సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా జీవితంలో బాబా లీలలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

పేరు తెలియజేయని ఒక భక్తురాలి అనుభవాలు:

బాబా! గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు, అందుకు మీకు నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని వదిలి వేయకండి. మీరు లేనిదే నేను లేను.

ప్రియమైన సాయి బంధువులందరికీ నేను జనవరి, 2017లో నాకు జరిగిన కొన్ని అనుభవాలు తెలియజేస్తాను.

అనుభవము 1:
జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్లాను. నేను గర్భం దాల్చిన తరువాత చాలా తరచుగా అనారోగ్యం పాలవుతుండటంతో చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడ్చి, "బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు?" అని నా తల్లిని అడిగాను. "నేను ఆయనను ఎంతో ప్రార్ధిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్ధనలకు సమాధానం ఇవ్వటం లేదు. బాబా  నిజంగా దయగల వారైతే, నా ప్రార్ధనలు వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు ముందు వచ్చి నాకు జవాబివ్వాలి" అని మా అమ్మతో అన్నాను. మా అమ్మ నా బాధ చూసి, "ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారు" అని చెప్పింది. నేను 9గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు. అతను ఎవరైనప్పటికీ, మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి రెండువేల రూపాయలు ఇచ్చి, పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి, ఆరతి మా తల్లిదండ్రులతోపాటు అతనిని కూడా తీసుకోమని చెప్పాను. అతను ఆరతి తీసుకోకుండా, మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో ఆరతి నాకు చూపించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయస్సులో ఉంటే, వారు ముందు ఆరతి తీసుకొని తర్వాత తమ పిల్లలకు చూపిస్తారు. నేను అతను వేరెవరో కాదు బాబాయే అని, నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనస్సు ఆనందంలో మునిగిపోతుంది.

అనుభవము 2:
జనవరి మధ్యలో అదే వారంలో హైదరాబాదు అల్వాల్ లో చాలా ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయానికి నా మ్రొక్కు తీర్చుకోవటానికి వెళ్లాను. వెళ్లేముందు అలవాటు ప్రకారం నేను బాబాను నాతో రమ్మని, పూజలో గైడ్ చేయమని ప్రార్ధించాను. బాబా తన భక్తులతో ఎప్పుడూ తోడుగా ఉంటారని నాకు తెలుసు, కానీ నేను బాబాని పిలుస్తాను, ఎందుకంటే బాబా నాతో ఉన్నారని, నేను ఒంటరిగా లేను అని నా భావన. ఆయనను నా తండ్రిలా, నా కుటుంబ సభ్యుడిలా ఎల్లప్పుడూ వ్యవహరిస్తాను. బాబా కృప వలన ఆలయంలో నాకు చాలా మంచి దర్శనం లభించింది. నేను అభిషేకం కూడా చేయించాను. అంతేకాకుండా పల్లకి ఉత్సవంలో పల్లకిని పట్టుకునే అవకాశం కూడా నాకు లభించింది. అక్కడ ప్రతి ఒక్కరూ నాకు తగిన సమాచారం ఇవ్వడంలో చాలా సహాయపడ్డారు. లవ్ యు సో మచ్ బాబా.

అనుభవము 3:
షిర్డీలో బాబాకు ధోతి ఇస్తానని మ్రొక్కుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత నేను ఆ సంగతి మరచిపోయాను. మేము మా బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు, వివాహం తర్వాత నేను నిద్రపోతున్నాను. పంతులుగారు కొన్ని సాంప్రదాయ ఆచారాలు చేయటానికి వచ్చారు. అతను, తాను షిరిడీకి వెళ్ళవలసి ఉందనీ, అందువల్ల 12 గంటలకి ముందు పూర్తి చేయాలనీ చెప్తున్నారు. ఆ మాటలు విని నా మ్రొక్కు గుర్తుకు వచ్చి, వెంటనే మా ఆంటీని బాబా కోసం మంచి ధోతిని తెప్పించమని చెప్పాను. ఆమె దానిని తీసుకురాగానే పంతులు గారికి ఇచ్చి షిర్డీలో బాబాకు అందజేయమని చెప్పాను. సాధారణంగా షిర్డీ సమాధి మందిరంలో ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే, వారు దానిని సమాధికి తాకించి తిరిగి ఇచ్చేస్తారు. కానీ నేను పంపిన ధోతీని తిరిగి ఇవ్వకుండా అక్కడే ఉంచేశారని పంతులుగారు నాకు చెప్పినప్పుడు, 'బాబా నేను ఇచ్చిన ధోతీ ధరించాలని ఉంచుకున్నారు' అని చాలా ఆనందంగా అనిపించింది.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

22 comments:

  1. OM SAIRAM, HELP ME SAI

    NEED YOUR BLESSINGS AND SUPPORT. PL HELP ME OUT

    ReplyDelete
  2. Baba! Give me your blessings throughout my life.

    ReplyDelete
  3. Baba ma mother health problem tondarga cure avali thandri

    ReplyDelete
  4. Baba santosh ki pain taggali thandri

    ReplyDelete
  5. Sai baba nak crompton ofc li job vacchela chudu baba pls pls pls

    ReplyDelete
  6. Sai Ram be with me always and bless me ,protect me - thank you baba.

    ReplyDelete
  7. Sainath Maharaj ki Jai....
    Baba please intlo andarni kapadu thandri... Plzz Dad ni kapadu Baba....
    Plzz Dad ki Gastric trouble thaginchi, oxygen levels pechandi Baba... And lungs lo infection thaginchandi... And Corona virus Motham thaggela cheyandi Baba... Plzz..... Amma ni Kuda kshemanga kapadandi Baba... plz I beg U. Amma ki Kuda Corona virus thaggela cheyandi Baba... Plzzzz Baba plzz...
    Nenu emina thappu chesunte nanuu kshaminchandi Baba.... Plzzz I'm begging u by falling on your feet Baba... OM SRI SACHITHANAND SADGURU SAI NATH MAHA RAJ KI JAI...

    ReplyDelete
  8. Om sai Ram, Baba please get me out of the present mess I am in. Please get me out without any financial, physical, psychological or any such losses from the problem I am facing. Rajadhiraja Yogiraja Samardha Saduguru Sri Sainath Maharaj ki Jai

    ReplyDelete
  9. I was struggling to get out of a personal problem since June 2021. Then I prayed Sai and started reading Sai Sacharitra religiously with full faith on Lord Sai from August. To my happiness and satisfaction, I came out of the problem by September end and I owe my sincere prayers to the Lord Sai. Om sai Sri Sai Jaya Jaya Sai

    ReplyDelete
  10. Baba.... Naku job tepincharu. Chala happy ga vundi మరియు bayanga kuda vundi ela chesthano manchiga cheyagalana? endukante edi naku first job , studies complete ayyi 10 years tarvtha vachindi. Eppativaraku naku real time experience ledu. Edo teliyani bayamu tension.miru naku pakkane kurchuni job cheyinchandi baba. Naku dairyam ga vuntundi. Na first salary tho Miku emanna evvali anukuntunanu em evvalo teliyatam ledu. Mire naku teliyacheyandi baba... Om Sai ram.... Sri sacchithanandha sadguru Sainath Maharaj ki jai

    ReplyDelete
  11. Baba please help me Papa ki jandies taggela chey baba please baba plzzzz..... sai ram...

    ReplyDelete
  12. naa health chala twaraga cure kavali sai baba mental ga phisical ga

    ReplyDelete
  13. Baba e blog dwara cheppukuntunna ma problems tandri ma akka ki job ippinchu, chala financial problems koorukipoysm, ne challani chupulu prasarinchu, Inka parikshin haku aardika avadaralu అప్పులు teeripoye విధం గా జాబ్ ఇప్పించి తండ్రి మ అక్క కి plz బాబా నిన్ను bratimalukuntunna తండ్రి

    ReplyDelete
  14. Baba Kuda na life chala big miracles chesaru ma babu ki fever vastha test
    lu cheyepitha platelet count 23000 Ani report echaru hospital loo adi chusi doctor chala serious undhi position big hospital tesukuvallale Ani annaru Naku chala bayam vesidhi na mind block ayyidhi baba taluchukone reports wrong avalane korukunnanu Eluru hospital tesukuvellitha akkada doctor check chesi babu ki EMI Kadu malli testlu cheyddamu ane testlu cheyicharu testlu wait chesthu bayata chair lo kurchunnanu avaru talidhu baba big photo pattukuni opposite lo unnru photo chuse adupu vachidhi test reports vachayi platelet count300000 lakh unnayi baba na babu ki miracle chesaru

