ఈ భాగంలో అనుభవం:
- బాబా తన భక్తుల ఆకలిని తీర్చిన అద్భుతమైన లీల
బొంబాయి నివాసియైన వివేక్ మజ్‌గాఁవ్‌కర్ గొప్ప సాయిభక్తుడు. బాబా అనుగ్రహం లేకపోయినట్లయితే జీవితమే వ్యర్థమని భావించే వ్యక్తి. అతని జీవితమంతా బాబా చుట్టూరా పరిభ్రమిస్తూనే ఉంటుంది. బాబా దయవల్ల అతడెంతో తృప్తిగా సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఒకసారి అతని జీవితంలో చాలా దయనీయమైన పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితి నుంచి అతన్ని బాబా ఏవిధంగా గట్టెక్కించారో తెలుసుకుంటే చాలా అద్భుతంగాను, ఆశ్చర్యకరంగాను ఉంటుంది. ఆ అద్భుతలీలను ఆస్వాదించండి.
ఒకసారి అతని బంధువులు తమను శిరిడీ తీసుకుని వెళ్ళమని అతన్ని కోరారు. వారి కోరిక మేరకు అతను ఒక పెద్ద వ్యాను ఏర్పాటు చేశాడు. ఆడవాళ్లు, పిల్లలు, బంధువులందరూ కలిసి ఎటువంటి కష్టం లేకుండా శిరిడీ చేరుకున్నారు. ఆ రాత్రికి శిరిడీలోనే బసచేసి మరుసటిరోజు ఉదయం కాకడ ఆరతికి వెళ్లి తనివితీరా బాబా దర్శనం చేసుకున్నారు. తరువాత అందరూ ఫలహారాలు చేశాక, 'అక్కల్‌కోట కూడా చూద్దాం, అక్కడికి తీసుకుని వెళ్ళమ'ని అడిగారు. వివేక్ సరేనని ఒప్పుకోవడంతో అందరూ సామాన్లు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలయింది. శిరిడీ నుండి అక్కల్‌కోట చాలా దూరమనే విషయం పాపం వివేక్‌కి తెలీదు. ఆ విషయమే డ్రైవరుని అడిగాడు. “ఆఁ, ఎంతండీ, రెండుగంటల్లో మనం అక్కల్‌కోట చేరుకోవచ్చు” అన్నాడతను. చెప్పడమైతే చెప్పాడు గానీ, అసలు అక్కల్‌కోటకి ఏ మార్గంలో వెళ్ళాలో, అది ఎంతదూరంలో ఉందో అతనికి కూడా తెలీదు. డ్రైవరుకి కూడా తెలీదనే విషయం ఆ సమయంలో వివేక్‌కి తెలీదు. సరే, 11 గంటలకి బయలుదేరితే అక్కల్‌కోటకి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా చేరుకోవచ్చు, అక్కల్‌కోటలో భోజనాలు చేసుకోవచ్చు అనుకుని అందరూ వ్యానులో బయలుదేరారు. రెండుగంటలు ప్రయాణం చేసినా అక్కల్‌కోట చేరుకుంటున్న సూచనలేమీ కనపడలేదు. అసలు వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో అయోమయంలో పడ్డారు. డ్రైవర్ని అడిగితే, "అక్కల్‌కోటకి దగ్గరలోనే ఉన్నాము, కొద్దిసేపట్లో చేరుకుంటామ"ని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా అతడు అదే సమాధానం చెప్పసాగాడు. చివరికి డ్రైవర్ రోడ్డుప్రక్కన ఉన్న సూచికలను బట్టి అక్కల్‌కోట వెళ్ళడానికి షోలాపూర్ మీదుగా వెళ్ళాలని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అయింది. ఇక ఆ దారిలో వెళ్ళసాగాడు. అడిగిన ప్రతిసారీ ఇక కాసేపట్లోనే అక్కల్‌కోట చేరుకుంటామనే చెబుతున్నాడు డ్రైవరు. మొత్తానికి వాళ్ళు అక్కల్‌కోట చేరేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ అలసిపోయి చాలా ఆకలితో ఉన్నారు. ముందు ఆడవాళ్ళు, పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడైనా ఒక గది దొరికితే వాళ్ళని అక్కడ ఉంచి, భోజనాల ఏర్పాటు గురించి చూద్దామనుకున్నాడు వివేక్. అయితే అక్కల్‌కోట ఎక్కడో మారుమూలనున్న చిన్న గ్రామం. అప్పటికి సంస్థానం వారి భక్తనివాస్ ఇంకా నిర్మాణదశలోనే ఉంది. బాగా రాత్రివేళ కావడంతో అన్నీ మూసేసి ఉన్నాయి. కనీసం బసచేయడానికి ఒక్క గది గానీ, ఏదన్నా తిందామన్నా ఒక్క హోటలు గానీ లేవు. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. పెద్దవాళ్ళే ఆకలికి తట్టుకోలేకుండా ఉంటే పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చిన్నపిల్లలందరూ 'ఆకలి, ఆకలి' అంటూ ఏడుస్తున్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అది చూసిన వివేక్ తినడానికి కాస్తైనా దొరుకుతుందేమో, చిన్న హోటలు ఏదయినా కనిపిస్తుందేమో చూద్దామని వ్యానుని మెయిన్ రోడ్డు మీదే పోనిస్తూ ఉండమని డ్రైవరుకి చెప్పాడు. కానీ రోడ్డంతా చీకటిగాను, నిర్మానుష్యంగాను ఉంది. ఎంత ముందుకు వెళ్ళినా ఏమీ కనపడలేదు.
ఆఖరికి ఒకచోట తమలపాకులు అమ్మే చిన్న దుకాణం, దాని ప్రక్కనే రేకుల షెడ్డుతో ఉన్న చిన్న హోటలు కనిపించాయి. వివేక్ అక్కడికి వెళ్లి, "కడుపులో ఆకలి కరకరమని నమిలేస్తూ ఉంది. తినడానికి ఏమయినా దొరుకుతుందా?" అని ఆ చిన్న హోటల్ యజమానిని అడిగాడు. అతడు, "ఇప్పుడు ఏమీ లేవు. అన్నీ మూసేసి ఉన్నాయి. ఈ సమయంలో భోజనం దొరకడం చాలా కష్టం. ప్రొద్దున్నయితే భోజనం దొరుకుతుంది" అని చెప్పాడు. ఇంకా ముందుకుపోతే తినడానికి ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో ముందుకు సాగాడు వివేక్. కానీ నిరాశే ఎదురయింది. చేసేదిలేక వ్యానుని వెనక్కి మళ్లించారు. అంతకుముందు అడిగిన హోటల్ వద్దకు మళ్ళీ వెళ్లి అతనిని బ్రతిమాలాడు వివేక్. కానీ పాపం ఆ హోటల్ యజమాని మాత్రం ఏం చేయగలడు, వారి బాధను విని ఊరుకోవడం తప్ప? ఇంకేదయినా హోటల్ కనబడుతుందేమో చూద్దామనే ఆశతో ఊళ్ళోకి బయలుదేరారు. కానీ ఊళ్ళో కూడా అతనికి నిరాశే ఎదురైంది. ఏ దారీ కనబడలేదు. చివరికి బాబాని శరణు వేడుకున్నాడు వివేక్. అతనెంతో ఆర్తితో, “బాబా! నాకింతటి విషమ పరీక్ష పెడుతున్నావేమిటి? నాతోపాటుగా చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. పసిపిల్లలు ఆకలితో బాధపడుతూ ఉంటే వారి పరిస్థితిని చూడలేకుండా ఉన్నాను. కనీసం పిల్లలకోసమయినా తినడానికి ఏమయినా దొరికేటట్లు చేయి బాబా!” అని కన్నీళ్ళతో బాబాని వేడుకున్నాడు.
(బాబా శిరిడీలో ఎంతోమందికి తానే స్వయంగా వండి అన్నదానం చేశారు. మరి ఈ సమయంలో అన్నార్తులను ఆదుకోరా?)
వివేక్ డ్రైవరుని మరలా అంతకుముందు తాము ఆగిన హోటల్ వద్దకే మెల్లగా వ్యానుని పోనిమ్మని చెప్పాడు. ఆ తరువాత జరిగిన సంఘటనకి అతని నోటివెంట మాట రాలేదు. వారు ఆ హోటల్ సమీపిస్తుండగా ఆ హోటల్ యజమాని వ్యానుని ఆపమన్నట్లుగా చేతులు ఊపుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వ్యాన్ ఆపితే ఆ హోటల్ యజమాని, “అయ్యా, ఆగండి. హోటల్ లోపలికి రండి” అని ఎంతో ఉద్వేగంతో అందరినీ లోపలికి ఆహ్వానించాడు.
ఏమి జరుగుతోందో వివేక్‌కి అసలేమీ అర్థం కావట్లేదు, అసలతని ఊహకి అందడం లేదు. అందరూ హోటల్లోకి వెళ్లారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ నాలుగు స్టీల్ బకెట్లు వరుసలో పెట్టబడి ఉన్నాయి. వాటన్నిటిలో ఘుమఘుమలాడుతూ వేడివేడి పదార్థాలు చాలా సమృధ్ధిగా ఉన్నాయి. ఒకదానిలో జీడిపప్పుతో పలావు, మిగిలినవాటిలో బంగాళాదుంప కూర, పూరీలు, అన్నం, పప్పు ఉన్నాయి. ఆశ్చర్యంతో వివేక్, “నీ హోటల్లో అసలేమీలేవని ఇంతకుముందే చెప్పావుగా! మరి ఇంతలోనే ఇన్ని మధురమైన వేడివేడి పదార్థాలు ఎలా వచ్చాయి?" అని అడిగాడు. అప్పుడు హోటల్ యజమాని కూడా అంతే ఉద్వేగంతో, “అయ్యా, నేనేం చెప్పను? చెప్పాలంటే నా శరీరమంతా రోమాంచితమవుతోంది. మీరు ఇక్కడినుంచి వెళ్ళగానే వయసు పైబడిన ఒక వ్యక్తి ఎంతో వేగంగా ఇవన్నీ పట్టుకుని వచ్చాడు. వాటిని నాకిచ్చి, “నా పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మళ్ళీ తొందరలోనే ఇక్కడికి తిరిగి వస్తారు. వారికి కడుపునిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చు” అని చెప్పి వెళ్ళిపోయాడు” అని జరిగినదంతా వివరంగా చెప్పాడు. బాబా తప్ప మరెవరూ ఆవిధంగా చేయలేరనే విషయం వివేక్‌కి అర్థమయింది. అందరూ భోజనాలు చేయడానికి క్రింద కూర్చున్నారు. బాబా స్వయంగా తీసుకుని వచ్చిన అమృతమయమైన ఆ మధుర ప్రసాదాన్ని అందరూ తనివితీరా భుజించారు. నోటిలో పెట్టుకుంటున్న ముద్దముద్దకీ బాబా తమ మీద కురిపించిన ప్రేమకి వివేక్ కళ్ళవెంట కన్నీళ్ళు చెంపలమీదుగా జాలువారసాగాయి. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భోజనం కానిచ్చాడు. తరువాత వివేక్, అతని బంధువులు అక్కల్‌కోటలో రెండు రోజులున్నారు. వాళ్ళంతా తిరుగుప్రయాణమయ్యేటప్పుడు ఆ హోటల్ యజమానికి కృతజ్ఞతలు చెప్పడానికి హోటల్ దగ్గర ఆగారు. ఆ హోటల్ యజమాని, "ఆ స్టీలు బకెట్లు తెచ్చిన వ్యక్తి వాటిని తీసుకుని వెళ్ళడానికి మరలా రాలేద"ని చెప్పాడు.

source: సాయి సాగర్ మ్యాగజైన్ వాల్యూమ్ – 7 నం. 2 ఏప్రిల్ – మే, 2009.
todays experience i liked very much.i felt very happy.sai came and feed his devotees.they are lucky.sai is very kind.
ReplyDelete🙏🙏🙏🙏
ReplyDeletereally a great and exciting experience. Mr Vivek and his relatives are very fortunate to have the prasadam offered by saibaba himself
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai. Very fortunate for having been fed by Baba
ReplyDeleteబాబా ప్రేమకి మనసంతా కరిగి కన్నీరై ప్రవహిస్తోంది. ఇంత అద్భుతమైన బాబా లీలని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు సాయీ 🙏
ReplyDelete