1. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా
2. మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ బాబానే చూసుకుంటారు
ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2023వ సంవత్సరం మధ్యలో నేను నా ఉద్యోగం కోల్పోయి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొదట్లో నేను తొందరలోనే నాకు ఉద్యోగం వస్తుందని బాగానే ఉన్నాను. కానీ ఆలస్యం అయ్యేకొద్దీ, 'ఖర్చులకు డబ్బులు ఎలాగ'ని నా ఆర్థిక పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందాను. సరిగ్గా ఆలోచించలేక, నిద్రపోలేక దాదాపు మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉండిపోయాను. కొత్త ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ పూర్తిగా కోల్పోయి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మానేశాను. కానీ ఈ సమయమంతా నేను సాయి మీద ఏ మాత్రమూ నమ్మకాన్ని కోల్పోలేదు. "నాకు ఒక మంచి ఉద్యోగం ప్రసాదించి నన్ను ఈ పరిస్థితి నుండి విముక్తి చేయమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. దాదాపు ఆశలన్నీ కోల్పోయిన సమయంలో ఒకరోజు నేను అదివరకు దరఖాస్తు చేసుకున్న ఒక ఉద్యోగానికి సంబంధించి నాకు ఒక కాల్ వచ్చింది. అయితే ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు నాకున్న అనుభవానికి సరిపోవు. అందువల్ల మొదట్లో నేను ఈ ఉద్యోగానికి ఎంపిక కాలేనని అనుకున్నాను. అయినప్పటికీ సాయిని తలుచుకొని ముందుకు వెళ్లాలని, ఆయనే మార్గం చూపుతారని, ఆ ప్రక్రియలో ముందుకు రాణించేలా చేస్తారని అనుకుని భారం ఆయన మీద వేసి ముందుకుసాగాను. బాబా దయవల్ల మొత్తం 3 రౌండ్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను. అన్నీ రౌండ్లలో నా ప్రతిభను చక్కగా ప్రదర్శించాను. అంతా బాగా జరిగిందని, ఆఫర్ లెటర్ వస్తుందని చాలా సానుకూలంగా ఉన్నాను. అయితే 2 వారాలు గడిచినా కంపెనీ నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అయినా నేను సాయి మీద పూర్తి నమ్మకముంచి సహనంతో కంపెనీ నుండి ప్రతిస్పందన కోసం వేచి చూసాను. చివరికి ఒక మంచి రోజున కంపెనీ నుండి, 'ఒకసారి మీతో సమావేశమవ్వాలని అనుకుంటున్నాము' అని ఇమెయిల్ వచ్చింది. నేను సాయిని తలుచుకొని, 'అంతా ఆయన చూసుకుంటారని' సమావేశానికి నా అంగీకారం తెలిపాను. వాళ్ళు గురువారం రోజు ఫోన్ మీటింగ్ షెడ్యూల్ చేసారు. ఆ మీటింగ్‌లో నాకు ఉద్యోగం ఇస్తున్నామన్న శుభవార్త చెప్పారు. అది విని నేను చాలా ఆనందించాను. అలా సాయి కృపతో నాకు ఉద్యోగం రావడమేకాక నేను ఉద్యోగంలో నిలదొక్కుకోగలిగాను. కేవలం బాబా వల్ల, ఆయన చేసిన అద్భుతం వల్లనే ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు నాకున్న అనుభవానికి సరిపోకపోయినప్పటికీ ఇదంతా సాధ్యమైంది. దాదాపు నా దగ్గరున్న పొదుపు డబ్బులు అయిపోయి ఆర్థిక సహాయం అందాల్సిన స్థితిలో అంటే సరైన సమయంలో బాబా నాకు ఒక మార్గాన్ని చూపించారు. తద్వారా తమ బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, వారికి సరైన మార్గాన్ని చూపుతామని సాయి ఋజువు చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ బాబానే చూసుకుంటారు
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నా పేరు చైతన్య. 2023, డిసెంబర్ 26న నేను ఒక నెలరోజుల సబ్స్క్రిప్షన్ కోసం డబ్బులు కడితే అనుకోకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఒక్క గంటలోనే నేను కట్టిన డబ్బులు అయిపోయాయి. దానివల్ల కంపెనీకి 10,000 రూపాయల నష్టం వచ్చే అవకాశముంది. విషయాన్ని మానేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే నన్ను ఏమీ అనకపోయినా నా అజాగ్రత్త వల్ల నష్టం వచ్చిందని అనుకుంటారు. అలాగని విషయాన్ని కప్పిపుచ్చాలంటే ఒక నెలంతా విషయాన్ని దాచిపెట్టాలి లేదా ఆ 10,000 రూపాయలు నేను చెల్లించాలి. నా భర్తతో చెప్తే, "చెప్పొద్దు. మనం ఎంతో కొంత డబ్బులు కడదాం" అని అన్నారు. నేను కూడా అలాగే చేద్దామనుకున్నాను. కానీ నాకెందుకో తప్పు చేస్తున్నాననే భావన వల్ల ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పనిసరై, "బాబా! ఈ విషయంలో సహాయం కాదు, మీరు ఏదైనా మిరాకిల్ చేస్తే కానీ నేను ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు. మీరు కనుక నాకు ఈ సహాయం చేస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. కానీ మనసులో నేను చేసిన తప్పుకి బాబాని పరీక్షిస్తున్నాననిపించింది. అందువల్ల బాబాని మన్నించమని వేడుకున్నాను. తర్వాత చిన్న ఆశతో సదరు కంపెనీవాళ్ళని సంప్రదించాను. అది రాత్రి సమయం. డిసెంబర్ 27, రాత్రి 1:30 వరకు ఆ కంపెనీ నుండి నాకు రిప్లై ఏమీ రాలేదు. అప్పుడింకా నేనే చొరవ తీసుకొని కంపెనీవాళ్లతో కొంతసేపు చాట్ చేశాను. వాళ్ళు సమస్య అర్ధం చేసుకొని అదనంగా డబ్బులు ఏమీ తీసుకోకుండా నెలరోజుల సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తరువాత జరిగిన తప్పు గురించి మానేజ్మెంట్‌కి చెప్పాను. వాళ్ళు ఏమీ అనలేదు. అంతా బాబా దయ. మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ ఆయనే చూసుకుంటారు. "బాబా! మీకు చాలా కృతజ్ఞతలు. మీరు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాను బాబా. సదా మమ్మల్ని కాపాడుతూ మేము సన్మార్గంలో నడిచేటట్టు ఆశీర్వదించండి బాబా".
Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm sai Sri sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, I understand from Aishwarya that she could able to take an appropriate decision. This decision is going to make many people happy. This was possible only because of your blessings. Please do take care of her future actions 🙏🙏🙏🙏
ReplyDeleteSai, Meeku Satha Koti Pranamamulu. Mee needs Bharani vest menu Mundus povadamu valana anni manchiga jarugu Chunnavi. Mee darshanamu chalaa ante chalaa baga jarigindi. Aaa tharuvatha anni panulu chalaa baaga jariginavi. Always bless us. 🙏🙏🙏🙏💐💐💐💐
ReplyDeleteOm sai ram, anta manchiga unde la chudu tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri pl vadini bless cheyandi
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteSai Baba maa Sai madava bharam anta meede baba
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOmsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 omsaisri
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba, maa situation ki edoka solution chupinchandi please....Naku roju roju ki tension perigipothundi....naa valla migatha anadaru ebbandi paduthunnaru please baba 🙏
ReplyDeleteబాబా మాabbyi జాబ్ manakunda కాపాడు వెళ్లే లాగా చూడు నువ్వే వాడికి తోడు ఉండి ముందుకు నడి పించాలి జై సాయిరాం
ReplyDeleteOm.Sai Ram
ReplyDeleteOm sairam
ReplyDelete