    ReplyDelete
  15. ఓం సాయిరాం!
    నా జీవితంలో జరిగిన సాయినాధుని లీల మీతో పంచుకుంటున్నాను.
    నేను సాయి భక్తురాలిని ఎలా అయ్యానో నాకు గుర్తులేదు. మా యింట్లో పూజలు చేసే అలవాటు చాలా తక్కువ. నేను కాలేజీలో ఇంటర్ మొదటి సం. చదువుతున్న సమయంలో మా యింటి నుండి కాలేజీకి వెళ్ళే దారిలో సాయి మందిరం వుండేది. నాకు ఎలా అలవాటైందో గుర్తులేదు, నాకు వీలుకుదిరినప్పుడు బాబా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసేదాన్ని. కోరికలు ఏవీ వుండేవికావు. నా ప్రదక్షిణలకు ఒక కారణమంటు ఏది లేదు. ఎందుకో బాబా అంటే భక్తి. రెండు సం. ల తరువాత అనుకోకుండా నాకు పెళ్ళి కుదిరింది. ఎవరో పేరు తెలియని వ్యక్తులు నా పేరు మీద సాయి లీల సంచిక కు ఒక సం. చందా కట్టారు. అది పెళ్ళికి వచ్చిన బహుమతి అనుకున్నాను. కొన్ని సం. తరువాత గురుచరిత్ర చదవటం మొదలుపెట్టాను. అప్పుడు కూడా ప్రత్యేకమైన కోరికలు ఏవీ లేవు. చాలాసార్లు గురుచరిత్ర చదివాను. ఒక్కోసారి ఒక్కరోజులో గురుచరిత్ర పూర్తి చేసిన సందర్భాలు వున్నాయి. నా కారణంగా మా అమ్మకు కూడా సాయి మీద భక్తి మొదలైంది. ఒకసారి మా కుటుంబం అంతా కలిసిన సందర్భంలో మా అమ్మ ఇంట్లో బాబా భజన చేయించాలని సంకల్పించుకున్నారు. అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. సత్సంగం వారు తెచ్చిన బాబా గారి పెద్ద పటం కు రకరకాల పూల మాలలతో అలంకారం అధ్బుతంగా కుదిరింది. భజనకు 300 పైగా అతిధులు వచ్చారు. భజన చేసే వారు సత్సంగం తరపున 50 మంది వరకు వచ్చారు. బాబా వారి నామస్మరణ, భక్తి పాటలతో దాదాపు మూడు గంటలు భజన కార్యక్రమం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా జరిగింది. వచ్చిన అతిధులు ప్రతిఒక్కరూ పూర్తిగా భజనలో లీనమై ఆస్వాదించారు. భజన పూర్తి అయ్యాక అతిధులు అందరూ భోజనం చేసి సెలవు తీసుకున్నారు. మేము కుటుంబ సభ్యులు మాత్రమే భోజనానికి మిగిలాము. మా యింటి రెండవ అంతస్తులో భోజన ఏర్పాట్లు జరిగాయి. అతిధులని పంపిచటానికి మా పెద్దన్నయ్య క్రిందకు వెళ్ళి, తిరిగి మళ్ళీ మొదటి అంతస్తుకు చేరుకున్న సమయంలో క్రీనీడలో మెట్లకు సమీపంలో ఒక ముసలి వ్యక్తి తలపైనుండి గోనె పట్టా కప్పుకుని రోడ్ వైపు మొహం పెట్టి నిల్చుని వున్నారట. ఆయన ఎవరో, మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చారో తెలీదు. మా అన్నయ్య ఆయనను బిచ్చగాడు అనుకుని తెలియకుండానే భోజనానికి రండి అని పిలిచారు. ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా మా అన్నయ్య వెనుక రెండవ అంతస్తులో భోజనాలు జరుగుతున్న ప్రదేశం కు వచ్చి మా కుటుంబ సభ్యులు కూర్చున్న పంక్తికి ఎదురుగా ఒక్కరే కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఎదురుగా ఎవరో కూర్చున్నారు అన్న భావన మా అందరికీ వుంది కాని మా ధ్యాస, మా మాటలు అన్నీ అంత అద్భుతంగా జరిగిన భజన మీదే నిమగ్నమై వుండటం వల్ల మాలో ఏ ఒక్కరూ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముఖంపై మా చూపు నిలుపలేదు. ఆయన మౌనంగా ప్రశాంతంగా మా మాటలు వింటూ మా కుటుంబ సభ్యులతోపాటు భోజనం పూర్తి చేసారు. ఆయన ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో మేము ఎవరం గమనించలేదు. సుమారుగా ఒక గంట తరువాత మా చిన్న వదిన సడన్ గా అడిగింది… ,యింతకుముందు మన ఎదురుగా కూర్చుని భోజనం చేసినాయన వేషధారణ బాబా భిక్షకు వెళ్ళేపుడు ధరించిన పటంలో మాదిరిగా వున్నారు కదా అని. ..ఒక్క క్షణం అందరం అవాక్కయ్యాము. ఎంత గుర్తు చేసుకోవాలి అని ప్రయత్నించినా ఆయన ముఖం మాలో ఎవరికీ గుర్తురాలేదు. దాదాపు అర్ధగంట మాకు ఎదురుగా కూర్చున్నా మేము ఎవరం ఆయనను ఎందుకు సరిగా చూడలేకపోయామో తెలీదు. అందరం అలసట వల్ల ఎక్కువ ఆలోచించలేకపోయాము. మరుసటి రోజు వుదయం సత్సంగం గ్రూప్ నుంచి బాబా వారి పటం తీసుకెళ్ళటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడుతూ మా అమ్మ రాత్రి జరిగిన విషయం యధాలాపంగా చెప్పింది. వారు చాలా ఆనందించి… మరి అంత బాగా భజన జరిగితే సాయి రాకుండా ఎలావుంటారు, ఆయన దయ మీమీద వుంది అన్నారు. మేము ఆ మాటలు విని బిత్తరపోయాము. ఎందుకంటే మా కుటుంబంలో భజన వినటం కాని, చేయించటం కాని అదే మొదటిసారి. అంతకు ముందు ఎప్పుడూ మేము యిలాంటి అనుభవం వినలేదు. సాయినాధుని అనుగ్రహానికి మా కుటుంబ సభ్యులు అందరం ఎంతో సంతోషించాము. ఈ సంఘటన జరిగి 24సం. అయినా యిప్పటికీ తలుచుకున్న ప్రతిసారీ మనసు సంతోషంతో సాయిమీద కృతజ్ఞతతో నిండిపోతుంది. ఈ 24 సంవత్సరాలల్లో యిలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి . సాయినాధమహరాజ దయ ఎప్పటికీ మనందరిలా వుండాలని కోరుకుంటున్నాను.

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!

    ReplyDelete
  16. baba ma amma ki twarga nayam ayela chey tandri. Nenu purtiga ne meda adarpadanu swamy , nuvve dikku baba ma kutumbaniki ..inka enni parikshalu ayya..memu manava matrulame..nuv ma pai jali karuna chupinchakapote memu ela baba bratikedi..Ma amma ki health antha bagu ayetatu chudu swamy .. tappaka kutumba sametham ga shirdi vastam baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo