1. గిరి ప్రదక్షిణ భాగ్యాన్ని ప్రసాదించిన బాబా
2. సదా తమ అండ ఉందని మరోసారి ఋజువు చేసిన సాయి
గిరి ప్రదక్షిణ భాగ్యాన్ని ప్రసాదించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. ఒకరోజు నా భర్త, "అరుణాచలం వెళదామ"ని అన్నారు. అప్పుడు నేను, "నాకు కూడా వెళ్లాలని ఉంది" అని అన్నాను. దాంతో మావారు తనకి సెలవులు దొరికినప్పుడు తత్కాల్లో టికెట్లు బుక్ చేయాలని అనుకున్నారు. తర్వాత మేము అరుణాచలం వెళ్లాలని అనుకున్న రోజు సరిగ్గా కార్తీక పౌర్ణమి అయింది. ఆరోజు అరుణగిరిపై జ్యోతి వెలిగించే రోజు కూడా. బాబా దయవల్ల ట్రైన్ టికెట్లు దొరికాయి. కానీ రిటర్న్ టికెట్లు వెయిటింగ్ లిస్టు వచ్చాయి. ఇకపోతే, అరుణాచలంలో రూమ్ రెంట్లు దాదాపు పది నుండి 14 వేలు చెప్పడంతో నా భర్త అక్కడికి దగ్గరలో ఉన్న విల్లుపురంలో రూమ్ బుక్ చేసి, "నువ్వు గిరిప్రదక్షిణలో ఆలస్యం చేయకూడదు" అని అన్నారు. అది విని ఎప్పటినుండో ఎదురుచూస్తున్న గిరిప్రదక్షిణ భాగ్యం చేజారిపోతుందేమోనని బాధతో, "తండ్రీ! గిరిప్రదక్షిణ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు" అని బాబాను వేడుకున్నాను. నా తండ్రి సాయినాథుడు నా భర్త మనసు మార్చి గిరి ప్రదక్షిణకు సమయం పడుతుందేమో అని రెండు గంటలు ముందుగానే క్యాబ్ బుక్ చేసేలా చేశారు. అలా చేయడం వల్ల మాకు చాలా మేలు జరిగింది. మామూలుగా పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణకు చాలా జనం వస్తారు. అలాంటిది ఆరోజు కార్తీక పౌర్ణమి, పైగా అరుణగిరిపై జ్యోతి ప్రజ్వలన చేసేరోజు. అందువల్ల జనం తండోపతండాలుగా వస్తారు. ఆ జనంలో గిరి ప్రదక్షిణ అంటే మాటలు కాదు. కానీ మావారు రెండుగంటలు ముందుగా క్యాబ్ బుక్ చేయడం వల్ల రద్దీ పెరిగే సమయానికల్లా మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసాము. అది కూడా ఐదు గంటల్లో. ఇదంతా బాబా మరియు అరుణాచలేశ్వరుని దయవల్లే సాధ్యమైంది. ఎందుకిలా చెప్తున్నానంటే, ఎక్కువ పని చేస్తే నాకు నీరసంగా, నిస్సత్తువగా వుంటుంది. అటువంటిది నాచేత నా భర్త కంటే ఉత్సాహంగా ఎక్కడా ఆగకుండా తొందరగా గిరి ప్రదక్షిణ చేయగలిగేలా చేసే నాలో శక్తి ఉన్నదని బాబా నాకు తెలియజేశారు. అంతేకాదు, దయతో మా తిరుగు ప్రయాణం టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చేసారు. కాకపోతే, మాకు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం లభించలేదు. నేను అది బాబా సంకల్పంగా భావించి గిరి ప్రదక్షిణ భాగ్యాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి తిరిగి వచ్చాను. చివరిగా ఇంకో విషయం, మేము అరుణాచలంకి ప్రయాణమైనప్పుడే నా నెలసరి సమయం. అందువల్ల నేను టాబ్లెట్లు వేసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాను. అయినప్పటికీ సరిగ్గా ప్రయాణమయ్యే రోజున నాకు నెలసరి వచ్చేలా అనిపించింది. కానీ బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అరుణాచలం వెళ్ళాను. అక్కడినుండి తిరిగి ఇల్లు చేరి ప్రయాణ బడలిక తీరిన తర్వాత నాకు నెలసరి వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
సదా తమ అండ ఉందని మరోసారి ఋజువు చేసిన సాయి
సాయిబంధువులకు నమస్సుమాంజలి. నా పేరు మణిమాల. నాకు సదా సాయి అండ ఉందని మరోసారి ఋజువు చేసిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరు నెలలుగా నా కుడి చెవి నుండి నీరు కారుతూ ఉంటే డాక్టర్ చిన్న ఆపరేషన్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళొచ్చాను. కానీ సాయి 'వరంగల్ డాక్టర్ దగ్గరే చూపించుకోమ'ని సలహా ఇచ్చినట్లు అనిపించి మళ్ళీ వరంగల్ డాక్టర్ దగ్గరకే వెళ్లాను. డాక్టరు, "సమస్య మళ్ళీ ఆపరేషన్‌తోనే పరిష్కారమవుతుందని. అయితే మేజర్ ఆపరేషన్ చేయాల"ని అన్నారు. నేను బాబా మీద భారమేసి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నాను. 2023, డిసెంబర్ 2న ఆపరేషన్ జరిగింది. మధ్యలో డాక్టర్లు టెన్షన్ పడసాగారు. నా చెవికి మాత్రమే మత్తు ఇవ్వడం వలన నాకు అన్ని వినిపిస్తున్నాయి, ఎదురుగా ఉన్న స్క్రీన్‌ని చూస్తున్నాను. నా చెవి వెనుక వైపు కట్ చేసాక డాక్టర్, "నేను ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది. నా సర్వీసులో ఇలా ఎప్పుడూ చూడలేదు. ట్యూమర్స్ ఉన్నాయి. సమస్య పెద్దదే" అని చాలా ఆందోళన చెందుతూ, "బ్లీడింగ్ ఆగడం లేద"ని కంగారు పడసాగారు. అదంతా విన్న నేను, "సాయీ! నువ్వే వైద్యుడివై నన్ను ఆదుకో" అని బాబాను వేడుకున్నాను. బాబా దయ చూపారు. కొంచెం సేపయ్యాక డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి బ్లీడింగ్ ఆగింది. ట్యూమర్ రూపంలో ఉన్న మాంసపు ముద్ద అంతా తొలగించారు. దాన్ని బయాప్సీకి పంపాలని చెప్పి పంపారు. తర్వాత డాక్టర్లు, "మాకు ఇటువంటి అనుభవం మొదటిసారి జరిగింది. ఏం చేయాలో అర్థంకాక ఇలాగే నిన్ను హైదరాబాద్ పంపుదామనుకున్నాము. కానీ ఏదో మిరాకిల్ జరిగింది. అదేంటో మాకే అర్ధం కాలేదు" అన్నారు. నాకు తెలుసు 'అది సాయి చేసిన అద్భుతమ'ని, ఆయనే నాకు ఆపరేషన్ చేశార'ని. ఎందుకంటే, ఆపరేషన్‌కి వెళ్ళేటప్పుడు నేను ఒక సాయి వచనం చూసాను: "అంతా సవ్యంగా జరుగుతుంది. భయపడకు" అని.
Om Sairam!!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram. Amma nanna lani aroghyam ga anandam ga chudandi thandri pls, chelli intern location banglore ki change chese la chudandi thandri pls
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeletesai natha, eeroju maa sai madava meedayavlana schoolki velladu, alage roju pechi pettakunda schoolki vellalaga madava ni maarchandi baba. madava bharam antha meede baba. aalage maavaru kopam akkauva kakunda nannu kapadaru baba. nenu eppudu meeku bhakturaline baba.
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please baba mouth nunchi bleeding rakunda chudu baba please baba delivery safe ga chei baba please
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, Ni dayavalana ee roju pitapuramu lo Sri pada srivallabha janma sthanam darshanam Baga jarigindi. Chala santhosham ga vundi. Always shower your grace on us 💐💐
ReplyDeleteOmsaisri Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏, 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete