఆలోచనను వదిలిపెట్టాడు. అయితే చెప్పినంత తేలిక కాదు చేయడం.
తనకు చాలా కొంచెం పొలం మాత్రమే మిగిలివుందని తమ్మాజీ గ్రహించాడు. ఋణదాతలు చాలావరకు తమ స్థలాన్ని జప్తు చేసుకున్నారు. ఆనాటి ప్రజలు చాలామంది బ్రిటిష్ పరిపాలన అందరికీ న్యాయపరమైనదని అనుకునేవారు. అయితే ఋణదాతలు రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని ఎక్కువ భూమికి సంతకాలు చేయించుకునేవారు. ఆవిధంగా వాళ్ళు విస్తారంగా భూములను ఆక్రమించుకునేవారు. అందువలన చాలీచాలని డబ్బులకోసం రైతులు తమ సొంత భూములలోనే పనిచేయాల్సి వచ్చేది. ఇదంతా గమనించిన తమ్మాజీ, రైతులు తెల్లవారింది మొదలు చీకటి పడేవరకు పనిచేసినా చాలా దయనీయమైన, పేదరికంలో మగ్గిపోతున్నారని అర్థం చేసుకుని తనకున్న తక్కువ పొలంలోనే మనస్ఫూర్తిగా శ్రద్ధపెట్టి పని చేసి మంచి దిగుబడి సాధించాడు. తరువాత ఋణదాతల వద్దనుండి మరికొంత భూమిని బాడుగకు తీసుకున్నాడు. ఆ పొలంలో తనతోపాటు తన కుటుంబమంతా రాత్రనక, పగలనక కష్టపడి పనిచేశారు. బాబా దయవలన గోదావరి నీళ్లు కాలువల ద్వారా శిరిడీ పొలిమేరల వరకు రావడంతో రైతులకు చాలా మేలు జరిగింది. దాని ఫలితంగా విస్తారమైన దిగుబడి వచ్చింది. అలా తమ్మాజీ పొలాలు బాగా అభివృద్ధి చెందాయి. దానితో అతితక్కువ కాలంలోనే ఇంకా ఎన్నో పొలాలు కొనుగోలు చేశాడు. అలా ఇంచుమించు 150 ఎకరాల భూమిని సంపాదించాడు. అతని కుటుంబం బాగా వృద్ధిచెంది ఐశ్వర్యవంతులైనారు.
"ఒకవేళ నేను ఆయన మాట లక్ష్యపెట్టకుండా ఉండివుంటే నాకు, నా కుటుంబానికి ఏమి జరిగి ఉండేదో నిజంగా నాకు తెలియదు. ఇదంతా బాబా ఆశీర్వాదాల వలనే సాధ్యమైంది. సరియైన మార్గం చూపినందుకు నేనెప్పుడూ ఆయనకు కృతజ్ఞుడనై ఉంటాను" అని అంటాడు తమ్మాజీ.
Ref: శిరిడీ చే మహాన్ సంత్ సాయిబాబా(రచన: పాండురంగ బాలాజీ కావడే).
సోర్స్: Baba's Divine Manifestations by విన్నీ చిట్లూరి.
సాయిరాం
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'
ఓం శ్రీ ఆరోగ్య క్షేమదాయకం నమః ఓం శ్రీ ఆరోగ్య క్షేమదాయకం నమః ఓం శ్రీ ఆరోగ్య క్షేమదాయకం నమః ఓం శ్రీ ఆరోగ్యం ఆదాయం నమః ఓం శ్రీ ఆరోగ్య క్షేమదాయకం ఓం శ్రీ ఆరోగ్యం క్షేమం నమః ఓం శ్రీ ఆరోగ్యం క్షేమం నమః ఓం శ్రీ ఆరోగ్యం క్షేమం నమః ఓం శ్రీ ఆరోగ్యం క్షేమం నమః
Deleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteOm Sairam
Om Sairam
Om Sairam