బాలచంద్ర శ్రీధర్ గోండ్కర్ అనుభవాలు
2009వ సంవత్సరం, జనవరి 30వ తేదీన మేము తొమ్మిదిమందిమి కలిసి బరోడా నుండి శిరిడీకి పాదయాత్ర
చేసుకుంటూ బయలుదేరాం. సాధారణంగా నేను రోజుకి 35 కిలోమీటర్ల దూరం నడవగలను. కానీ, కంటిన్యూగా రెండు రోజుల్లో 70 కిలోమీటర్లు
నడవడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ యాత్రలో నాతోపాటు నాకు తోడుగా సాయిబాబా ఉంటారని
నా ప్రగాఢ విశ్వాసం. అందువలనే నా వయస్సు 60 సంవత్సరాలైనప్పటికీ ఈ పాదయాత్రకు నేను
సిద్ధపడ్డాను.
అది మా యాత్రలో ఆరవరోజు. ఇంకా ఒకటి రెండు
రోజులలో శిరిడీ చేరుకుంటామనగా ఆరోజు రాత్రి మేము నాసిక్‌లో బసచేశాము. ఆనాటి
రాత్రి నాకు ఒక్కసారిగా ఛాతీనొప్పి మొదలైంది. బాబా ఊదీ పెట్టుకొని పడుకోవడానికి
ప్రయత్నించాను, కానీ నిద్ర పట్టట్లేదు. కొంతసేపటికి నొప్పి భరించలేనంత ఎక్కువ అయింది. నేను నా స్నేహితులని లేపి విషయం చెపితే వాళ్ళు భయపడతారని వాళ్ళని లేపడానికి నేను
ఇష్టపడలేదు. నేను మౌనంగా నొప్పి భరిస్తూవున్నాను. అప్పుడు నాకు నా కొడుకు, కోడలు గుర్తుకువచ్చారు. వాళ్ళిద్దరూ నాసిక్ నుండి బరోడా
వెళ్తున్నారు. అవసరం ఉంటే వాళ్ళని కలుద్దామని అనుకున్నాను.
అకస్మాత్తుగా నేను కిందికి చూడగా నా పాదాల
దగ్గర ఒక నల్లకుక్క ఉండటం గమనించాను. 'ఒకవేళ నేను చనిపోబోతున్నట్లైతే అది నన్ను
చూసి అరవాలి కదా, కానీ అది మంచి నిద్రలో ఉందేమిటా!' అని అనుకున్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ
నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కలలో శ్రీసాయిబాబా దర్శనమిచ్చి నా నుదుటిపై ఊదీ రాశారు. తరువాత బాబా నాతో, "రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం” అని చెప్పారు. నేను వేకువనే 4 గంటలకి
నిద్రలేచాను. నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించింది.
ఉదయాన మేము మళ్ళీ యథావిధిగా మా యాత్రని తిరిగి
కొనసాగించాం. అంతలో నా స్నేహితుడు ఇంద్రవదన్ (ఇతను రోజుకి నాలుగు గంటలు ధ్యానం
చేస్తాడు) నా దగ్గరకి వచ్చి, తాను ధ్యానంలో ఉండగా బాబా తనతో, “గోండ్కర్ ఆయుర్దాయం ఇంకా 12 సంవత్సరాలు
పెంచాను. నువ్వు అతన్ని జాగ్రతగా చూసుకో” అని చెప్పారని చెప్పాడు. సాయిబాబా నాకు
జీవితాన్ని ఇచ్చారని తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యానికి గురై నన్ను నేను
మైమరచిపోయాను. సాయిబాబా ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన సేవకై అంకితం చేయదలిచాను.
మేము ప్రతిరోజూ రాత్రి ఒంటిగంట నుండి ఒకటిన్నర వరకు సాయి భజనలు చేస్తాము. బాబా దయతో
నాకు “సాయిభక్త ప్రసన్న భూషణ” అనే బిరుదు కూడా వచ్చింది. నాకు బాబా మందిరం నుండి ఊదీ, ప్రసాదాలు అందుతాయి. శిరిడీ సంస్థాన్
వాళ్ళు సాయినాథుని అఖండ పూజలకి వివిధ ప్రాంతాల నుండి శిరిడీకి పురోహితులని
తీసుకొని వచ్చే బాధ్యతని నాకే అప్పగించారు.
Meeru danyulu..baba vari dharshna..sparsha bhagyam kaligindi...om sairam
ReplyDeleteOm sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸🤗🌹😀🌼
ReplyDelete