సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1734వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాధను తీర్చి సంతోషపరిచిన బాబా
2. ఇది కదా బాబా లీల అంటే

బాధను తీర్చి సంతోషపరిచిన బాబా


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. బాబా దయతో ఇటీవల మా తమ్ముడు పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లి సమయానికే నా నెలసరి సమయం కావడంతో నెలసరి త్వరగా రావాలని నేను రెండు రోజులు వాము నీరు తాగాను, అలాగే బొప్పాయి రసం కూడా తాగాను. అయితే నెలసరి సమయం దాటిపోయినా నాకు నెలసరి రాలేదు. దాంతో పెళ్ళికి ఆటంకం లేకుండా నెలసరి రాకుండా టాబ్లెట్ వేద్దామని అనుకున్నాను. కానీ బాబాని అడిగితే, వద్దని సమాధానం వచ్చింది. అందువల్ల నేను టాబ్లెట్లు వేసుకోలేదు. బాబా దయవల్ల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. తరువాత 2023, డిసెంబర్ 7, మార్గశిర లక్ష్మివారం లక్ష్మీదేవి పూజ కూడా చేసుకున్నాను. అయినా నెలసరి రాలేదు. “ధన్యవాదాలు బాబా”. 


ఇంకో విషయం. నా భర్త, నా చెల్లి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఆ కారణంగా మా వారు మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళడం మానేశారు. పెళ్లికి కూడా ముహూర్త సమయానికి వస్తాను, మరి దేనికి రానని ఖండితంగా అన్నారు. భర్త పక్కన లేకుంటే ఫంక్షన్ ఎలా ఎంజాయ్ చేయగలము? అందుకని నేను బాబాతో చెప్పుకొని చాలా బాధపడ్డాను. బాబా దయవల్ల మావారు రిసెప్షన్‌కి, పెళ్లికి వచ్చారు. చదివింపులు కూడా ఆయనే వ్రాశారు. అలా బాబా నా బాధని తీర్చి పెళ్లిలో నేను సంతోషంగా ఉండేలా చేశారు. "ధన్యవాదాలు సాయినాథా! తొందరగా నా భర్త మా వాళ్ళందరితో కలిసిపోయేలా చేసి, మా అమ్మ వాళ్ళింటికి రాకపోకలు సాగించే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను తండ్రీ. మీ దయవల్ల నా జీవితంలో నాకు ఎటువంటి లోటు లేదు కానీ, ఈ ఒక్క సమస్య నన్ను మానసికంగా బాగా కృంగదేస్తుంది. ఈ సమస్య తీర్చి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి". సాయి భక్తులారా! నా తరఫున మీరు కూడా నా సమస్య గురించి బాబాను ప్రార్థించండని మనవి చేసుకుంటున్నాను. మీ ప్రార్థనల ఫలితంగానైనా నా సమస్య తీరుతుందని ఆశపడుతున్నాను.


ఇది కదా బాబా లీల అంటే


అందరికీ నమస్కారం. నా పేరు ఛత్రపతి. నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను. 2023, డిసెంబర్ మొదటి వారంలో మిచుంగ్ తుఫాన్ చెన్నైలో తీవ్ర వరద భీభత్సం సృష్టించింది. ఇక్కడ జనాలు పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదు. నేను ఉంటున్న హాస్టల్ చుట్టూ వరద నీరు చేరాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాడుకకు అవసరమైన నీళ్లు కూడా అయిపోవచ్చాయి. నేను, "ఎలా అయిన ఈ కష్టం తీరాలి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థిస్తుండేవాడిని. బాబా దయవల్ల హాస్టల్లో ఉన్న వాళ్ళందరి గదుల్లో నీళ్లు అయిపోయిన మా గదిలో మాత్రం మరో 6 గంటల సేపు వచ్చాయి. కానీ చివరికి అవి కూడా అయిపోయాయి. అలా రెండు రోజులు చాలా కష్టపడ్డాక ఇక ఈ హాస్టల్లో ఉండలేమని వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మూడోరోజు నా స్నేహితుడితో కలిసి బయలుదేరాను. నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తుంటే మధ్య దారిలో "ట్రైన్ క్యాన్సిల్ అయింద"ని ఇంకో ఫ్రెండ్ వద్ద నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఎలా అయినా సరే ఈ పరిస్థితిలో మీరే నన్ను కాపాడాలి. నేను వెనక్కి మాత్రం వెళ్ళాను" అని బాబాతో చెప్పుకొని ఒక లాడ్జికి వెళ్ళాను. కానీ వాళ్ళు రూములు లేవన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఫోన్ చూస్తే, ముందురోజు రాత్రి ఒక ఫ్రెండ్ చేసిన మిస్డ్ కాల్ కనిపించింది. నేను అతనికి ఫోన్ చేసి నా పరిస్థితి వివరించాను. ఆ అబ్బాయి, "మా హాస్టల్లో నీళ్లు, విద్యుత్తు సమస్యలు లేవు, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసేయి" అని పిలిచాడు. నేను వెంటనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకొని నా ఫ్రెండ్ చెప్పిన హాస్టల్‌కి బయలుదేరాను. ఇది కదా బాబా లీల అంటే. నేను ఇక్కడ కష్టంలో ఉన్న సమయంలోనే మా ఇంట్లో ఉన్న మా నాన్న, చెల్లి అప్రయత్నంగా వారాహి చిత్రపటానికి దండం పెట్టుకొని, "మంచి జరిగేలా చూడు. మా అబ్బాయి నీ గుడికి వస్తాడు" అని మొక్కుకున్నారు. నేను ఆ వారాహి మరియు సాయిబాబాల దయవల్ల ఆపద నుండి బయట పడ్డాను. "బాబా! మీకు వేలవేల ధన్యవాదాలు".


16 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  5. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  6. saibaba maa sai madava bharam antha meede baba. madavalo maarpu ravali baba. alage maa tammudiki kuda manchi vudyogam vacheelaga chudu thandri

    ReplyDelete
  7. Baba nenu edina thappu chesthe kashaminchandi please,mee darshanam matram duram cheyakandi....meru dayatho maa problem ni solve cheyandi naa valla inka avvatam ledu edi handle cheyatam ....intha varaku Mee Daya valla vacham ee pending kuda clear cheyinchandi baba please 🥺...naa valla asalu avvatam ledu...antha mede baram

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om sai ram, ofce lo ye problem lekunda unde la chai tandri pls, chelli intern location hyd change chese la chudandi banglore nunchi plz

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. గురుబ్రహ్మ పరమాత్మ సాయినాధా నాలోని సకల కొట్టి రోగాలు సకలకోటి పాపాలు సకలకోటి దోషాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసిన జై తండ్రి సాయినాథ ఏ గొడవలు ఏ అపార్థాలు ఏ కోర్టు కేసులు లేకుండా చూడండి కొట్టుకు వెళ్లాలంటే నాకు చాలా భయంగా ఉంది సాయి కొట్టుకలకు ముందే వంశీ మారినని భార్యగా సేకరించి కాపురానికి తీసుకెళ్లాలా చూడు తండ్రి నీ సహాయం లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకేయ్యలేను బాబా

    ReplyDelete
  12. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo