- ఎల్లప్పుడూ తోడు ఉండే నేస్తం బాబా
అందరికీ నమస్కారం. నా పేరు ఛత్రపతి. నేను నా చదువు పూర్తయ్యాక కాలేజీకి వెళ్లి నా సర్టిఫికెట్లు తెచ్చుకుందామని అనుకున్నప్పుడు అదివరకు వెళ్లి తెచ్చుకున్నవాళ్ళని అడిగితే, కాలేజీవాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏవో కారణాలు చెప్పి, అధిక రుసుము వసూలు చేస్తున్నారని చెప్పారు. అది విని సర్టిఫికెట్లు తీసుకోవడానికి నేను కూడా ఇబ్బందిపడాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ మనకి బాబా ఉండగా దిగులెందుకని, ఆయన్నే సహాయం అడుగుదామని, "బాబా! దయుంచి అనవసరపు ఖర్చులు అవ్వకుండా, ఏ ఇబ్బందీ లేకుండా నా సర్టిఫికెట్లు నా చేతికి వచ్చేలా చూడు స్వామీ" అని బాబాను వేడుకున్నాను. తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఊదీ పెట్టుకొని వెళ్ళాను. ఆశ్చర్యం! కాలేజీవాళ్ళు నన్ను ఏ రుసుమూ అడగలేదు. ఏ ఇబ్బందీ పెట్టకుండా చాలా మర్యాదగా నా సర్టిఫికేట్లు నాకు ఇచ్చారు. బాబా అనుగ్రహానికి ఎన్ని నమస్కారాలు చెప్పినా చాలవు.
నేను ఉద్యోగం లేకుండా మూడు నెలలు ఖాళీగా ఉన్న రోజుల్లో ప్రతిరోజూ బాబాని, "ఎలా అయిన నాకు ఉద్యోగం ప్రసాదించు తండ్రీ. అదే జరిగితే నేను శిరిడీ వస్తాను" అని వేడుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం నాకు ఇంటర్వ్యూ ఉండగా ఆరోజు ఉదయం నుండి నేను టెన్షన్ పడుతూ ఎందుకో ఇంటర్నెట్‌లో బాబా లీలలు అని టైప్ చేస్తే, ఒక లీల వచ్చింది. అందులో ఒక అతను నాలానే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇంటర్వ్యూ చేసే ఒకామె ఆ ఉద్యోగం అతనికోసమే ఉన్నట్టు ఉత్సాహంగా ప్రశ్నలు అడిగారని, ఒక కలలా తాను ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని పంచుకున్నారు. అది చదివాక నేను కూడా సెలెక్ట్ అవుతానని నాకు ధైర్యం వచ్చింది. తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్తే అచ్చంగా నేను చదివిన అనుభవంలో లానే నా ఇంటర్వ్యూ జరగడం, నేను ఆ ఉద్యోగానికి సెలెక్ట్ కావడం నన్ను చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ఆ బాబా అనుగ్రహానికి మాటలు సరిపోవు. ఇకపోతే, ఉద్యోగం చెన్నైలో చేయాల్సి ఉండటం వల్ల అక్కడికి వెళ్లి ఎలా ఉండాలి? PG రూమ్ దొరకడం వంటి వాటి గురించి చాలా భయమేసింది. "ఆ విషయంలో కూడా మీరే దారి చూపండి బాబా" అని బాబానే వేడుకున్నాను. బాబా ఎంతో సహాయం చేశారు. చెన్నైలో కొన్ని రోజులు ఉండటానికి వసతి, ఆపై పీజీ దొరికేలా చేసి అంత సర్దుబాటు చేశారు. "చాలా కృతజ్ఞతలు బాబా. నా భక్తిని పెంచు తండ్రి".
బాబాను వేడుకుంటే సర్వ దేవతల అనుగ్రహం లభిస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ. మేము ఎన్నో సంవత్సరాల నుండి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నా సాధ్యపడలేదు. నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చాక తిరుపతి చెన్నైకి దగ్గర కాబట్టి నన్ను చూసినట్టు ఉంటుంది, అలాగే తిరుపతి దర్శనం అవుతుందని మా అమ్మ, నాన్న, చెల్లి తిరుపతి యాత్ర చేద్దామనుకున్నారు. అందుకోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. తర్వాత కొన్ని అవరోధాలు వచ్చేసరికి ఈసారి కూడా వెళ్ళలేమేమోనని నేను చాలా భయపడ్డాను. అప్పుడు నా గురువు, తండ్రి, స్నేహితుడు అయిన బాబాను, "బాబా! ఈ యాత్ర చక్కగా జరిపించండి" అని వేడుకొని ప్రతిరోజూ ఎంతో ఆత్రంగా తిరుపతి వెళ్లే రోజు కోసం ఎదురుచూసాను. బాబా దయవల్ల మెల్లగా అన్నీ అవరోధాలు పక్కకి జరిగిపోయి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మహాద్భుతంగా జరిగింది. బాబా దయతో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని యాత్రగా మిగిలింది. ఇది మాటల్లో వర్ణించలేని, అమోఘమైన బాబా లీల. "ధన్యవాదాలు బాబా".
నాకు ఉద్యోగం వచ్చి 4 నెలలు గడిచాక నేను కొన్నిరోజులు మా ఇంటికి వెళ్లి అక్కడి నుండి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాలని ఆశపడ్డాను. అయితే అది మా కంపెనీలో చాలా కష్టమైన విషయం. కానీ నాకేమో ఇంటికి వెళ్ళాలని ఉండేది. అందుచేత ప్రతిరోజూ బాబాని, "ఎలా అయిన నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ మంజూరు అయ్యేలా చూడండి బాబా" అని వేడుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు బాబా ఊదీ పెట్టుకొని మా మేనేజర్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని అడిగాను. ఆమె మారు మాట్లాడకుండా చాలా ఆనందంగా ఒప్పుకొని, రెండు వారాలు ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇచ్చారు. నేను అస్సలు ఊహించనిది జరగడం వల్ల నాకు చాలా ఆనందమేసింది. ఇక మా ఇంటికి వెళ్తున్నానన్న మాటల్లో వర్ణించలేని ఆనందంతో మా ఊరుకి ప్రయాణమయ్యాను. బాబా దయవల్ల ప్రయాణం ఏ ఇబ్బందీ లేకుండా జరిగింది. తిరుగు ప్రయాణమయ్యే రోజు నాకు జ్వరం వచ్చింది. అయినా తప్పనిసరై చెన్నైకి ప్రయాణమయ్యాను. బాబా దయవల్ల ప్రయాణం బాగానే జరిగింది కానీ పీజీలో జ్వరంతో ఉన్న నన్ను చూసుకోవడానికి ఎవరూ లేనందున చాలా భయమేసింది. నా పరిస్థితి ఇలా ఉంటే అదే సమయంలో నా కుటుంబం, నా రూం మేట్ కూడా అనారోగ్యం పాలయ్యారు. అటువంటి స్థితిలో నేను మనకు ఎల్లప్పుడూ తోడు ఉండే నేస్తం ఆ బాబానే అని, "బాబా! నాకు ఈ జ్వరం తగ్గి మామూలుగా ఆఫీసుకి వెళ్లేలా చూడు. అలాగే నా కుటుంబానికి, నా స్నేహితుడికి నయమయ్యేలా చూడండి. మైలాపూర్‌లో ఉన్న మీ గుడికి వస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. మెల్లగా నాకు జ్వరం తగ్గి నేను సాధారణ స్థితికి వచ్చాను. నా కుటుంబం, నా స్నేహితుని ఆరోగ్యాలు కూడా కుదుటపడ్డాయి. అంతా బాబా దయ.
ఒకరోజు రాత్రి నిద్రపోయేముందు నాకు విపరీతమైన మెడ నొప్పి వచ్చింది. నరాలు తెగిపోయాయా అన్నంత నొప్పి వల్ల ఏమీ మింగలేకపోయాను. అంతటి నొప్పిలో బాబా నామస్మరణ చేస్తూ మెడకు ఊదీ రాసుకొని, కొంచెం ఊదీ నీళ్ళల్లో కలుపుకుని తాగి, "బాబా! ఈ నొప్పి తగ్గేలా చూడండి" అని వేడుకొని బాబా నామస్మరణ చేస్తూ ఏ సమయానికో నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్న లేచేసరికి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. తర్వాత టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళాను. కానీ ఆహారం మింగితే నొప్పి ఎక్కువ అవుతుందేమోనని భయపడుతూ మెల్లగా తినడం మొదలుపెట్టాను. అత్యంత అద్భుతం! అస్సలు నొప్పి అనిపించలేదు. పూర్తిగా మటుమాయం అయింది. ఇది బాబా లీల కాకపోతే ఇంకేంటి?
2023, నవంబరులో నేను మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ మా మేనేజరును అడగాలని అనుకున్నాను. కానీ ఆ మేనేజర్ కొత్త కావడం వలన ఇస్తారో, లేదో అని చాలా భయపడి మళ్ళీ బాబాని, "ఈసారి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా అనుగ్రహించండి స్వామి" అని వేడుకున్నాను. బాబా దయతో నా కోరిక నెరవేరేలా చేశారు. అందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళాను. అయితే చెన్నైకి తిరిగి వచ్చాక మళ్లీ అనారోగ్యం పాలయ్యాను. మళ్ళీ అదే మెడనొప్పి. దానికి తోడు కళ్ళు తిరగటం కూడా మొదలైంది. నాకు దిక్కు బాబానే. అందుకని ఆయన్నే, "దేవా! దయుంచి నా ఇబ్బందిని తగ్గించండి" అని వేడుకున్నాను. ఆ మరుక్షణమే వాంతి అయ్యింది. దాంతో నా మెడలో నరాలు సెట్ అయి నొప్పి తగ్గిపోయింది. నిజంగా అద్భుతమనిపించింది. రెండు రోజుల్లో కళ్ళు తిరగటం కూడా తగ్గిపోయింది. ఇదంతా కేవలం బాబా దయ. ఆయన నాకు పెట్టిన ఆరోగ్య భిక్ష అనుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Sai Tandri kapadu Jai Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Sai 🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, chelli ki intern location hyderabad ki change ayye la chai tandri pls, nve na nammakam neeku edaina sadyame
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri
ReplyDeleteBaba, please bless us always & please rid of my bad thoughts. Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeletesai baba eeroju madava schoolki vellataniki godava chesadu. kaneesam afternoon nunchi eina velte mee anugrahanni repu bloglo panchukuntanu baba. madavalo maarpu raavali baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba ji... delivery date thaggaraku vachindi nuvve dikku baba
ReplyDeleteOm Sai Ram today I am writing with Baba's blessings.first time I am writing today's date.Bless our family baba.Be with us tandri.Today is 2-1-2024 Om Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteగురుదేవ పరమాత్మ సాయినాథ నాలోని సకలకోట రోగాలు సకల కొట్టి పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసే బదులు లేకుండా నా భర్త మనస్పూర్తిగా నన్ను భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్లాలా చూడు బాబా తండ్రి అన్నిట్లో ప్రతి చిన్నదాంట్లో కూడా సమాధానం దొరుకుతుంది నాకు కానీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నావు సాయి
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm sainadaya divya managalam🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba brunu gadiki vamthing ayela chesav tandri tq so much bangaru tandri🙏🙏🙏🙏🙏
ReplyDeletePlease baba naku vunna ofc problem miku telusu baba please a file complete ayela cheyandi tandri🙏🙏🙏🙏❤❤❤❤
ReplyDeleteFile alagola ofc vallu oppukuni chesela chudu tandri please baba🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba mere daggara vundi anni manchi gaa ayyi....memu ebbandi padakunda evarini ebbandi pettakunda chudandi thandri please 🙏....
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sri sainathaya namah swamy Naku marriage ayela chudu tandri
ReplyDelete