సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి చేసిన ఆపరేషన్



హైదరాబాదుకు చెందిన సుధామాధవి అనే సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు: సాయి మహిమలు లెక్కలేనన్ని. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని బాబా అద్భుతం ఒకటి మా కుటుంబంలో జరిగింది. 2008వ సంవత్సరం, మే నెలలో మేము ఒక చేదు అనుభవం ఎదుర్కొన్నపుడు బాబా మాకు అండగా ఉండటం మాకు అనుభవమైంది. ఆ నెలలో మా నాన్నకి హార్ట్ ప్రాబ్లెమ్ రావడంతో ఇక నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ సమయంలో నేను MBA మొదటి సెమిస్టర్ చదువుతున్నాను. మా బ్రదర్ అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, మా జీవితాలు ఇంకా స్థిరపడలేదు. "బాబా! ఎలాగైనా నాన్నని కాపాడు" అని బాబాను వేడుకున్నాను. మా అమ్మానాన్నలు బాగా కృంగిపోయారు. "బాబా వున్నారు, దిగులు పడనవసరం లేదు" అని నేను వారికి చెప్పాను. ఆ సమయంలో మాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, బాబా తప్ప మాకు వేరే దిక్కు లేదు. ఆపదలో ఉన్నవారికి ఆ సాయినాథుడే అండ. ఆ మరుసటిరోజు నాన్నకి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. నాన్న మొదటిసారి ఆపరేషన్ ధియేటర్‌లోనికి వెళ్లడానికి టెన్షన్ పడ్డారు. ఆరోజు ఉదయాన్నే సరూర్‌నగర్ సాయిమందిరం పూజారి బాబా ఊదీని మా ఫ్రెండ్‌కి ఇచ్చి పంపారు. ఆపరేషన్ ధియేటర్‌లోనికి వెళ్ళేముందు నాన్న నుదుటన అమ్మ బాబా ఊదీని పెట్టింది. నాన్న బాబాను ప్రార్థించి లోపలికి వెళ్లారు. ఇక అక్కడ జరిగింది ఆశ్చర్యం. నాన్నకి డాక్టర్స్ వాయిస్ వినిపిస్తోంది, కానీ కనిపిస్తున్నది మాత్రం బాబానే. పొడవాటి ఆకుపచ్చని గౌన్ వేసికొని బాబా మా నాన్నకి ఆపరేషన్ చేస్తున్నారు. నాన్నకి అర్థం కాలేదు. కానీ బాబా స్పష్టంగా కనపడడం మాత్రం నాన్నకి గొప్ప అద్భుతం. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రావడం, నాన్న నాతో ఆ విషయం చెప్పటం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇక ఆ క్షణం నుండి నాన్న బాబా చరిత్రను నిత్యపారాయణం చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా రాస్తున్నంతసేపు నా ఒళ్ళంతా గగుర్పాటు చెందుతోంది. అందుకే అంత స్పష్టంగా వ్రాయలేకపోతున్నాను. ఒక్క విషయం చెప్పాలంటే, "పిలిస్తే పలుకుతాను" అన్న మాట నిలబెట్టుకున్నారు బాబా. నా జీవితంలో ఇలా ఎన్నో సాయిలీలలు జరుగుతూనే  వున్నాయి. బాబా అనుగ్రహం ఉంటే వాటిని తర్వాత తెలియజేస్తాను.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo