సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రఘుజీ షిండే


రఘుజీ షిండే భాగోజీ యొక్క అన్నయ్య. అతడు కూడా బాబా సేవకుడు. ఒక్కప్పుడు రఘుజీ ఇంకో ఐదుగురుతోపాటు ఒక  మార్వాడి  మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని పలువురు సాక్షుల సాక్ష్యం ఆధారంగా ఆ ఆరుగురిని అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆ రోజులలో, ఇతర గ్రామాల మాదిరిగానే షిర్డీలో అనేక రాజకీయ పార్టీ వర్గాలు ఉన్నాయి. 

తాత్యా పాటిల్ రఘుజీ తరుపున కోర్టు తీర్పు యొక్క ఒక కాపీని తీసుకుని ఆ సమయంలో షిర్డీలో ఉన్న జి.యస్ ఖపర్డే, కాకాసాహెబ్ దీక్షిత్ మరియు H. V. సాఠే వంటి ప్రముఖ న్యాయవాదుల వద్దకు వెళ్లారు. వారు అదంతా పరిశీలించి, సాక్ష్యాలు మరియు కోర్టు తీర్పు చాలా బలంగా ఉండటంతో, అప్పీల్ చేయడం వలన విజయంపై ఎటువంటి ఆశ లేదని చెప్పారు. అప్పుడు తాత్యా బాబా వద్దకు వెళ్లి ప్రార్ధించాడు. అప్పుడు బాబా తాత్యా పాటిల్ తో "భావు  (యస్.బి. ధుమాళ్) వద్దకు వెళ్ళు" అని చెప్పారు. 

బాబా ఆజ్ఞాపించిన ప్రకారం, తాత్యా అన్ని పత్రాలతో ధుమాళ్ వద్దకు వెళ్ళాడు. ఆ పత్రాలను పరిశీలించాక అతనికి కూడా ఎటువంటి ఆశ కనిపించలేదు. ధుమాళ్ తాత్యాతో మాట్లాడుతూ అప్పీల్ కి వెళ్ళడం వలన విజయం సాధించలేకపోవచ్చని, అందువలన ఎవరైనా ప్రముఖ న్యాయవాదిని నియమించి, ప్రయత్నం చేయమని చెప్పాడు. అప్పుడు తాత్యా "బాబా మిమ్మల్ని సంప్రదించమని చెప్పారని" చెప్పాడు. అంతటితో ధుమాళ్ కేవలం బాబా ఆజ్ఞకు విధేయుడై, అప్పీల్ పత్రాలను సిద్ధం చేసాడు. 

తరువాత అతను సీనియర్ యూరోపియన్ ఆఫీసరుగా ఉన్న జిల్లా మేజిస్ట్రేట్ యొక్క నివాసానికి వెళ్లాడు. మొదట మేజిస్ట్రేట్ సంబంధిత పత్రాలను స్వీకరించకుండా విషయం గురించి ప్రశ్నించాడు. అప్పుడు అతను కేసులోని వాస్తవాలను మేజిస్ట్రేట్ తో చెప్పి, గ్రామంలోని రాజకీయ పార్టీ వర్గాలు ఏవైనా సాక్ష్యాలు సృష్టించగలరని చెప్పాడు. 

ఒకవైపు జైలులో ఉన్న రఘుజీ షిండే కేసులో అన్యాయంగా తనను ఇరికించినందుకు తనని ఎలాగైనా విడుదల చేయమని బాబాని ప్రార్థన చేస్తున్నాడు. మూడవ రోజు రాత్రి బాబా అతనిని కలలో కనిపించి, "భయపడవద్దు. నేను మీ అందరిని విడుదల చేస్తాను" అని చెప్పారు. మేజిస్ట్రేట్  దిగువ న్యాయస్థానం యొక్క పత్రాలను పరిశీలించకుండా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సంప్రదించకుండా వారందరిని విడుదల చేయాలని ఆదేశించారు. ఆసమయంలో మేజిస్ట్రేట్ బాబా హిందువా? లేక ముస్లిమా?అని బాబా గురించి ధుమాల్ ని అడిగారు. 

బాబా గురించి ఉత్సుకతతో అడిగిన ప్రశ్న బాబా యొక్క అదృశ్యమైన శక్తిని సూచిస్తుంది. ఆ శక్తి అద్భుత పని చేసింది.  అందుకు ధుమాళ్ ముస్లిం గాని, హిందువు గాని కాదని, వారు వీటన్నింటికి ఉన్నత స్థితిలో ఉన్నారని చెప్పాడు. మరుసటి ఉదయం, జైలు వార్డెన్ రఘుజీని నిద్రలేపి, "మీరు విడుదల చేయబడ్డారు, మీరంతా వెళ్ళవచ్చు" అని చెప్పాడు. 1911లో ఈ సంఘటన జరిగింది. అప్పటికే బలమైన సాక్ష్యాల ఆధారంగా తీర్పు చెప్పబడిన సందర్భంలో కూడా ఆ తీర్పు తారుమారు కావడం బాబా యొక్క అద్భుత శక్తిని సూచిస్తుంది.

సమాప్తం.

Source: Holy Shri Sai Satcharitra Chapter 7, Baba's Anurag by Vinny Chitluri
http://bonjanrao.blogspot.co.ke/2013/01/bhagoji-shinde.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo