సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి ఇచ్చిన మధుర స్మృతులు - రెండవ భాగం


నేను ఒక సాయి భక్తురాలిని. 2018, ఆగష్టు 7 నాటి మా షిరిడీయాత్రకు సంబంధించిన మరికొన్ని అనుభవాలు:

మొదటి అనుభవం:

మేము ఆగస్టులో షిరిడీయాత్ర ప్లాన్ చేసుకొని ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. మేము ఎక్కవలసిన ట్రైన్ ఆగస్టు 7న మధ్యాహ్నం గం.2:20 నిమిషాలకు ఉందనగా ముందురోజు బ్యాగ్ సర్దుకోవడం, ఇంకా ఇతర పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి గం.11:45 నిమిషాలకు పడుకున్నాను. నిద్రపడుతూ ఉండగా, ఎవరో నన్ను, "టికెట్ చూడు...టికెట్ చూడు" అని అంటున్నారు. వెంటనే మెలకువ వచ్చింది. "టికెట్ చూడమని వినిపించిందేమిటి? అసలు ఎవరు అలా చెప్తున్నారు?" అని అనుకున్నాను. సరే, ఒకసారి టికెట్ చూద్దామని చూసాను! చూసాక నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. వణుకు పుట్టింది. అసలు విషయమేమిటంటే నేను మధ్యాహ్నం 2:20కి అనుకొని రిజర్వేషన్ చేసిన ట్రైన్ నిజానికి రాత్రి 2:20కే వస్తుంది. అప్పటికే ఆ ట్రైన్ చెన్నైలో బయలుదేరిపోయి ఇంకో రెండు గంటలలో ఇక్కడికి రానుంది. ఏమి చేయాలో నాకు అసలు అర్థం కాలేదు. బాబా నాకు ఇచ్చిన నామాన్ని స్మరించుకొని వెంటనే వేరే ఏమైనా ట్రైన్స్ ఉన్నాయేమోనని చూసాను. బాబా దయవలన ఈవెనింగ్ ట్రైన్ కి సీట్స్ ఉన్నాయి. వెంటనే ఆ రాత్రి 12.30 కే రిజర్వేషన్ చేసి ఇంట్లో ఏదోలా మేనేజ్ చేసేసాను. ఎప్పుడూ తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే బాబా సమయానికి "టికెట్ చూడు...టికెట్ చూడు" అని హెచ్చరించి కాపాడారు. లేకుంటే మేము మధ్యాహ్నం స్టేషన్ కి వెళితే అక్కడ ట్రైన్ ఉండేదికాదు. మరుసటిరోజు మేము విజయవాడలో షిర్డీ ట్రైన్ ఎక్కాలి కాబట్టి ఎలాగైనా విజయవాడ చేరుకోవాలని ఒక టెన్షన్ అయితే, నేను చేసిన పొరపాటుకు పెద్దవాళ్ళు పెట్టే చీవాట్లు, అవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇన్ని ఇబ్బందుల నుండి ప్రేమతో బాబా నన్ను బయటపడేసారు. ఇంకో విషయం, ఎప్పుడూ రద్దీగా ఉండే మేమెక్కిన ఆ ట్రైన్ ఆరోజు రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉంది. ఈసారి మావారు నాతో రాకపోవడంతో లగేజ్ మొత్తం నేనే మోయాలి, పైగా మా 4 సంవత్సరాల బాబుని కూడా నేనే చూసుకోవాలి, ఎలా బాబా అనుకున్నాను. కానీ ట్రిప్ అంతా బాబానే ముందుండి మేము దిగిన ప్రతీ ఒక్క స్టేషన్ లో ఎవరినో ఒకరిని మాకు సహాయంగా పంపుతూనే ఉన్నారు.

