సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తులఅనుభవమాలిక 14వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • బాబా చేసిన చిన్న సహాయం
  • ఫోన్ బిల్లు పదవవంతుకు తగ్గేంచేసారు బాబా


బాబా చేసిన చిన్న సహాయం

అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నమస్కారం. చిన్ననాటినుండి నాకు బాబాతో అనుబంధం ఉంది. ఎన్నో బాబా లీలలు చవిచూశాను. నాకే సమస్య వచ్చినా నేను బాబాతోనే చెప్పుకుంటాను. ఆయన కృపతో అవి ఇట్టే తీరిపోయాయి. ఒకసారి ఉద్యోగవిషయంగా ఒక సైంటిస్టుతో మాట్లాడాల్సి వచ్చింది. అయితే నాకు ఇంగ్లీష్ అంతగా రాకపోవడంతో చాలా ఆందోళనపడ్డాను. దాంతో, "బాబా! అతను నాతో తెలుగులో మాట్లాడాలి, అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత నేను అతనికి ఫోన్ చేస్తే చక్కగా తెలుగులోనే మాట్లాడారు. నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. ఆ ఉద్యోగం నాకు వస్తుందో లేదో నాకు తెలియదుగానీ బాబా నాకు సహాయం చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా! ఉద్యోగం నాకు, నా కుటుంబానికి అవసరమని మీకు తెలుసుకదా! నాకది మంచిదనిపిస్తే ఆ ఉద్యోగం నాకివ్వండి."


ఫోన్ బిల్లు పదవవంతుకు తగ్గేంచేసారు బాబా

జపాన్ నుండి మరో సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

ఇటీవల ఒకనెల మా ఇంట్లోని సొంత నెట్ కనెక్షన్ పనిచేయకపోవడంతో మావారు తన ఆఫీసు ఫోనులోని హాట్‌స్పాట్ ఆన్ చేసి తన ఆఫీసు పని చేసుకున్నారు. దానితో ఆ నెల బిల్ చాలా ఎక్కువ వచ్చింది. మరీ అంత వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మావారు చాలా ఆందోళనపడ్డారు. ఆ సమస్యనుండి బయటపడేస్తారని సాయిపై మాకున్న పూర్తివిశ్వాసంతో ఆయనను ప్రార్థించాము. మరుసటిరోజు మావారు ఆఫీసుకు వెళ్లి బాబా చూపిన కృపకు చాలా ఆశ్చర్యపోయారు. ఏదో డిస్కౌంట్ కారణంగా బిల్ ఎమౌంట్ పదవవంతుకి తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా!"

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo