ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా చేసిన చిన్న సహాయం
- ఫోన్ బిల్లు పదోవంతుకు తగ్గేంచేసిన బాబా
బాబా చేసిన చిన్న సహాయం
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నాకు నా చిన్ననాటినుండి నాకు బాబాతో అనుబంధం ఉంది. నేను ఎన్నో బాబా లీలలు చవిచూశాను. నాకే సమస్య వచ్చినా నేను బాబాతోనే చెప్పుకుంటాను. ఆయన కృపతో అవి ఇట్టే తీరిపోయాయి. ఒకసారి ఉద్యోగవిషయంగా ఒక సైంటిస్టుతో మాట్లాడాల్సి వచ్చింది. అయితే నాకు ఇంగ్లీష్ అంతగా రాకపోవడంతో చాలా ఆందోళనపడ్డాను. దాంతో, "బాబా! అతను నాతో తెలుగులో మాట్లాడాలి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను అతనికి ఫోన్ చేస్తే చక్కగా తెలుగులోనే మాట్లాడారు. నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. ఆ ఉద్యోగం నాకు వస్తుందో లేదో నాకు తెలియదుగానీ బాబా నాకు సహాయం చేసారు. "థాంక్యూ సో మచ్ బాబా! ఉద్యోగం నాకు, నా కుటుంబానికి అవసరమని మీకు తెలుసుకదా! నాకది మంచిదనిపిస్తే ఆ ఉద్యోగం నాకివ్వండి."
🕉 sai Ram
ReplyDelete