రెండవ అనుభవం:

మేము షిరిడీ వెళ్తున్నప్పుడు ఎక్కువభాగం పగటిపూట ప్రయాణం చేసాము. ఆరోజు మా బాబు ట్రైన్ లో ఒకటే అల్లరి చేస్తూ, అందరి దగ్గర అన్నీ తింటూ ఉన్నాడు. రాత్రి 2 గంటల నుండి ట్రైన్ లో వాడికి విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే మెడిసిన్ వేసాను, అయినా ప్రయోజనం లేదు. అలానే షిరిడీ చేరుకున్నాము. వాడు, నేను ద్వారకామాయి, చావడిలో దర్శనాలు చేసుకొని బాబా ఊదీ పెట్టి మళ్ళీ రూమ్ కి వెళ్ళాము. అయినా వాడికి తగ్గలేదు. "షిరిడీలో కూడా ఏమిటి ఇలా బాబా" అని చాలా బాధపడి ఏడ్చేసాను. ఆరోజు సాయంత్రం మేము మా హోటల్ కి ఎదురుగా ఉండే మహాలక్ష్మి టెంపుల్ కి వాడిని తీసుకొని వెళ్ళాము. అక్కడ ఎదురుగా బాబా చాలా బాగా ప్రశాంతంగా కనిపించారు. అక్కడ టెంపుల్ లో చిన్ని చిన్ని చపాతీలు, ఆకుకూరతో ప్రసాదంగా ఇచ్చారు. మా బాబు అవి ఇష్టంగా తిన్నాడు. వాడు అవి తినకూడదు, అయినా 'బాబా ప్రసాదం' అని నేనే పెట్టాను. ఇక్కడ సాయి లీల చూడండి. సచ్చరిత్ర 13వ అధ్యాయంలో, కాకా మహాజనికి వేరుశనగ పప్పులు ఇచ్చినట్టు మా బాబుకి చపాతీ, ఆకుకూర ఇచ్చి బాబా తనదైన పద్ధతిలో వాడికి నయం చేసేసారు. బాబా దయతో ఎక్కడా ఏ సమస్యా రాలేదు.

నా మూడవ అనుభవం :

గురువారంనాడు మేము శేజ్ ఆరతికి వెళ్ళాం. ఆరతి ప్రసాదం తీసుకున్నాక నేను, నా ఫ్రెండ్స్ గురుస్థాన్ దగ్గర కూర్చొని ఉండగా, ఒక సెక్యూరిటీ అతను వచ్చి మాతో చాలా బాగా మాట్లాడారు. ఆయన ఒక స్వామిని మాకు పరిచయం చేసారు. ఆయన మా ఫ్రెండ్స్ కి వేరుశనగపప్పులు, బాదంపప్పులు ఇచ్చి, నాకు మాత్రం వేరుశనగపప్పులు, చాక్లెట్స్ ఇచ్చారు. ఆ స్వామికి మా ఫ్రెండ్ ఈ నెలలో తన పెళ్లి ఉందని చెప్పగా ఆ స్వామి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ తరువాత ఆ స్వామి మాకు ఎక్కడా కనపడలేదు. స్వామి పేరు గాని, సెక్యూరిటీ ఆయన పేరు గాని మేము అడిగినా వాళ్ళు మాకు చెప్పలేదు. మేము బయటకి వచ్చేసాం. ఇంక టెంపుల్ క్లోజ్ చేసేసారు. తరువాత రెండు రోజులు మేము అక్కడ ఎంత వెతికినా వారు ఇరువురు మాకు ఎక్కడా కనపడలేదు. బాబానే ఆ రూపంలో వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారనిపించింది.

నా నాల్గవ అనుభవం :

