1. నాతోనే ఉన్నామన్న నమ్మకం ఇచ్చిన బాబా
2. సమస్య తొందరగా పరిష్కరమయ్యేలా దయచూపిన బాబా
నాతోనే ఉన్నామన్న నమ్మకం ఇచ్చిన బాబా
అందరికీ నమస్కారం. నా పేరు రాంప్రసాద్. నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటాను. నేను ఒక ఐటీ ఉద్యోగిని. ఈమద్యనే చాలా కష్టం మీద ఆ ఉద్యోగంలో చేరాను. నేను గత 10 సంవత్సరాలుగా సాయిబాబాని నమ్ముకున్నాను. నా జీవితంలో ఏది జరిగిన ఆయనకి తెలియకుండా జరగదు. నా జీవితంలో చాలా సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి. ఏ రోజూ మనఃశాంతిగా ఉన్నది లేదు. అందువల్ల నాకు చాలా విసుగు వచ్చి తప్పు దారి పట్టి ఏవేవో వ్యసనాలకు అలవాటుపడ్డాను. ఎంతలా అంటే బాబాని తలుచుకొని ఇలా తప్పు చేయకూడదని అనుకున్నా కూడా ఆ దారిలో వెళ్లకుండా ఉండలేకపోయేంతలా. నెమ్మదిగా నా ఆరోగ్యం క్షిణించి చాలా బలహీనంగా అయిపోయి జీవితం పట్ల నాకు చాలా బెంగగా ఉంటుండేది. నాకున్న ప్రశ్నల వల్ల, మూర్ఖత్వం వల్ల నేను నా మనసులో చాలాసార్లు 'నిజంగా సాయిబాబా ఉన్నారా? ఒకవేళ ఉంటే నాతో ఉన్నారా?' అని ఆలోచిస్తూ, 'నేను సాయిబాబాని నమ్మాను కదా! మరి నా జీవితం ఎందుకిలా ఉంది? అందరిలా ఎందుకు లేదు?' అని ఎన్నోసార్లు ప్రశ్నించేవాడిని. అదీకాక నేను చెడ్డ దారిలో వెళ్లి బాబాని బాధపెట్టాను. ఇక ఆయన నన్ను పట్టించుకోరని చాలా బాధపడుతుండేవాడిని. ఇదంతా 2023, డిసెంబర్ 6, బుధవారంనాడు నేను ఆలోచిస్తూ ఆరోజు రాత్రి పడుకునేముందు సాయిబాబాని మనసులో తలచుకొని, "బాబా! మీరు నిజంగా ఉంటే నాకు స్వప్నంలో దర్శనమిచ్చి నాతో ఏదో ఒకటి మాట్లాడాలి, లేదంటే కనీసం మీ రూపం దర్శనమిచ్చినా చాలు. మీరు నిజంగా నాతో ఉన్నారని నమ్ముతాను. ఒకవేళ మీరు దర్శనమిస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకొని నిద్రపోయాను. మధ్యరాత్రిలో రెండు లేదా మూడున్నర గంటలప్పుడు మెలుకువ వస్తే అప్పుడు కూడా బాబా గురించి ఆలోచిస్తూ, 'బాబా కనపడలేదు కదా! ఆయన నిజంగా లేరేమో! ఒకవేళ ఉన్నా నాతో లేరేమో!' అని అనుకొని మళ్ళీ పడుకున్నాను. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మన సాయిబాబా నన్ను కరుణించారు. నాకు సరిగా సమయం గుర్తులేదు కానీ, 2023, డిసెంబర్ 7, గురువారం ఉదయం 5:30 ప్రాంతంలో బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆ కలలో ఒక గది మధ్యలో బాబా తమ కుడి కాలును ఎడమ కాలు మీద వేసుకొని కూర్చొని కనిపించారు. నేను చాలా సంతోషపడుతూ 'నిజంగా బాబా ఉన్నార'న్న నమ్మకంతో నా రెండు చేతులు జోడించి ఆయనకి మ్రొక్కాను. తర్వాత కూడా బాబా నాపై కరుణావర్షం కురిపించారు. ఎలాగంటే, బాబా తమ కుడి కాలు కిందకి దించి, ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టుకొని నవ్వుతో కుడి చేతితో అభయమిస్తున్నట్లు విజయ చిహ్నం చూపించారు. ఆయన నాకు సమస్త విజయాలు చేకూరుతాయని చెప్తున్నట్లు అనిపించి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా 'నేను ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, అంతా చూసుకుంటున్నాను. నువ్వేం బాధపడకు, బెంగ పెట్టుకోకు' అని చెప్తున్నట్లు కూడా అనిపించింది. అంతటితో కల ముగిసింది. ఈ కల ద్వారా నేను తప్పు చేస్తూ వేరే దారిలో పోయినా బాబా నాతోనే ఉన్నారని నమ్మకం కలిగించారు. దానికి నేను ఎప్పటికీ ఆయనకి ఋణపడి ఉంటాను. బాబా ఎల్లప్పుడూ మనతోనే, మన వెంటే ఉన్నారనడానికి నా ఈ అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని ఆశిస్తున్నాను.
ఒకసారి నాకు ఎంతో ఇష్టమైన ఫోన్ మదర్ బోర్డ్ క్రాష్ అయి పని చేయడం మానేసింది. షోరూమ్‌లో చూపిస్తే చాలా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుందని చెప్పారు. అదివరకు కూడా ఒకసారి ఆ ఫోన్ రిపేర్ వస్తే చాలా ఖర్చు పెట్టాను. మళ్ళీ పెద్ద మొత్తం ఖర్చు పెట్టాలంటే నావల్ల అయ్యే పని కాదు. ఆ సమయంలో నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇక చేసేదేమీ లేక ఆ ఫోన్ పక్కన పెట్టేసి వేరే ఫోన్ వాడుకున్నాను. రెండు నెలల తర్వాత తెలిసిన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఫోన్ చూసి తక్కువ డబ్బులకే రిపేర్ చేసి ఇస్తానంటే, నేను నా మనసులో 'తక్కువ డబ్బులతో ఫోన్ రిపేర్ అయి బాగా పని చేస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన'ని అనుకుని రిపేర్‌కి ఇచ్చాను. రెండు రోజుల తర్వాత ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నా ఫోన్ పని చేస్తుండటం చూసి నాకు చాలా సంతోషమేసింది. అంతేకాదు, ఫోన్ బాగు చేసినందుకు కేవలం 2,300 రూపాయలు మాత్రమే తీసుకున్నాడతను. ఆ ఫోన్‌లోనే ఇప్పుడు నా అనుభవాలను టైప్ చేసి మీ అందరితో ఇలా పంచుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. నాకు మీరు తప్పితే ఏమీ తెలియదు. ఏం చేయాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలీదు. నా జీవితం మీ పాదాల దగ్గర పెట్టి, మీ మీదే భారమేసి బ్రతుకుతున్నాను సాయి. నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు. ఎన్నో ఆశలు, కోరికలు చంపుకొని బ్రతుకుతున్నాను. దయచేసి నేను ఆశపడ్డ పెద్ద సంతోషాన్ని నాకు ఇవ్వండి. ఒక తండ్రిలా నన్ను, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ఒక్కటి చేసి మాకు అండగా నిలబడండి సాయి"
సమస్య తొందరగా పరిష్కరమయ్యేలా దయచూపిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు రజని. ఇటీవల నా భర్త H1B వీసాకి అప్లై చేస్తే, విచారణ చేయాలని వచ్చింది. దాంతో మావారు వీసా రావడానికి చాలా సమయం పడుతుందని భయపడ్డారు. అప్పుడు నేను, "బాబా! ఈ సమస్య ఇబ్బందులేమీ లేకుండా తొందరగా పరిష్కారమైతే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా చాలా తక్కువ సమయంలో ఇబ్బందులేమీ లేకుండా సమస్యను పరిష్కారం చేసారు. "చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే వీసా కూడా త్వరగా వచ్చేలా చూడండి బాబా. అలాగే మీకు మాపై ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి తండ్రీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri bless him
ReplyDeleteBaba take care of my child baba please 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteబ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోని సకల కొట్టి రోగాలు సకలకోటి దోషాలు సకలకోటి పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసేలా చెయ్యి తండ్రి ఏ కోర్టు కేసులు ఏ గొడవలు ఏ నిందలు ఏ అవమానాలు ఏ అబద్ధాలు ఏ జాడీలు లేకుండా నా భర్త మనస్పూర్తిగా నన్ను అర్థం చేసుకొని భార్యగా స్వీకరించేలా చూడు తండ్రి సాయినాథ ప్రభు నిన్నే నమ్ముకొని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను సాయి నాకు నీ సహాయం చాలా అవసరం సాయి
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteBaba ,naku manasanthi prasadinchandi please..... nenu ee tensions thesukolekapothunna....meru vunnaru chusukuntaru ani naku thelusu kani naa manasu nannu peduthunna tension handle cheyalekapothunna.... dayachesi ee problems nundi bayataki vache margam chupinchandi please 🙏🥺😭
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeletebaba sai madava bharam antha meede baba.
ReplyDeleteOmsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha