సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భావూరాయ్ జయవంత్ మహరాజ్




‘భివండీ తుకారాం’గా ప్రసిద్ధిగాంచిన భావూరాయ్ జయంత్ మహరాజ్ ఒకసారి తన ముగ్గురు ముస్లిం భక్తులతో కలిసి బాబా దర్శనానికి బయలుదేరాడు. వాళ్ళు శిరిడీ చేరుకొని మసీదుకు వెళ్లారు. బాబా ధునికి ఎదురుగా ఉన్న తమ ఆసనంపై కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ ఉన్న తేజోవంతమైన ప్రకాశంతో మసీదంతా వెలిగిపోతోంది. ముందుగా ముస్లిం భక్తులు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. తరువాత భావూరాయ్ బాబా వద్దకు వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే ఆనందంతో, “అరే షామా, ఇతన్ని ఒక గదిలో బంధించు!” అని అరిచారు. ఆ మాట వింటూనే భావూరాయ్ కాస్త కలవరపడ్డాడు. బాబా ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకున్న షామా అతన్ని సాఠేవాడాకు తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. అక్కడున్న భక్తులు ఎంతో జాగ్రత్తగా అతని అవసరాలన్నీ చూసుకోసాగారు. స్నానానికి వేడినీళ్ళిచ్చి, వేడివేడి టీ కూడా అతనికి ఇచ్చారు. అతను స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాక వాళ్ళు అతనిని బాబా దర్శనానికి తీసుకువెళ్ళారు. అయితే, ఎక్కడా ఎక్కువ సమయం ఉండని భావూరాయ్ తిరిగి వెళ్లడానికి ఆత్రుతగా ఉన్నాడు.

షామా అతన్ని మసీదు లోపలికి తీసుకొని వెళ్ళాడు. బాబా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో అతన్ని తమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్నారు. తరువాత ధుని నుండి ఊదీ తీసి, కొంత అతని నుదుటిపై పెట్టి, మిగతా ఊదీని అతని శరీరమంతా రాసి, “అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు” అని అన్నారు. తరువాత బాబా కొన్ని నిమిషాలపాటు భావూరాయ్ కళ్ళలోకి తదేకంగా చూస్తూ తమ దైవికశక్తిని అతనిలోకి ప్రసరింపజేశారు. ఈ ఆధ్యాత్మికపరమైన శక్తిపాతం చాలా తీక్షణమైనది. భావూరాయ్ ఆనందంతో కన్నీళ్లపర్యంతమై కృతజ్ఞత నిండిన మనసుతో తన శిరస్సును బాబా పాదాలపై ఉంచాడు. బాబా ఎంతో ప్రసన్నంగా అతని వీపు తట్టి, “శిరిడీలో కొంతకాలం ఉండు” అని చెప్పారు. కానీ అతను తనతో వచ్చిన ముస్లిం భక్తులతో తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు. అప్పుడు బాబా అయిష్టంగానే అతనికి తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. కొన్ని సంవత్సరాల తరువాత భావూరాయ్ మళ్ళీ శిరిడీ సందర్శించాడు. కానీ, అప్పటికి బాబా మహాసమాధి చెందారు.

గురువు మాటల్ని ఎప్పుడూ అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే, ఒకసారి గురువు ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే, తిరిగి ఎప్పటికీ రాదు.


Source: రెఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్ 1994 (దీపావళి సంచిక)
సోర్సు: బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌺😊🌸😀🌹🥰🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo