సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఒక ముస్లిం రైతు


ఒక ముస్లిం రైతు తన పంటపొలాలను అభివృద్ధిపరచడం కోసం 500 రూపాయలు అప్పు చేశాడు. ఆ ఋణాన్ని ఎలా తీర్చగలనా అని ఆందోళన చెందాడు. తన పొలంలో ఒక బావి త్రవ్వినట్లయితే పంటలు బాగా పండుతాయని, తద్వారా వచ్చే ఆదాయంతో తన ఋణాన్ని తీర్చుకోవచ్చని తలచాడు. అనుకున్నట్లుగానే బావి త్రవ్వకం మొదలుపెట్టాడు. త్రవ్వుతున్నప్పుడు మధ్యలో రాయి పడి, దాన్ని పేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైన ప్రేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి అనుమతికోసం అతడు రెండుసార్లు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతని దరఖాస్తులను కలెక్టర్ తిరస్కరించాడు. దాంతో ఏమి చేయాలో అర్థంకాక అతడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఆ స్థితిలో అతను సాయిబాబాను దర్శించి తన మనోవేదనను ఆయనతో విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, "నానాను (నానాసాహెబ్ చందోర్కర్) రానీ, నేను అతనితో చెప్తాను" అని అన్నారు. 

తరువాత నానా శిరిడీ వచ్చినప్పుడు రైతు మళ్ళీ తన విషయాన్ని సాయిబాబాకు గుర్తుచేశాడు. బాబా నానాతో, "ఇతని దరఖాస్తుని నీ సిఫారసుతో కలెక్టర్‌కి అందజేయి. తద్వారా ఇతని పని పూర్తవుతుంది" అని అన్నారు. బాబా శక్తిసామర్థ్యాల గురించి నానాకు తెలుసు, కానీ అతడు తన మనసులో 'ఆ దరఖాస్తు ఆమోదింపబడద'ని అనుకున్నాడు. అయినా సరే అతడు బాబా ఆజ్ఞను శిరసావహించి, కలెక్టర్ వద్దకు రైతుని తీసుకొని వెళ్లి, దరఖాస్తుని కలెక్టర్ ముందు ఉంచి, అంతకుముందు రెండుసార్లు అతని దరఖాస్తు తిరస్కరించబడినట్లు కూడా చెప్పాడు. అప్పుడు కలెక్టర్, "ప్రేలుడు పదార్థాలను ఎందుకు ఉపయోగించాలని పట్టుబడుతున్నావు?" అని రైతును అడిగాడు. అందుకతను, "సాహెబ్! నేను ప్రభుత్వం నుండి 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధిపరచి ఆ ఋణం తీర్చాలని అనుకున్నాను. బావి లేకుండా నేను వ్యవసాయాన్ని అభివృద్ధిపరచలేను. ప్రేలుడు పదార్థాలు లేకుండా బావి త్రవ్వకం పూర్తికాదు. మీరు అనుమతి ఇవ్వకపోతే నేను ఎలా బావి త్రవ్వకం పూర్తి చేయగలను? ఎలా ఋణాన్ని తిరిగి చెల్లించగలను?" అని బదులిచ్చాడు. కలెక్టర్ అతని సమాధానంతో సంతృప్తి చెంది అనుమతినిచ్చాడు. నానాసాహెబ్‌కు సాయిబాబా శక్తిసామర్థ్యాలు ఏమిటో మరోసారి అనుభవమయ్యాయి. రైతు బావి త్రవ్వించుకొని, పంటలొచ్చాక ఋణం నుండి విముక్తి పొంది సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.

సమాప్తం.

Source: శ్రీసాయిబాబా, రచన: సాయిశరణానంద

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం శ్రీ సద్గురు సాయి నాధ్ మహా రాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo