సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా భర్తను బాబా తన వైపుకు లాక్కున్నారు


సాయి బంధువు రమ్య గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

చిన్నతనం నుండి నేను సాయి భక్తురాలిని. నేను ప్రస్తుతం బెంగుళూరులో కాస్ట్ అకౌంటెంట్ గా ఫైనాన్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నాను. ఎప్పుడయితే సాయి మిరాకిల్స్  ఉండే బ్లాగ్ ను online లో చూశానో, ఆరోజు నుండి నాలో సాయిపై  ఉన్న భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి. నేను ప్రతిరోజూ భక్తుల అనుభవాల ద్వారా సాయి మిరాకిల్స్ చదువుతూ చాలా ప్రశాంతత పొందుతూ ఉంటాను. నేను ఎప్పుడూ అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలి అని వేడుకుంటాను.

ఈమధ్య నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు, నాలో చాలా నెగెటివ్ ఆలోచనలతో మనసంతా ఆందోళనగా ఉండేది. అప్పుడు నేను సాయి మిరాకిల్స్ కోసం నెట్ లో వెతుకుతూ ఉండగా, అనుకోకుండా నేను బ్లాగ్ చూడటం జరిగింది. నా మనసులోని నెగిటివిటీని తీసేయడానికి ఇది కూడా ఒక సాయిలీల. అప్పుడు సాయిని నేను ఒక్కటే ప్రార్ధించాను, నాలో ఉన్న చెడ్డ ఆలోచనలు అన్నీ పోతే నేను కూడా నా అనుభవాలని బ్లాగ్ లో షేర్ చేస్తాను అని. 5 సంవత్సరాల క్రితం బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలు నాకు బాబాపై ఉన్న భక్తి విశ్వాసాలు మరింత పెరిగేలా చేశాయి.

నా మొదటి అనుభవం :

మా అమ్మానాన్నలకు నేను ఒక్కతే అమ్మాయిని. మా ఇంట్లో అందరూ బాబా భక్తులే. నా చదువు అయిపోయాక నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకున్న ఒక్కటే ఆశ, కోరిక ఏంటంటే, నాకు వచ్చే భర్త మరియు అత్త మామలు సాయిభక్తులై  ఉండాలని. కానీ, ఎప్పటిలాగానే సాయి నాకు పరీక్ష పెట్టారు.

కొద్దిరోజుల్లో ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళ కుటుంబానికి మా పద్ధతులు అన్నీ నచ్చాయి. మాకూ వాళ్ళు నచ్చారు, కానీ వాళ్ళకి సాయిపై నమ్మకం లేదు. అంతే, నా ఆశలన్నీ ముగిసిపోయాయి. నా మదిలో ఒకటే ఆలోచనలు, వాళ్ళు నన్ను సాయిని పూజించడానికి అనుమతి ఇస్తారో, ఇవ్వరో అని. ఇక నేను, కోరిన ఒక్క కోరిక తీర్చలేదు అని రోజూ బాబాని తిడుతూ ఉండేదాన్ని. ప్రతిరోజూ నాకు ఇదే ఆందోళన. ఇలా ఉండగా పెళ్లికి కొద్ది వారాల ముందు నాకు ఒక కల వచ్చింది. కలలో పెళ్లి అయిన తరువాత నేను మా అత్తవారింట్లో దీపం పెట్టడానికి పూజా మందిరంలోకి అడుగుపెట్టగానే, అక్కడ సాయి విగ్రహం చూసాను. అప్పుడు సాయి నా వైపు చూసి నవ్వుతున్నారు. నేను ఆనందంతో పరవశించి పోయాను. పెళ్ళికి ముందే నాలో ఉన్న భయాన్ని తీసేసి, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని కల ద్వారా హామీ ఇచ్చినందుకు నేను సాయికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

నా రెండవ అనుభవం :

నేను ముందు చెప్పినట్టుగానే మా అత్తగారింట్లో వాళ్ళకి సాయి అంతగా తెలియదు. అందువలన వాళ్ళకి అంత నమ్మకం కూడా లేదు. అలా అని నేను సాయిని పూజించినా, వాళ్ళు ఏమీ అనలేదు. పైగా మేము అమెరికాలో ఉన్నప్పుడు, నా భర్తే నన్ను ప్రతి గురువారం సాయి మందిరానికి తీసుకెళ్ళేవారు. ఇండియాకి వచ్చాక, ఒక రోజు నా భర్తని, 'సాయివ్రతం చేస్తారా?' అని అడిగాను. నేను అలా ఎలా అడిగానో నాకే చాలాసేపు అర్థం కాలేదు. ఎందుకంటే, తను సాయిని ఎప్పుడూ పూజించలేదు, ఆయనకి అంత ఆసక్తి లేదు. టైం లో నేను నా కెరియర్ విషయంలో చాలా ఇబ్బందిగా ఉన్నాను. నేను సాయికి ఎన్ని పూజలు చేసినా ఆన్సర్ రాలేదు. అందుకే నా భర్తని నాకోసం సాయివ్రతం చేయమన్నాను. "మీరు గనక సాయివ్రతం చేస్తే సాయి నాకు సహాయం చేస్తారు" అని చెప్పాను. వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఇది ఆశ్చర్యాల్లోకి  ఆశ్చర్యం. నన్ను నేను నమ్మలేకపోయాను. ఆయన చాలా భక్తి విశ్వాసాలతో సాయి పూజ చేసారు. ఇంకా సాయి సచ్చరిత్ర పారాయణ కూడా మొదలుపెట్టి వారంలో పూర్తి చేసారు. అప్పటినుండి ఆయన ప్రతి గురువారం వ్రతం చేస్తున్నారు. మేము ఇద్దరం వారంలో ఒక్కసారైనా బాబా మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నాము. అంతలా మా వారిలో మార్పు తీసుకొచ్చారు బాబా. సచ్చరిత్రలో,  "నా భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు నా వద్దకు రప్పించుకుంటాను" అని బాబా చెప్పినట్లుగా, నా భర్తను కూడా బాబా తన వైపుకు లాక్కున్నారు.

సాయి ఆశీర్వాదాలు ఎప్పుడూ అందరిపై ఉండాలి. జై సాయిరాం!!!

1 comment:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸🤗🌹😀🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo