ఈ భాగంలో అనుభవాలు:
- సాయి ద్వారా లభించిన సహాయం
- బాబా ఆశీస్సులతో నా బిడ్డ దగ్గు నయమైంది
సాయి ద్వారా లభించిన సహాయం
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చిన కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
నేను నా ఆఫీసుకు సంబంధించిన వర్కు కోసం తెలిసినవాళ్ళ ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నాను. నాకు MAC ఆపరేటింగ్ సిస్టం అలవాటు ఉంది, కానీ ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉంది. ఇందులో డేటా సేవ్ చేయబడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఒకసారి నేను ల్యాప్‌టాప్ మీద 3-4 గంటలపాటు పనిచేసి, చాలా ముఖ్యమైన విషయాలను ఒక వర్డ్ డాక్యుమెంటులో టైపు చేసి టీ తయారుచేయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి విండోస్ అప్‌డేట్ అయ్యింది. నేను టైపు చేసిన వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, అప్పటివరకు నేను చేసిన మార్పులు ఏవీ సేవ్ చేయబడిలేవు. MAC లో ఎప్పుడూ ఇలా జరగలేదు. మొదటిసారి ఇలాంటి సమస్య ఎదురయ్యేసరికి నేను నిర్ఘాంతపోయాను. బ్యాకప్ లేకపోవడంతో నేను చాలా ఆందోళనపడ్డాను. పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందడానికి నేను కొన్ని బ్లాగులను సంప్రదించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో నేను సహాయం కోసం బాబాను అర్థించాను. తరువాత మళ్ళీ ఒకసారి ప్రయత్నించాను. నన్ను నమ్మండి, ఆశ్చర్యంగా రెండు 'టిఎంపీ' ఫైళ్లు నా దృష్టిలో పడ్డాయి. కొన్ని ఇతర మార్గాల సహాయంతో దాన్ని వర్డ్ ఫార్మాట్ లోకి మార్చాను. మొత్తానికి బాబా సహాయంతో సమస్య పరిష్కారమైంది. ఆయన చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతలు అనే మాట చాలా చిన్నది. ఎందుకంటే, అది మళ్ళీ టైపు చేయడానికి నాకు తగినంత సమయం లేనందున నేను చాలా ఇబ్బందుల్లో పడేవాడిని. కేవలం బాబా కృపవలనే నేను సమస్య నుండి బయటపడ్డాను.
ఇంకొక అనుభవం:
ఒకసారి నేను విదేశాల నుండి వచ్చే ఒక పార్శిల్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ నేనుండే ఫ్లాట్ చుట్టూ అంతా గజిబిజిగా ఉన్నందున అది వేరేచోట డెలివరీ అయింది. అది తెలిసి నేను చాలా నిరాశపడిపోయాను. నాకు చేతనైన ప్రయత్నాలన్నీ చేసి చేసి విసిగిపోయాను. ఇక ఎప్పటిలాగే నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యం! మూడురోజుల తరువాత ఎవరో ఆ పార్శిల్‌ను నా మెయిల్‌బాక్స్‌లో ఉంచారు. నేను చాలా సంతోషంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మరొక అనుభవం:
ఒకసారి నేను నా కారుని వీధిలో పార్క్ చేసి ఉంచినప్పుడు ఎవరో దానికి హాని తలపెట్టారు. నా కారుకి పూర్తి భీమా ఉంది. అయితే అందులో విండ్‌స్క్రీన్ రీప్లేస్మెంట్ లేదని నాకు తెలియదు. తెలిశాక నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, విండ్‌స్క్రీన్ మార్చాలంటే నాకు రెండువేల డాలర్లు ఖర్చవుతుంది. అప్పుడు నేను, "బాబా! భీమాలో ప్రతిదానినీ కవర్ చేసేలా చేయండి. అదెలా సాధ్యమన్నది నాకు తెలియదు. కానీ దయచేసి నాకోసం దీన్ని చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో నేను కేవలం 400 డాలర్లు చెల్లించడంతో సమస్య పరిష్కారమైంది.
"క్షమించండి బాబా! ఈ అనుభవాలను నేను ఆలస్యంగా పంచుకుంటున్నాను. దయచేసి ఎల్లప్పుడూ నాతో ఉంటూ నాకు మార్గనిర్దేశం చేయండి. మీ సహాయం, మార్గదర్శకత్వం లేకుండా నేను ఈ ప్రపంచంలో ఎలా జీవించగలను? నా అనుభవాలను చదివిన ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి".
source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2527.html

బాబా ఆశీస్సులతో నా బిడ్డ దగ్గు నయమైంది
సాయిభక్తురాలు దివ్య తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
2009 నుండి నేను, నా భర్త సాయిబాబా భక్తులం. బాబా లేకుండా మా ఉనికిని ఊహించలేము. పెద్దసమస్య నుండి చిన్నసమస్య వరకు మనల్ని చూసుకోవడానికి ఆయన సదా ఉన్నారు. మాకు ఎనిమిదిన్నర నెలల బిడ్డ ఉన్నాడు. తను మాకు సాయి ఆశీర్వాదమే. తనకి 7 నెలల వయస్సున్నప్పుడు అలర్జీ కారణంగా దగ్గు వచ్చింది. అంతకుముందు కూడా ఆ సమస్య వచ్చింది. అప్పుడు మందులతో నయమైంది. కానీ, ఈసారి మందులతో నయం కాలేదు. దాదాపు ఒక నెల గడిచినా ఆ దగ్గు తగ్గలేదు. అప్పుడు నేను హోమియోపతి ప్రయత్నించి, "బాబా! నా బిడ్డకొచ్చిన ఈ సమస్యను దయచేసి తొలగించండి" అని బాబాను ప్రార్థించాను. ఒక వారం గడిచేసరికి దగ్గు చాలావరకు తగ్గినట్లు నేను గమనించాను. మరో వారం పూర్తయ్యేసరికి పూర్తిగా నయమైంది. "థాంక్యూ బాబా! దయచేసి నా బిడ్డని, చిన్నపిల్లలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి. మా అందరికీ కూడా మీ ఆశీస్సులు కావాలి".

Om sai ram 🙏🙏
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