నాకు సాయిని ఎప్పటినుండో లావెండర్ కలర్ డ్రెస్సులో చూడాలని ఒక కోరిక ఉండేది. కానీ ఆ డ్రెస్సులో బాబా ఎప్పుడూ దర్శనం ఇవ్వలేదు. అన్నయ్య ప్రతి గురువారం వాళ్ళ ఇంట్లో ఉన్న బాబాకు అభిషేకం చేసి డ్రెస్సు మారుస్తారు. ఒకసారి అన్నయ్యను లావెండర్ కలర్ డ్రెస్సు బాబాకి కట్టమని అడిగాను. నేను అడిగిన వారానికి అన్నయ్య ఆదే కలర్ డ్రెస్సు బాబాకి కట్టి, ఫోటో వాట్సాప్ లో పెట్టారు. అది చూసి నాకు హ్యాపీగా అనిపించి అన్నయ్యకు థాంక్స్ చెప్పాను. అన్నయ్య నాకు ఫోన్ చేసి, "నేను బాబాకి కట్టింది లావెండర్ కలర్ కాదు, పింక్ కలర్" అని చెప్పారు. నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే నాకు లావెండర్ కలర్ డ్రెస్సులోనే బాబా కనిపిస్తున్నారు. అదే మాట అన్నయ్యకి చెపితే, "మీ కోరిక నెరవేర్చి మీకు సంతోషం ఇవ్వడానికే ఈ లీల చేసి మీకు లావెండర్ రంగు దుస్తులలో దర్శనం ఇస్తున్నారేమో బాబా" అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఇప్పుడు నేను షిర్డీలో ఉండే రెండు రోజులలో ఒక్కసారైనా బాబాను లావెండర్ రంగు డ్రెస్సులో చూడాలని ఆశించాను. కానీ  మేము షిరిడీ నుండి రిటర్న్ అయ్యే టైం వచ్చేసినా నా కోరిక బాబా తీర్చలేదు. ఇంకా మా ట్రైన్ కి అరగంట సమయం ఉందనగా నేను షాపింగ్ చేస్తూ నా ఫ్రెండ్స్ కి బాబా గిఫ్ట్స్ తీసుకుంటున్నాను. నాకు కావలసినవన్నీ తీసుకున్నాక డబ్బులు ఇచ్చేసి,
బయటకి వస్తూ ఉండగా ఒక ఫొటోలో లావెండర్ రంగు దుస్తులలో సాయి నవ్వుతూ దర్శనం ఇచ్చారు. ఇంక వెంటనే ఆలస్యం చేయకుండా ఆ ఫోటో కొనేసాను. నేను మొదట్లో డిసప్పాయింట్ అయినా, లైఫ్ లాంగ్ మర్చిపోలేని అనుభూతినిచ్చారు బాబా. ఇప్పుడిక నేను ప్రతిరోజూ సాయిని నాకు ఇష్టమైన లావెండర్ రంగు దుస్తులలో తనివితీరా చూసుకుంటున్నాను.

ఐదవ అనుభవం:

నేను షిరిడీలో ఉన్న మూడు రోజులలో నాకొక్కసారి కూడా గురుస్థాన్ దగ్గర వేపాకు దొరకలేదు. నాతో ఉండే వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కి దొరికాయి. మా నాన్న, "నీకు మాత్రమే ఎందుకు దొరకట్లేదు?" అని కూడా అన్నారు. అలా అన్న ప్రతిసారీ నేను, "నాకు ఎవరో ఒకరు ఇస్తారు" అనేదాన్ని. నేను అలా అన్న వెంటనే నా ఫ్రెండ్స్ వాళ్ళకి దొరికినవి నాకు ఇస్తూనే ఉన్నారు. కానీ, "నాకు మాత్రం ఎందుకు దొరకట్లేదు?" అని మనసులో బాధ ఉంది. మొత్తానికి ఆ వెలితితోనే మా షిర్డీయాత్ర ముగించి ఇంటికి వచ్చేసాము. తరువాత వచ్చిన గురువారంనాడు ఉదయం 7.30కి నాకొక స్వప్నం వచ్చింది. కలలో నేను గురుస్థాన్ దగ్గర ఉండగా మొదట ఒక వేపాకు నా దగ్గర రాలితే తీసుకున్నాను. వెంటనే నా ముందు చాలా వేపాకులు రాలాయి. వాటన్నింటిని తీసుకుంటూ ఉన్నాను. ఇంతలో లేత చిగుర్లు కూడా రాలిపడ్డాయి. నా రెండు చేతులూ వేపాకులతో నిండిపోయాయి. "గురుస్థాన్ లో ఒక్క వేపాకైనా నాకు దొరకలేదు" అని మనసులో ఉన్న దిగులుకి నా రెండు చేతులు చాలినన్ని వేపాకులు స్వప్నంలో ఇచ్చి నన్ను అనుగ్రహించారు బాబా.

8 comments:

  1. ఓం సాయిరాం!!!

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai Naku naa koduku dorukutada

    ReplyDelete
    Replies
    1. Em Sai ... 34 chapter nuchi start chesi daily one chapter morning 5:30 lopala chadavandi ...365 days ... Compulsory dorukutadu ...edi na anubhavam ... Nak jaraganivi garigayi .. nen present Chala happy....

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo