సాయి వచనం:-
'శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకూ పెరిగినట్లు నన్ను రోజురోజుకూ అధికంగా ఆరాధించేవారు, మనోవృత్తిని, కామక్రోధాది వికారాలను నాకోసం అర్పించినవారు ధన్యులు. దృఢవిశ్వాసంతో తమ గురువును ఆరాధించేవారికి పరమేశ్వరుడు ఋణపడివుంటాడు. అట్టివారిని ఎవరూ చెడుబుద్ధితో చూడరు. అలా ఘడియ అయినా వ్యర్థం చేయక హరియొక్క, గురువుయొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు.'

'బాబా ముందు వి.ఐ.పి. లు ఎవరు? బాబాకు అందరూ సమానులే' - శ్రీబాబూజీ.

జి. జె. చితాబర్


జి. జె. చితాబర్ 1915వ సంవత్సరంలో శిరిడీలో జన్మించాడు. అతనిలా చెప్పాడు: “నేను నాలుగు సంవత్సరాల వరకు బాబాతో కలిసి ఉండటం నా అదృష్టం. ఆ సమయంలో తరచూ ఆయన ఒడిలో కూర్చునే నేను అద్భుతమైన అవకాశాన్ని పొందాను. మా సంబంధం 'అతిగా ప్రేమించే తాతయ్య - చెడిపోయిన మనవడు'లా ఉండేది. సాధారణంగా చిన్న చిన్న గ్రామాల్లో ఉండేవిధంగా బాబా ఎప్పుడూ పనీపాటా లేకుండా కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో పాల్గొనలేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు, అది కూడా ఏదైనా అవసరమైతేనే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాబా వృద్ధులైనప్పటికీ ఆయన స్వరం మాత్రం చాలా శక్తివంతంగా ఉండేది. మహాసమాధి చెందేవరకు ఆయన మాటతీరు చాలా స్పష్టంగా ఉండేది.

ఒకరోజు ఉదయం బాబా నాతో సమీప పాఠశాలలో బోధించే మా నాన్నగారి వద్దనుండి దక్షిణ తీసుకుని రమ్మని చెప్పారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి, బాబా దక్షిణ అడుగుతున్నారని నాన్నతో చెప్పాను. వెంటనే నాన్న నాకొక నాణాన్ని ఇచ్చారు. నేను తిరిగి వచ్చి ఆ నాణాన్ని బాబాకు ఇచ్చాను. అప్పుడు బాబా, "నాకు దక్షిణ వద్దు, నువ్వేమి చేస్తావో చూడాలనుకున్నాను. కాబట్టి నువ్విప్పుడు దీన్ని మీ నాన్నకి తిరిగి ఇచ్చెయ్యి" అని అన్నారు. నేను పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరకు వెళ్లి, బాబా చెప్పిన మాటలను నాన్నతో చెప్పాను. వెంటనే నాన్న, "ఒకసారి దక్షిణ ఇచ్చాక దాన్ని తిరిగి తీసుకోకూడదు. ఈ విషయం బాబాతో చెప్పి, దీనిని ఆయనకివ్వు" అని అన్నారు. నేను తిరిగి వెళ్లి నాన్న చెప్పినట్లు చేశాను. ఈసారి బాబా ఆ నాణాన్ని తమవద్ద ఉంచుకున్నారు. 'ఎవరైనా ఇవ్వగలిగినంత దాతృత్వంతో, ఏమీ ఆశించకుండా ఇవ్వాలి' అనే ఒక విలువైన పాఠాన్ని నేను దీనినుండి నేర్చుకున్నాను".

రెఫ్: సాయి చింతన్; 29 సెప్టెంబర్ 1990
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ. 

7 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺😃🌸😀🌹🤗🌼

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🌹😃🌼😀🌸💕👪

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo