శ్రీమతి రాధాబాయి బాబాకు అంకిత భక్తురాలు. ఆమె తన జీవితంలో చాలా సమయం వివిధ ఆచారాలతో బాబాను ఆరాధిస్తూ గడిపేవారు. ఆమె ఉదయాన్నే లేచి బాబాను ప్రార్థిస్తూ మొదలుపెట్టి, సాయంత్రం ఆలస్యంగా ప్రార్థన ముగించేవారు. ఆమె తన ఇంటిపనులను కూడా సక్రమంగా చేసుకుంటూ, తన భర్తను కూడా జాగ్రత్తగా చూసుకొనేవారు. 1946, అక్టోబరు 2వ తేదీన ఆమె భర్త సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే, "చాలా అలసటగా ఉంది, కాసేపు పడుకుంటాను" అని చెప్పాడు. ఒక గంట తరువాత ఆమె వెళ్లి చూస్తే, విపరీతమైన జ్వరంతో అతని ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. ఆమె అతనికి సౌకర్యవంతంగా ఏర్పాటు చేసింది. కానీ త్వరలోనే అతడు అస్వస్థతకు గురైనాడు. ఆమె కుటుంబసభ్యులు వైద్యుడిని పిలిపించమని ఆమెకు సలహా ఇచ్చారు. కానీ, 'బాబానే అతనిని జాగ్రత్తగా చూసుకుంటార'ని చెప్పి, వైద్యుడిని పిలవడానికి నిరాకరించింది రాధాబాయి.
తరువాత ఆమె తన పూజగదికి వెళ్లి బాబాను తీవ్రంగా ప్రార్థించింది. కొంతసేపటి తరువాత, బాబా తన ఇంటికి మోటార్‌సైకిల్‌పై వస్తున్నట్లు చూసింది. బాబా ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్లిన తర్వాత వారి మధ్య ఈక్రింది సంభాషణ జరిగింది:

బాబా: "చిన్న విషయానికి ఎందుకు నన్ను పిలుస్తున్నావు?".
రాధాబాయి: "బాబా! నా భర్త తీవ్రజ్వరంతో బాధపడుతున్నారు. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పిలవను?".
బాబా నవ్వి, ఆమెకు తమ చేతినిండా ఊదీ ఇస్తూ, "దీనిని నీ భర్త శరీరమంతా జల్లు" అన్నారు.
బాబా ఆదేశించినట్లే రాధాబాయి చేసింది. 15 నిమిషాల్లో ఆమె భర్త శరీరమంతా చెమటలు మొదలై జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె బాబా వైపు చూసింది, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు.
సమాప్తం....
బాబా ఆదేశించినట్లే రాధాబాయి చేసింది. 15 నిమిషాల్లో ఆమె భర్త శరీరమంతా చెమటలు మొదలై జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె బాబా వైపు చూసింది, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు.
సమాప్తం....
No comments:
Post a Comment