ముకుందశాస్త్రి లేలే కొంకణ బ్రాహ్మణుడు. అతడు పూణేలోని శనివార్‌పేట్‌లో నివాసముండేవాడు. శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 జూన్ 17న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి అతడు ఈక్రింది విధంగా తెలియజేశాడు:
నేను 1912వ సంవత్సరంలో తరచుగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చందోర్కర్‌తో కలిసి టాంగాలో ప్రయాణించాను. దారిలో గుర్రం వెనుక కాళ్లపై లేచినందువల్ల టాంగా ప్రక్కకి పడిపోయింది. కానీ బాబా దయవలన గాయాలపాలు కాకుండా మేమిద్దరం క్షేమంగా బయటపడ్డాము. అదేసమయంలో ద్వారకామాయిలో ఉన్న బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదుతూ, "నానా చావనున్నాడు. కానీ నేనతన్ని చావనిస్తానా?" (నానా ఆతా మారత్ హోతే, మీ మరూన్ దేయిన్ కాయ్?) అని అన్నారు. ఇది జరిగిన ఎనిమిది రోజుల తర్వాత మేము శిరిడీ వెళ్ళాము. బాపూసాహెబు జోగ్ నాతో ఎనిమిది రోజుల ముందు బాబా పైవిధంగా అన్నారని చెబుతూ, "అది నిజమేనా?" అని అడిగాడు. నేను అవునని చెప్పి, జరిగినదంతా వివరించాను.
1914లో నా భార్య ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆయన నాకు రెండు బర్ఫీ ముక్కలు ఇచ్చి, "వెళ్ళు" అన్నారు. వెంటనే నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమయింది. ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు.
నేను మసీదులో సాయిబాబాను పూజించేటప్పుడు ఆయన నాతో, "నారాయణోపనిషత్తు (తైత్తిరీయ ఉపనిషత్తు) పఠించమ"ని చెప్పారు. వారు ఆదేశించినట్లుగానే నేను వారి సన్నిధిలో పదిరోజులు ఆ ఉపనిషత్తు పఠించాను. నేను ఆ ఉపనిషత్తును కాకాసాహెబ్ దీక్షిత్‌కు కూడా బోధించాను. బాబా అప్పుడప్పుడు నా ముందు భగవద్గీతలోని (అపిచేత్ సుదరాచార్) శ్లోకాలను, మరికొన్ని ఇతర సంస్కృత పద్యాలను పఠించారు. ఆయనకు సంస్కృతం బాగా తెలుసు.
సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.
ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri, amma nannalani kshamam ga arogyam ga chusukondi vaalla badyata meede tandri, naaku manchi arogyanni prasadinchi ofce lo anta bagunde la chayandi tandri pls, meere naaku anni yeppudu na cheyi vadaloddu
ReplyDelete