1. నిజంగా బాబా నామం పలుకుతుంది2. బాబా అనన్యప్రేమ
నిజంగా బాబా నామం పలుకుతుంది
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా గురువులకే గురువు పరమ గురువు అయిన సాయి చరణములకు నా అనంతకోటి నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. మాది నరసరావుపేట. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ని. నేను నా చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తుడిని. సాయిని చూస్తూ, సాయిని తలుస్తూ, సాయి లీలామృతం చదువుతూ పెరిగాను. ఒకరకంగా చెప్పాలంటే సచ్చరిత్రలో చెప్పినట్టు బాబానే నన్ను పెంచారు. ఏ సమస్య వచ్చినా 'బాబా' అని పిలిచినంతనే ఆ తండ్రి నాకు తోడు-నీడై సహాయం అందిస్తున్నారు. నేనిప్పుడు బాబా మా అన్నయ్య విషయంలో ప్రసాదించిన ఒక ముఖ్యమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆలస్యంగా పంచుకుంటున్నందుకు ముందుగా బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అది 2023, జూలై నెల. ఒక రోజు ఉదయం మా అన్నయ్య వద్ద నుంచి నాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, 'ముందురోజు రాత్రి అన్నయ్యకి బాగలేదు, గుండెనొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చారు, డాక్టర్ అంజియోగ్రామ్ చేసి, "గుండెలో మల్టీపుల్ బ్లాక్స్ వున్నాయి. సర్జరీ చేయాలి. హై రిస్క్ ఉంది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేము, మీరు వెంటనే వేరే హాస్పిటల్‌కి వెళ్ళండ"ని చెప్పారు'. అది విని నేను ఏడుస్తూ బాబా గుడికి వెళ్లి, "అన్నయ్యని ఎలాగైనా ఈ అనారోగ్యం నుండి బయటపడేయండి" అని బాబాను ప్రార్ధించాను. అప్పుడే పూజారి ఊదీ, బాబాకి వేసిన పూలమాల నాకిచ్చారు. నేను వాటిని మా అన్నయ్య కోసం కొరియర్ చేశాను. మా ఇంట్లోవాళ్ళు అన్నయ్యని మంగళగిరి NRI హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‌వాళ్ళు కూడా సర్జరీ ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని చెప్పి, "5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. రెండు వారాలలోపు సర్జరీ చేయాల"ని చెప్పారు. నేను హైదరాబాద్ నుండి బయలుదేరి మంగళగిరి చేరుకున్నాను. సర్జరీ హై రిస్క్‌తో కొడుకున్నందున సర్జరీ వద్దని మేము అనుకొని అన్నయ్యని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాము. అంతలో తిరుపతి నుండి మా అక్క, బావ కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళు మెడికల్ ఫీల్డ్‌లో ఉండటం వల్ల చాలామంది డాక్టర్లని కలిసి అంజియోగ్రామ్ వీడియో చూపిస్తే, "ఇది సర్జరీ కేసు. ఒక రెండు వారాల లోపు సర్జరీ చేయించాల"ని చెప్పారు. మా నాన్న, వదిన హైదరాబాద్ వెళ్లి నాలుగు, ఐదు హాస్పిటళ్లు తిరిగారు. అందరూ హై రిస్క్ కేసు అని చెప్పారు. ఆలోపు రెండు వారాలు గడిచిపోయాయి. అది మా జీవితంలో మేము అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్న సమయం. ఆ రెండు వారాలు మేము అన్నయ్య నుదుటన బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి అన్నయ్యకి ఇస్తూ ఇంట్లో అందరమూ బాబాని కన్నీళ్లతో ప్రార్థిస్తుండేవాళ్ళము. 'బాబా తప్పక ఏదో ఒక దారి చూపించి, అన్నయ్యని ఆ ఆనారోగ్య సమస్య నుండి బయటపడేస్తార'ని బాబా మీద నాకు బాగా నమ్మకం. ఎందుకంటే, జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు బాబా మనకోసం ఇంకొక దారి తెరుస్తారు. అదే జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ డాక్టర్‌కి అన్నయ్య అంజియోగ్రామ్ వీడియో పంపించి వచ్చాను. మా నాన్న, వదిన కూడా కిమ్స్ హాస్పిటల్‌లోని ఆ డాక్టర్ని కలిసి, అతని ఒపీనియన్ అడిగితే, "రెండు దశల్లో అంటే రెండు రోజుల వ్యవధిలో స్టెంట్లు వేద్దాం" అని చెప్పారు. ఇంకా అప్పుడు అన్నయ్యని హైదరాబాద్ తీసుకుని వెళ్లి కిమ్స్ హాస్పిటల్లో చేర్పించాము. 2023, ఆగష్టు 10న మొదటిసారి స్టెంట్ ప్రక్రియకు తీసుకొని వెళ్లేటప్పుడు మా అన్నయకి ఒక సాధువు కలలో కనపడి నుదుటన ఊదీ పెట్టారు. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు గంటల సమయం పట్టింది. నేను బాబాని, "మీ నామం పలుకుతుందని మీరు చెప్పారు. అందుకు నాకు ఋజువు కావాలి" అని చెప్పి ఆ సమయమంతా మేము అందరమూ బాబా నామాన్ని నిరంతరాయంగా చేసుకున్నాము. నిజంగానే బాబా నామం పలికింది. ఆ రెండు గంటల సమయం పూర్తైయ్యేలోపు రాజమండ్రి సాయిమందిరం నుంచి ఒక యాగానికి సంబంధించి నా వాట్సాప్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అదే మొదటిసారి ఆ గుడివాళ్ళు నాకు మెసేజ్ పెట్టడం. నేను ఆశ్చర్యపోయాను. ఇంతలో డాక్టర్ మమల్ని పిలుస్తున్నారని కబురు రావటంతో వెళ్లి డాక్టర్‌ని కలిస్తే, "స్టెంట్ ప్రక్రియ విజయవంతమైంద"ని చెప్పారు. రెండు రోజుల తర్వాత మరోసారి స్టెంట్లు వేసి మా అన్నయ్యను కాపాడారు. ఆ విధంగా బాబా మాపై దయ చూపారు. నాకు తోడు-నీడ అయిన నా సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు. నిజంగా ఆయన నామం పలుకుతుంది. మనం చేయవలసిందల్లా బాబాపై నమ్మకంతో తీవ్రంగా ప్రార్ధించటమే. 'సాయీ' అని పిలిచిన వెంటనే 'ఓయీ' అని పలికే నా తండ్రికి నా కృతజ్ఞతలు.
బాబా అనన్యప్రేమ
నా పేరు రాంబాబు, నేను విజయనగరం నివాసిని. నేను ఒక ఫార్మా కంపెనీలో ఇంచార్జ్‌గా పని చేస్తున్నాను. ఒకసారి నేను పని చేస్తున్న బ్లాక్‌లోని ప్రోడక్ట్ ఔట్పుట్ తక్కువగా రాసాగి, దానివల్ల ప్రోడక్ట్ స్టాకు నెగిటివ్‌లోకి వెళ్లడం మొదలైంది. పరిస్థితి సాధారణ స్థాయికి రావాలంటే రాబోయే ఔట్పుట్ అంతా ఎక్కువగా రావాల్సి ఉంది. కానీ రాబోయే ఔట్పుట్‌లన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఆ తర్వాత ప్రొడక్షన్ ప్లాన్ లేదు. అటువంటి పరిస్థితిలో నేను, "బాబా! ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి" అని బాబాని వేడుకున్నాను. బాబా మహిమ చూపించారు. మా బ్లాక్‌లో ఔట్పుట్ తగ్గిపోవడానికి కారణమైన మరొక సమస్య బయటపడి, పరిష్కరింపబడింది. ఇక అప్పటినుండి మా బ్లాక్ ఔట్పుట్ ఎక్కువగా రావడం మొదలై సమస్య పరిష్కారమైంది. కొన్నిరోజులకి అదే సమస్య మరొసారి నాకు ఎదురైంది. అప్పుడు కూడా నేను బాబాని వేడుకోవడంతో ఆ సమస్య నుండి బయటపడ్డాను. ఆ విధంగా బాబా నన్ను ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేశారు. నా సొంతం అనేవాళ్ళు నా జీవితాంతం నాతో ఉండకపోవచ్చు కానీ, బాబా ఖచ్చితంగా నాతో ఉంటారు. "బాబా! మీ అనన్య ప్రేమకు చాలా చాలా ధన్యవాదాలు. 'ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి' అన్న శ్రీ సాయినాథుని శరత్‌బాబుజీ ఆశ, మధుర స్వప్నం ఈ బ్లాగు ద్వారా సాఫల్యం కావాలని ప్రార్థిస్తున్నాను".
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సర్వేజనా సుఖినోభవంతు!!!
Om Sairam🙏
ReplyDeleteOm Sairam!!
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, amma nanna lu anni vidala bagunde la chai tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri vadini bless cheyandi na problem
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteసాయి మా తమ్ముడికి ఆరోగ్యం ప్రసాదించు
ReplyDeletesai baba, maa sai madava eeroju schoolki vellakunda market vypu velladu. madava ni kapadi entiki velletattu cheyandi baba. madava bharam antha meede baba. madava entiki ragane blog lo panchu kuntanu baba.
ReplyDeleteBaba,memu present vunna situations nundi bayataki vachela cheyandi....Mee daya thone intha duram vachamu....meru Naku mata icharu mammalni nilabadathamu evariki ebbandi kalagakunda ani gattiga nammuthunnanu....meku cheppakunnattu andariki antha vellettu chesthanu....evariki maa valla bhada rakunda kapadi munduki pampandi.... Mee padale dikku 🙏...memu ee situation nundi bayata padithe andaritho naa anubhavam panchukunta 🙏 anugrahinchandi baba please 🙏🥺
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Omsaisri Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteSwamy Baba mammulanu kalupu tandri eka anta nee daya tandri Baba a ammayi manasu marchu tandri Baba 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm Sairam
Om Sairam