నా పేరు రాజేష్ బాబు. మా ఊరు ముప్పాళ్ళ. బాబా నాకు ప్రసాదించిన ఒక లీలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయిబాబా భక్తుడనైన నేను ఎప్పుడూ బాబాని తలచుకుంటూ, వారి రూపాన్ని
ధ్యానించుకుంటూ ఉంటాను. కానీ నేను ఎన్నడూ శిరిడీ వెళ్ళలేదు. నాకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను శిరిడీ వెళ్ళలేకపోయాను.
2017 జనవరి 24న నాకు శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. మా బంధువులు
శిరిడీ వెళుతూ నన్ను కూడా వాళ్ళతో రమ్మన్నారు. నాకు బాబా అలా అనుమతినిచ్చినందుకు చాలా సంతోషం
కలిగింది. అయితే శిరిడీ వెళ్ళడానికి నా దగ్గర 3,400 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులు సరిపోతాయో లేదోనని విచారంతో
ఉన్నాను. అలాంటి సందర్భంలో బాబా నాకు 1,000 రూపాయలిచ్చి ఆదుకున్నారు.
అదెలా అంటే, 2017 జనవరి 22వ తేదీ తెల్లవారుఝామున 4 గంటల 17 నిమిషాలకు నా అకౌంట్‌లోకి 1,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ వేయి రూపాయలు నా అకౌంటులో ఎవరు వేశారో నాకు అర్థం కాలేదు. నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి అడిగాను, 'మీరేమైనా నాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా?' అని. మా అన్నయ్య 'చేయలేద'ని చెప్పారు. తరువాత నా స్నేహితులందరినీ అడిగాను. వాళ్ళు కూడా నాకు 'మనీ ట్రాన్స్‌ఫర్ చేయలేద'ని చెప్పారు. శిరిడీ ప్రయాణానికి అవసరమని బాబానే నాకు అలా 1,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని నా ప్రగాఢ విశ్వాసం.

Om సాయి ram
ReplyDelete