సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 327వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన అందమైన అనుభవం
  2. "ఖిచిడీ చేయి... లజ్జోమా నాకోసం వేచి ఉంది"

బాబా ప్రసాదించిన అందమైన అనుభవం

ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఇటీవల శిరిడీలో బాబా నాకు ప్రసాదించిన అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2020, జనవరి 25, 26 తేదీల్లో శిరిడీ సందర్శించాను. వారాంతపు సెలవులు కావడంతో భక్తులు ఎక్కువగా ఉన్నారు. నేను సమాధిమందిరంలోకి ప్రవేశిస్తూనే జనం చాలా ఎక్కువగా ఉన్నారని అనుకున్నాను. అంత జనంలో ఒకరినొకరు తోసుకుంటూ క్యూలో కదలడం కష్టంగా ఉంది. పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు ఎవరినీ నిలబడటానికి అనుమతించటం లేదు. అందువల్ల బాబా కోసం నేను తీసుకెళ్తున్న ప్రసాదాన్ని కనీసం పూజారికి అందించగలనా అని అనుకున్నాను. అయినప్పటికీ నేను, "బాబా! మీరు నన్ను ప్రేమిస్తున్నట్లైతే, నా మాట వింటున్నట్లైతే ఈరోజు ఏదో ఒక అద్భుతం చేయండి. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, పూజారి తనంతట తానుగా మీ సమాధి మీద నుండి ఒక పువ్వు తీసుకుని నాకు ఇవ్వాలి. నేను మాత్రం అతనిని అడగను" అని ప్రార్థించాను. నేను అదే ఆలోచించుకుంటూ క్యూలో కదులుతున్నాను. బాబా వద్దకు చేరుకున్నాక ఏదోవిధంగా ప్రసాదం ప్యాకెట్టుని పూజారి చేతికి అందించాను. అతను దానిని తీసుకుని బాబా పాదాలకు, సమాధికి తాకించారు. అతను దానిని నాకు తిరిగి ఇస్తారని నేను ఎదురుచూస్తున్నాను. మీరు నమ్మరుగానీ, అతను ఏదో వెతుకుతున్నట్లు నేను గమనించాను. అతను ఒక పువ్వు తన చేతిలోకి తీసుకుని, మళ్ళీ దానినక్కడ పడేశాడు. (బహుశా ఆ పువ్వు అంత మంచిది కాదేమో!) ఆపై అతను బాబా సమాధి మీద ఉన్న ఒక చిన్న పూలమాలను తీసి, ప్రసాదం ప్యాకెట్టుతోపాటు నాకు తిరిగి ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అంత రద్దీలో పూజారి సమాధి మీద నుండి పువ్వులు తీసుకుని నాకు ఇచ్చాడు. సెక్యూరిటీ వాళ్ళు ఎవరినీ కొన్ని సెకన్లపాటు కూడా నిలబడటానికి అనుమతించడం లేదు. అలాంటిది నన్ను మాత్రం ఎవరూ బలవంతంగా లాగలేదు, కనీసం వెళ్ళమని కూడా అనలేదు. బయటకు వచ్చాక బాబా చూపిన ప్రేమకు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు పదాలు దొరకడంలేదు. బాబా ఎంతో దయామయులు. మనం చేసే ప్రతి ప్రార్థనను ఆయన వింటారు. బాబాచే ఎన్నుకోబడ్డ మనమంతా ధన్యులం.

సేకరణ: శ్రీమతి మాధవి(భువనేశ్వర్).

"ఖిచిడీ చేయి... లజ్జోమా నాకోసం వేచి ఉంది"

సాయిభక్తురాలు మల్లిక ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిభక్తులతో నేనొక అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవాలి. నేను గత 2 వారాలుగా సాయి దివ్యపూజ చేస్తున్నాను. సరిగ్గా 3వ వారం పూజకు ముందు నేను ఫ్లూ జ్వరం నుండి కోలుకుంటున్నాను. అందువలన నేను పూజ చేయాలా, వద్దా అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే, నేను పూజ చేస్తున్న 5 వారాలూ బాబా ప్రసాదాన్ని నా స్నేహితులకి అందించాలని అనుకున్నాను. కానీ ఆ స్థితిలో ప్రసాదాన్ని వాళ్లకు అందించలేనేమోనని భయపడ్డాను. ముందురోజు రాత్రంతా అదే ఆలోచిస్తున్నాను. హఠాత్తుగా ఒక కల వచ్చింది. కలలో నేను "శీరా చేయనా లేక ఖిచిడీ చేయనా" అని బాబాను అడుగుతున్నాను. అప్పుడు బాబా, "ఖిచిడీ చేయి. లజ్జోమా(నా స్నేహితురాలి పేరు) నాకోసం వేచి ఉంది" అని అన్నారు. మరుక్షణంలో నాకు మెలకువ వచ్చింది. బాబా నా పూజను స్వీకరిస్తున్నారని నేను చాలా సంతోషించాను. కొన్నిరోజుల క్రితం నా స్నేహితురాలు నాతో, "మల్లికా, బాబా ఎప్పుడు వస్తారు?" అని అడిగింది. ఈరోజు ప్రసాదం రూపంలో తన వద్దకు వెళుతున్నానని బాబా సమాధానం ఇచ్చారు. అది నాకు బాబా ఇచ్చిన స్పష్టమైన సందేశం. బాబా గురించి, ఆయన లీలల గురించి చెప్పడానికి నావద్ద మాటలు లేవు. మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయనకు తనదైన ప్రత్యేక పద్ధతులున్నాయి.

ఓం సాయిరామ్!

సేకరణ: శ్రీమతి మాధవి(భువనేశ్వర్).


6 comments:

  1. Telugu lo chala naaga chesaru..Sai..

    ReplyDelete
    Replies
    1. Question and answer website ela chudali madam

      Delete
  2. Om Sai Ram.
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయిణే నమః
    🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo