సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా అంటేనే ఆనంద స్వరూపం


                                                        
హైదరాబాదు నుండి రామక్రిష్ణ గారు తన అనుభవాలు ఇలా తెలియజేస్తున్నారు.

సాధారణంగా నేను చిన్నప్పుడు 13 సంవత్సరముల వరకు అయ్యప్ప భక్తుడను. నేను 13 నుండి 22 సంవత్సరాల వయస్సులో టెంపుల్స్ కు చాలా దూరంగా ఉండేవాడిని. ఒక రోజు నేను హైదరాబాదులోని సనత్ నగర్ బాబా గుడికి వెళ్ళాను. అలా మొట్టమొదటసారి బాబా గుడికి వెళ్ళినప్పుడు బాబా ముఖంలో నవ్వు కనిపించింది. బాబాగారిని చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అప్పటినుంచి ప్రతి గురువారం బాబా శేజ హారతికి వెళ్ళడం మొదలుపెట్టాను. అలా మొదలు పెట్టి ఇప్పటికి మిస్ కాలేదు. కొన్ని రోజులకు కొంతమంది భక్తుల ద్వార బాబా గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆ క్రమంలో చాలా హ్యాపీగా ఉన్నాను. బాధలు ఉన్న గుర్తు రాకుండా ఉండేవి. తర్వాత బాబా ఫోటో తీసుకోని రూమ్ లో పూజ రోజు చేస్తూరోజు టెంపుల్ కి వెళ్ళటం అలవాటు అయ్యింది. ఏదైనా రోజు టెంపుల్ కి వెళ్ళాక పొతే ఆ రోజు ఏదో మిస్ అయ్యాను అనిపిస్తుండేది.


రోజు బాబా గుడికి వెళ్తూ గుడిలో ఉన్నదిరూమ్ లో ఉన్నది బాబానే కదా! గుడిలో పూజ ఒకసారి చేస్తే చాలు మళ్ళి రూమ్ లో ఎందుకని రూమ్ లో పూజ మానేసాను. కానీ బాబా గారు 11వ రోజు నాకు కలలో కనిపించి నీ రూమ్ లో కూడా పూజ చేస్తూ ఉండు నేను నీ ఇంటిలోనే ఉన్నాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత సడన్ గా శేజ హారతి కి వెళ్ళడం కొన్ని రోజులు మానేసాను. అప్పుడు బాబా స్వప్నం లో కనిపించి హారతి కి వెళ్ళు అని చెప్పారు. 

మా ఇంటిలో అందరు షిర్డీ వెళ్లారు. కానీ నేను జాబు వలన వెళ్ళలేకపోయాను. బాబా నన్ను వదిలి అందరిని షిర్డీకి పిలుచుకున్నావు అని నేను బాధ పడ్డాను. సరిగా 11 వ రోజు ఆఫీస్ పని మీద షిర్డీ వెళ్ళాల్సి వచ్చింది. ఏ జాబు వలన నేను ముందు షిర్డీ వెళ్ళలేక పోయానో అదే జాబు పనితో నన్ను బాబా షిర్డీ పిలిపించుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. బాబా దయామయుడు. మొదటి నుండి నన్ను వదలకుండా వెంటే ఉన్నారు. 

బాబాకు 108కిలోల పంచదారతో అభిషేకం చేయాలి అనిపించింది. కానీ దానికి కావలిసిన అమౌంట్ నా దగ్గర లేదు. అది బాబానే సమకూరుస్తారు అనుకున్నాను. బాబా నా భక్తుల సత్సంకల్పలు నేను నెరవేరుస్తాను అన్నారు కదా! అలానే కొన్ని రోజుల తర్వాత వివిధ రకాలుగా బాబా అభిషేకం చేయించుకున్నారు. 

మా సిస్టర్ పెళ్లి విషయంలో కూడా బాబాపై నమ్మకంతో ఆయనపై భారం వేస్తే సమయానికి బాబా సహాయం చేసారు. మా సిస్టర్ కి పెళ్ళైన సంవత్సరం తర్వాత చాలా సమస్యలు ఉండేవి. నాకు చాలా బాధగా అనిపించేది. కానీ చేసిన కర్మ అనుభవించాలి కదా! బాబా నువ్వే దిక్కు అని బాబాకే వదిలివేశాను. నిదానంగా బాబా దయవలన ఆ సమస్యలు సర్దుకున్నాయి. మా సిస్టర్ మొదటిసారి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు మేనకోడలు పుట్టాలని కోరిక. బాబా అనుగ్రహం వలన గురువారం నాకు మేనకోడలు పుట్టింది. తన పేరు సాయి ప్రసన్న. రెండవ సారి మేనల్లుడు కూడా గురువారం రోజే పుట్టాడు. బాబు పుట్టడానికి ముందే బాబా స్వప్నంలో బాబు పుడతాడని చూపించారు. బాబా దయవలన మా సిస్టర్ బావ హ్యాపీగా ఉన్నారు.

సనత్ నగర్ బాబా గుడిలో ఏది అనుకున్న చాలా త్వరగా జరుగుతుంది. ఉదాహరణకు పంచదారతోతమలపాకులతో అభిషేకం నేను అనుకునట్లుగానే జరిగాయి. కానీ సాయి సత్యవ్రతం చేయాలి అన్న నా కోరిక ఒక సంవత్సరం  వరకు నెరవేరలేదు. ఒక సంవత్సరం తర్వాత అనుకోకుండా ఒకరోజు పంతులు గారు నాతో మే 21, 2016 పౌర్ణమి రోజున వ్రతం చేద్దాం అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. నేను ఉహించానేలేదు బాబా సరిగా మా సిస్టర్ పెళ్లి రోజున సాయి సత్యవ్రతం చేయడానికి అనుమతిని ఇవ్వటం చాలా ఆనందాన్ని కలిగించింది.  ఆ రోజు నుండి మా బాబా గుడిలో ప్రతి నెల పౌర్ణమికి ఆపకుండా సాయి సత్యవ్రతం చేయాలని సంకల్పించుకొని మొదలు పెట్టం. అలా మొదలు పెట్టిన తర్వాత నాల్గవ పౌర్ణమికి చేసిన సత్యవ్రతం నాడు బాబా గులాబి రేకు మీద దర్శనం ఇచ్చారు. ఇది  నా జీవితంలో అద్భుత విషయం.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo