సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1733వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎన్నో సమస్యలు - సాయిబాబాకు చెప్పుకుంటే తీరిపోయాయి
2. కోరుకున్నది అనుగ్రహించిన బాబా
3. నమ్మిన వారి కష్టాలు తీరుస్తారు బాబా

ఎన్నో సమస్యలు - సాయిబాబాకు చెప్పుకుంటే తీరిపోయాయి


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. నేను 1991వ సంవత్సరంలో మొదటిసారి ‘సాయి నామాన్ని’ విన్నాను. ఆ సమయంలో నేను చిన్న ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాను. నాకు చదువులో మంచి పర్సంటేజ్ వస్తే, సాయి దగ్గరకి వస్తానని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే నాకు 85% మార్కులు వచ్చాయి. అప్పటినుండి నేను సాయిబాబాని మాత్రమే నమ్ముకున్నాను. ఎంతోమందికి సాయిబాబా గురించి చెప్పాను. 


తర్వాత నాకు మంచి కుటుంబంలోని వ్యక్తితో పెళ్లి కావాలని అనుకున్నాను. బాబా దయవల్ల నేను ఆశించినట్లే చాలా మంచి కుటుంబంలోని వ్యక్తితో నా వివాహం జరిగింది. మా వారిది ప్రైవేటు ఉద్యోగం. అందువల్ల నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుంటుందని సాయిబాబాని తలుచుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. బాబా దయవల్ల ఆ కోరిక నెరవేరింది.


ఆరు సంవత్సరాల క్రితం నా ఆరోగ్యం చెడిపోయింది. డాక్టర్లు ఎన్ని పరీక్షలు చేసినా సమస్య ఏమిటో తెలియలేదు. చివరిగా వెన్నులో నీరు తీసి టెస్టు చేయాలని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. సాయిబాబాని తలుచుకుని హాస్పిటల్‌కి బయలుదేరాను. మధ్య దారిలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక పెద్దాయన కనబడి, "నీకేమీ కాదు. ధైర్యంగా ఉండు" అని చెప్పారు. నేను ఆయనను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. సాయిబాబానే ఆ రూపంలో వచ్చి నాకు ధైర్యం చెప్పారనుకున్నాను. ఆ తర్వాత జరిగిన టెస్టు ఆధారంగా, "నాకు ఏ సమస్యా లేద"ని చెప్పారు డాక్టర్స్. అంతేకాదు, నా అనారోగ్యం కూడా తగ్గిపోయింది. ఇలా చెప్పుకుంటూ పొతే, చాలా సమస్యలు వచ్చాయి. సాయిబాబాకు చెప్పుకుంటే తీరిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు".


కోరుకున్నది అనుగ్రహించిన బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. మేము హైదరాబాద్‌లోని ఒక భవనం మొదటి అంతస్థులో అద్దెకి ఉంటున్నాము. మా కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు చాలా దురుసు స్వభావం గలవాళ్లు. వాళ్ళు చీటికిమాటికి గొడవ చేస్తుండేవాళ్ళు. వాళ్ళ వల్ల నేను చాలా బాధపడుతూ చివరికి ఒకరోజు బాబా ముందు ఏడుస్తూ, "ఇక నావల్ల కాదు బాబా. మనశాంతి లేకుండా ఉంది. నా తప్పు ఉంటే మేము ఈ ఇల్లు ఖాళీ చేసేలా చేయండి. వాళ్ల తప్పు ఉంటే వాళ్లు ఖాళీ చేసేలా చేయండి. అంతేగాని, ఇలా మాటిమాటికీ గొడవలు వద్దు. నేను కోరుకున్నట్లు జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. తర్వాత ఒక నెల రోజులకి వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలా నా తండ్రి నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు నచ్చినట్టు ఉంటూ, మిమ్మల్నే స్మరించుకుంటూ ఉండేలా అనుగ్రహించు తండ్రీ".


నమ్మిన వారి కష్టాలు తీరుస్తారు బాబా 

సాయి బంధువులకు వందనాలు. నా పేరు విజయ్ చంద్ర. మాది ఏలూరు. 2023, అక్టోబర్ 12న నేను మా ఆఫీసు నుండి బయటకు వచ్చేసరికి సాయంత్రం 6:30 అయింది. 30 నిముషాలు వేచి చూసినా ఏలూరు వెళ్ళటానికి బస్సుగానీ, టాక్సీగానీ రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఏంటయ్యా ఇది? కాళ్ళునొప్పులు పెడుతున్నాయి. ప్లీజ్ బాబా, ఏదైనా వాహనం వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. ఒక కారు వచ్చి నా ముందు ఆగింది. ఆ డ్రైవర్ 'గూడెం', 'రాజమండ్రీ' అని అరుస్తున్నాడు. "ఏలూరు వెళ్ళదా?" అని అడిగితే, "వెళ్ళదండి" అని అన్నాడు. నేను బాబాను, "బాబా! ఇతను నన్ను ఎక్కించుకుని ఏలూరు తీసుకొని వెళ్లేలా చేయండి ప్లీజ్" అని వేడుకున్నాను. ఒక పది నిముషాల తరువాత ఆ డ్రైవర్, "రండి. ఏలూరు వెళదాం. ఎక్కండి" అని అన్నాడు. నేను ఆశ్చర్యానందాలతో కారు ఎక్కాను. అది ఏసీ కారు. గంటలో ఏలూరు చేరుకున్నాను. నమ్మినవారికి మన బాబా కష్టాలు రానివ్వరు. "చాలా ధన్యవాదాలు బాబా. అందరినీ ఇలాగే కాపాడండి బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై.


20 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my son 🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri

    ReplyDelete
  6. Om Sai Ram we are in Tirupati.Today is lord Srinivasa darshan please give good darshan for us baba.i want to visit always with my husband.please be with us.please take care of my family.Om Sai Ram.. Take care of children, grand children and husband.give full 🙏🙏🙏 life to them.i want to die in my husband hand.please bless my desire

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. నేను అడిగింది ఇచ్చినందుకు చాలా థాంక్స్ బాబా.🙏🙏🙏

    ReplyDelete
  10. saibaba maa sai madava bharam antha meede baba. madavaki chaduvu meeda dyasa kaligela cheyandi baba.

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  12. Baba eroju malli office vallatho pending vati gurinchi discussion avuthundi.... please baba aa pending vatini clear cheselaga cheyandi baba....mere dikku maku 🙏....mere mammalni intha duram thesuku vacharu inka munduki kuda meru thappa evaru thesuku vellaleru

    ReplyDelete
  13. Om Sai Ram, ofce lo ye problem avvakunda chudandi tandri e roju ki aduguthunna chelli intern location banglore nunchi hyd change chese la chudu tandri, monna ofce lo problem terchinanduky chala thanks tandri

    ReplyDelete
  14. Om Sri Sai Raksha🙏🙏

    ReplyDelete
  15. సాయినిజం అయనమహిమలునిజం
    బాబాదయవల్లనేనునాకుటుంబం,
    ఆయననునమ్ముకుని, చక్కగాజీవనయాణం సాగుస్తున్నాం!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo