సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా మాకు తెలీకుండానే మా కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చారు


ఘటనాఘటన సమర్థుడు మన సాయి. నేను నా జీవితంలో జరిగిన ఒక నిజమైన లీలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది. 1982వ సంవత్సరం. అప్పుడు మేము జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ దగ్గర 'సిద్రి' అనే ఒక చిన్న గ్రామంలో వుండేవాళ్ళం. మావారు మైనింగ్ ఇంజనీరింగ్ చదివారు. కానీమేము వ్యాపారం చేసుకునేవాళ్ళం. మాకు ఆ భగవంతుని కృపవల్ల ఒక కొడుకుఇద్దరు కూతుర్లు ఉన్నారు. నేను ఎప్పుడూ మా పిల్లల భవిష్యత్తుచదువు గురించి చింతిస్తూ వుండేదాన్ని. ఎందుకంటేమా అబ్బాయి చదువులో చాలా బాగా ఉండేవాడు. కానీఎప్పుడూ జబ్బుతో ఉండేవాడు. ఆ సమయంలో నాకు శిరిడీ గురించిగానీసాయిబాబా గురించిగానీ ఏమీ తెలీదు.

ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో, తెల్లని మేనిఛాయతో, తెల్లని గడ్డంపొడవాటి వెంట్రుకలు కలిగివుండితెల్లని వస్త్రాలు ధరించిన ఆజానుబాహుడైన వ్యక్తి నా చేయి పట్టుకొని నన్ను బలవంతంగా నిద్ర నుంచి లేపారు. పైగా నాతో, "లేతొందరగా లేచి చూడుఒకరోజు నీ కొడుకు చాలా పెద్దవాడు అవుతాడు" అని అంటున్నాడు. నేను నిద్ర లేచి, "ఆ అద్భుతమైన వ్యక్తి మాట్లాడిన మాటలుచెప్పిన విధానంఇదంతా నిజమేనా?" అని అనుకున్నాను. వెంటనే ఆ వ్యక్తి కోసం అన్నిచోట్లా వెతికాను. అప్పుడు  సమయం తెల్లవారుఝామున 4 గంటలు. ఆ కల ఎంత నిజమనిపించిందంటే,  ఈరోజు వరకు నేను దానిని మర్చిపోలేకుండా ఉన్నాను. ఎప్పుడు గుర్తుకొచ్చినా నా శరీరం రోమాంచితమౌతుంది. ఆ కల గురించి నేను మావారికిఅందరికీ చెప్పాను. చూస్తూ ఉండగానే మా అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాసే సమయం వచ్చింది. నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, "స్వామీ! నా కొడుకు ఆరోగ్యంగా వుండేలా అనుగ్రహించు. కావాలంటే వాడి జబ్బు నాకు ఇవ్వు ప్రభూ!" అని. భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. మా అబ్బాయి 10వ తరగతి పరీక్షలు బాగా రాశాడు. నేను జాండిస్(కామెర్లు)తో జబ్బుపడ్డాను. మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అయ్యాడు.

మేము ఉండే చిన్న ఊరిలో ఇంటర్మీడియట్ లేనందువలన మేము మా అబ్బాయిని ఢిల్లీలోని కేంబ్రిడ్జి స్కూల్లో చేర్చాము. అక్కడ వాడు స్నేహితులతో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాడు. భోజనం బయట హోటల్లో తినేవాడు. అందువలన మళ్ళీ జబ్బుపడ్డాడు. మా ఊరిలో మా వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉండేది. అందుకని మా ఫ్యామిలీని ఢిల్లీకి మార్చుకున్నాము. మా అమ్మాయిలని కూడా అక్కడే స్కూల్లో చేర్చాము. ఒకరోజు మా బంధువు ఒకాయన మమ్మల్ని ఢిల్లీలోని లోడి రోడ్‌లో ఉన్న బాబా గుడికి తీసుకెళ్ళాడు. అతను బాబాకు గొప్ప భక్తుడు. నేను అక్కడ బాబాను చూసి ఆశ్చర్యంతో స్తంభించిపోయాను. నేను ఆరోజు నా కలలో చూసింది అదే బాబాఅవే కళ్ళుఅదే నవ్వుఅదే డ్రెస్అంతా same to same. మావారితో అన్నాను, 'ఆరోజు నాకు కలలో కనపడిన ఆయన ఈ బాబానే' అని. అప్పుడు అర్థం అయింది నాకుమా కష్టాలన్నీ ఎలా తీరాయో, మా అబ్బాయి చదువుమా వ్యాపారం అన్నీ చక్కబడ్డాయో.

నాకు అంతకుముందు బాబా తెలీనే తెలీదు. ఆయనకు నామీద అపారమైన కరుణకృప కలిగాయి. ఏ దేవుడికి ప్రార్థన చేసినా బాబాకే చెందుతాయి. అలా బాబా మాకు తెలీకుండానే మా కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు మా అబ్బాయి యనాహ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. అమ్మాయిలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్‌గా పూణేలో ఉన్నారు. నేను ఇప్పుడు నానమ్మను కూడా అయ్యాను. ప్రతి సంవత్సరం బాబా దర్శనానికి శిరిడీకి వెళ్తాను. బాబాకు నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. బాబా మహిమ వర్ణించలేనిది. బాబా కృప అందరిమీదా ఇలానే వుండాలని కోరుకుంటున్నాను.


సరోజాసింగ్



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo