01 మార్చి 2017 నాటి సాయి లీలలు
నా పేరు అనితాకాంత్, నేను ముంబాయి నివాసిని. నేను నా ఇంటిలో ప్రైవేటు ట్యూషన్లు చెప్తూ ఉంటాను. మేము 9వ అంతస్తులో ఉంటున్నాం. మా అపార్టుమెంటులో 2 లిఫ్టులు ఉన్నాయి. ఒకదానికి ఆటోమేటిక్ డోర్స్, మరొకదానికి నార్మల్ డోర్స్ ఉన్నాయి.
ఒక సాయంత్రం 5 గంటలకు నా విద్యార్థులు ప్రియాన్షీ, శ్రుతి (ఇద్దరు బాలికలు) మరియు నామ్ (బాలుడు) 3 మరియు 9వ తరగతి చదువుతూ ఉన్నారు. డియా మరియు ఖుషి 1వ తరగతి చదివే పిల్లలు. ట్యూషన్ పూర్తై, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నేను లిఫ్ట్ వచ్చేవరకు వేచి ఉండమని వాళ్ళకి చెప్పి, నేను కూడా లిఫ్ట్ వచ్చేవరకు ఉండి, పిల్లల్ని లిఫ్ట్ లోకి పంపి డోర్స్ క్లోజ్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి టీ త్రాగబోతుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ చూస్తే, ప్రియాన్షి కాల్ చేస్తూ ఉంది. కాల్ లిఫ్ట్ చేయగానే, తాము లిఫ్టులో చిక్కుకున్నామని ప్రియాన్షి చెప్పింది. ఒక్కక్షణం నేను అవాక్కై, ఏ అంతస్తులో ఉన్నారని అడిగాను. అదే ఫ్లోర్ కానీ కొద్దిగా క్రిందకు దిగింది అని చెప్పింది. బయటకు వస్తే వారి గొంతులు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. నెట్ వర్క్ సమస్య కారణంగా ఫోన్లు ఆటోమేటిక్ లిఫ్టులో పనిచేయవు, కానీ బాబా దయవలన కాల్ వచ్చింది. నేను, "ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి" అని వారికి చెప్పి, నా ఇంటి నుండి బయటకు వచ్చి, సొసైటీ వాచ్ మెన్ ని పిలిచాను.
వాచ్ మెన్ వెంటనే పైకి వచ్చి 10 నిమిషాలు ప్రయత్నించాడు, కానీ డోర్స్ ఓపెన్ చేయలేక మరొక వాచ్ మెన్ ని పిలవాలని చెప్పాడు. నేను చాలా భయపడి, 'సాయిబాబా! సాయిబాబా!' అని బాబాని స్మరించుకుంటూ మరొక వాచ్ మెన్ ని పిలవడానికి క్రిందకి వెళ్ళాను. అక్కడ వాచ్ మెన్ కనిపించలేదు. కాని నేను ఇద్దరు మనుష్యులను చూశాను. ఒకరు మంచి శరీర దారుఢ్యంతో పొడవుగా ఉండగా, రెండవ అతను నల్లని ఛాయలో సన్నగా ఉన్నాడు. శరీర దారుఢ్యం ఉన్న వ్యక్తి సహాయం చేయగలడనే ఆలోచనతో అతనిని అభ్యర్ధించాను. కానీ అతను ఏదో గొణుగుతూ వెళ్ళిపోయాడు. ఇంతలో రెండవ వాచ్ మన్ వచ్చాడు. వెంటనే మేము మేడ మీదకి పరుగెత్తాం. దియా నాన్నగారు కూడా వచ్చారు. నేను ఆయనకు జరిగిందంతా చెప్పాను. ఆయన చింతించవద్దన్నారు. ఇద్దరు వాచ్ మెన్ లు ప్రయత్నిస్తున్నారు కానీ డోర్ ఓపెన్ కాలేదు. పిల్లలు 30నిమషాలు పైగా లోపల ఉండిపోయారు. సొసైటీ కార్యదర్శి కూడా ప్రయత్నించాడు, కానీ తలుపులు తెరుచుకోలేదు. ఏం చేయాలో తోచట్లేదు, ఒకటే కంగారుగా ఉంది. ఇంతలో ఇంతకుముందు నేను చూసిన ముదురు రంగులో ఉన్న సన్నని వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను ఎవరన్నది మాకెవరికీ తెలియదు. అతను డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. మొత్తానికి అతను తలుపులు పాక్షికంగా తెరవగలిగాడు. అతను 45 నిమిషాలపాటు అలాగే తలుపులు పట్టుకున్నాడు. నేను పిల్లలకు కొన్ని స్నాక్స్ అందించి, పిల్లలని ప్రశాంతంగా ఉండమని, చిన్న పిల్లల్ని ఆడిస్తూ వారి దృష్టిని మళ్ళించమని కొంచెం పెద్ద అమ్మాయికి చెప్పాను. లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్టర్ ని సంప్రదిస్తే, సాంకేతిక నిపుణులు సహాయం చేసేందుకు వస్తూ ఉన్నారని చెప్పారు. కొద్దిసేపటిలో వారు వచ్చి, తలుపులు తెరిచారు. మొత్తానికి 6.30pmకి పిల్లలు బయటకు వచ్చారు. పిల్లల్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసాను. వెంటనే బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మరుసటి ఉదయం ప్రియన్షీ వచ్చి, తన చేతులతోను, కాళ్ళతోను లిఫ్ట్ తలుపులు తెరిచి పట్టుకున్న వ్యక్తి షూ నుండి ఒక అద్భుతమైన కాంతి కనిపించిందని, "మమ్మల్ని కాపాడటానికి సాయి అరూపంలో వచ్చారని" లోపల ఉన్న మాఅందరికి అనిపించిందని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తరువాత మేమంతా అతను ఎవరని చర్చించుకున్నాం. సొసైటీలో ఎవరూ ఇంతకుముందు ఎప్పుడూ అతనిని చూడలేదని, అతను ఎక్కడ నుండి వచ్చాడో, అక్కడ నుండి ఎలా అతను అదృశ్యమయ్యాడో గుర్తించలేదని చెప్పారు.
ఓమ్ సాయిరామ్. బాబా! పిల్లలను ఆశీర్వదించు.
image rupam lo vunna text ni copy chesukodaniki danni word document lo marchalante yee link follow avvandi..apudu copy chesukovachu. https://www.youtube.com/watch?v=Hb5dV9251ks
ReplyDeleteమీరు ఎవరో నాకు తెలియదుగానీ సాయి, మీరు చేసిన ఈ సహాయాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. దీనికోసం చాలా చాలా ప్రయత్నించి వదిలేసాను. కానీ మన బాబా వదిలేయలేదు ఇలా మీ ద్వారా నాకు హెల్ప్ చేసారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు సాయి.
DeleteNenu sai sannidhiblog. Com admin ni. Nenu kuda last year nundy image copy chesukovadam kudaraka ibbandi paddanu. Just yeroje naku baba YouTube lo yee video chusela chesadu. Meku kuda yidhi oka problem Ga vundochu ani, baba prerana tho meku pampadam jarigindi. Sairam
Deletebaba ila yevoro okari dwara manaki sahayam pamputhntaru..Jai sairam
ReplyDeleteఅవును సాయి. అన్నీ రూపాలలో ఉన్నది ఆయనే కదా! అయన ప్రేమ అద్భుతం అసలు.
DeleteSai bandhus.. Tvaraga chandrunni chudandi. Baba face kanipistondi chandrudilo. Baba darshanam miss avakandi
ReplyDelete🕉 sai Ram
ReplyDelete