సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1743వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో అరుణాచలేశ్వరుని దర్శనం
2. బాబా దయ

బాబా దయతో అరుణాచలేశ్వరుని దర్శనం


నా పేరు ఝాన్సీ. మేము కోవిడ్ కాలంలో అరుణాచలం వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేసాముగాని, ఆషాడ కృత్తిక సందర్భంగా జనం పెరుగుతున్నందున అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోకుండానే వచ్చేసాము. అందువల్ల నాకు అంతదూరం వెళ్లి, దర్శనం చేసుకోకుండా వచ్చేశామని బాధగా ఉండేది. చివరికి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అరుణాచలం వెళ్లాలనిపించి బాబాతో చెప్పుకొని అరుణాచలం వెళ్ళడానికి ప్రణాళిక మొదలుపెట్టాను. మా కుటుంబసభ్యులందరూ సమ్మతించాక శని, ఆదివారాల్లో  వెళ్ళొద్దామని అనుకున్నాను. అయితే శనివారం నెల్లూరు నుండి అరుణాచలం వెళ్ళడానికి ఒకేఒక్క ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ టికెట్ కోసం ప్రయత్నిస్తే టికెట్ దొరకలేదు. చివరికి తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. ఇక అప్పుడు బస్సుకి వెళదామని అనుకున్నాము. కానీ మా ఆడపడుచు చెన్నై నుంచి ట్రైన్స్ ఉంటాయేమో ప్రయత్నిద్దామని అంది. ఐతే వాటికి కూడా టిక్కెట్లు దొరకలేదు. ఇక అప్పుడు మా ఆడపడుచు భర్త, "బస్సులో వెళితే, అక్కడికి వెళ్ళాక ప్రదక్షిణ చేయడానికి చాలా కష్టం. కాబట్టి కారులో వెళదామ"ని చెప్పి కారులో వెళ్ళడానికి నిశ్చయించారు. తీరా అంతా నిశ్చయమయ్యాక వాతావరణం మారిపోయింది. సౌత్ ఇండియాకి సైక్లోన్ అని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే చెన్నై, నెల్లూరులో వర్షం మొదలైంది. అయినా ఎలాగోలా ధైర్యం చేసి బయలుదేరాము. దారంతా చిన్నగా వర్షం పడుతుంది. అయినప్పటికీ బాబా సహాయం చేస్తారని నమ్మకంతో ప్రయాణం సాగించి చెన్నై చేరుకున్నాము. తర్వాత అక్కడినుండి అరుణాచలంకి బయలుదేరాము. మాకన్నా ముందు అరుణాచలం చేరుకున్న ఒక కుటుంబం ఫోన్ చేసి, "ఇక్కడ వర్షం పడుతుంది" అని అన్నారు. అది విని దేవుడా వర్షంలో ప్రదక్షిణ చేయాలా అని అనుకున్నాము. కానీ బాబా దయవల్ల మేము సాయంత్రం 4 గంటలకి అరుణాచలం చేరుకునేసరికి వర్షం లేదు, వాతావరణం అనుకూలంగా ఉంది. దీపం పెట్టి, కర్పూరం వెలిగించి 'అరుణాచల శివ.. అరుణాచల శివ' అంటూ ప్రదక్షిణ మొదలుపెట్టాము. మధ్యలో అప్పుడప్పుడు చిన్నగా వర్షం పడినా ఎక్కడా మాకు ఇబ్బంది కలగలేదు. రాత్రి 11కి ప్రదక్షిణ ముగించుకొని రూముకి వెళ్ళాము. మర్నాడు ఉదయం లేచి దర్శనంకు వెళ్ళాము. దర్శనానికి చాలా సమయం పట్టింది. ముందురోజు ప్రదక్షిణ వల్ల కాళ్లనొప్పులతో 5 గంటలసేపు క్యూలో నిల్చోడానికి చాలా కష్టమైంది. అయినా కష్టం తర్వాత ఫలితం అద్భుతంగా ఉంటుందని నేను చాలా ఓపికతో ఉన్నాను. బాబా దయవల్ల ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకుని సంతోషంగా బయటకి వచ్చి తిరుగు ప్రయాణమయ్యాము. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఆదివారం రాత్రి 10 గంటలకు నెల్లూరు చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా. ఎంతో కష్టం అనుకున్నా ప్రయాణం చాలా సులువుగా పూర్తి చేసాము తండ్రీ. మీ ఆశీస్సులుంటే ఎంత కష్టమైన పనైనా సులువుగా పూర్తవుతుందని మరోసారి బలమైన నమ్మకం కలిగేలా చేసావు బాబా. ఇప్పటివరకు ఒక్కసారి కూడా శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకోలేకపోయాను. దయతో ఇకనైనా మీ దర్శనభాగ్యాన్ని నాకు ప్రసాదించండి బాబా, ప్లీజ్!".


బాబా దయ


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఈ బ్లాగు ద్వారా మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకసారి మా బాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది. మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. అప్పుడు నేను సాయికి దణ్ణం పెట్టుకున్నాను. కొద్దిసేపటికే జ్వరం తగ్గిపోయింది.


నా ఫోన్ ఈమధ్య చాలాసార్లు కిందపడటంతో స్క్రీన్ మార్చాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఫోన్ మరోసారి కింద పడింది. వెంటనే సాయికి దణ్ణం పెట్టుకొని, "ఫోన్ పని చేస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తర్వాత నా ఫోన్  తీసి చూస్తే, పని చేసింది.


ఇటీవల ఒకసారి నాకు విపరీతమైన పంటి సమస్య వచ్చింది. దాదాపు మూడు రోజులపాటు తిండి సరిగా తినలేకపోయాను. అప్పుడు సాయికి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఈ సమస్య తీరితే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే సమస్య సమసిపోయింది. ఆ తర్వాత ఒకసారి నెలసరి సమయంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటే సాయికి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయతో ఆ సమస్య కూడా తీరింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


19 comments:

  1. Om sai ram, anni samasyalu theeri poyi anni bagunde la chudu tandri

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri pl vadini bless cheyandi

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Om Sri Sai Arogya kshemadhaaya Namaha🙏🙏🙏

    ReplyDelete
  10. Om Sai Ram please bless my grand son Sreyas to be safe please bless him please reduse fever give him health for him

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. sai baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete
  14. Sainadha maa problems solve ayyela chudandi please.....roju roju ki ebbandi ayipothundi 🙏😔

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo