సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1741వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా మహిమలు
2. ఎంతో టెన్షన్ పడాల్సిన పరిస్థితిని తప్పించిన బాబా

బాబా మహిమలు


నా పేరు శిరీష. నాకు ఏ చిన్న కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా, బాధ వచ్చినా మొదట తలుచుకునేది బాబానే, చెప్పుకునేది బాబాతోనే. ఆయన ఎన్నో ఇబ్బందుల నుండి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆయన దయవల్లే మేము ఇప్పుడు పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా సాఫీగా జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు కొన్ని చిన్నచిన్న అనుభవాలు పంచుకుంటాను. ఒకరోజు ఒక ఫంక్షన్‌కి వెళ్ళటానికి తయారవుతున్న సమయంలో మా పాప ఉంగరం ఎక్కడో పడిపోయింది. అందరం ఎంతసేపు వెతికినా కనిపించలేదు. ఆ రోజు గురువారం. నేను పూజ అయిన తర్వాత ఒకసారి బాబాని తలుచుకుని, "ఉంగరం కనపడేటట్లు చేయండి బాబా" అని అనుకున్నాను. తర్వాత నేను ఒక మెష్ డోర్ తీస్తే, ఎదురుగా ఉంగరం కనిపించింది. అదివరకు మావాళ్ళు అందరూ ఆ దారిలో చాలాసార్లు చూసారు. కానీ అప్పుడు ఆ ఉంగరం కనిపించలేదు. అలాంటిది బాబాని తలుచుకోగానే ఎదురుగా కనిపించింది. బాబా మహిమలు అలా ఉంటాయి.


ఒకసారి నేను పంటి నొప్పితో చాలా రోజులు బాధపడ్డాను. ఆ సమయంలో నేను సాయిభక్తుల అనుభవమాలిక చదువుతున్నాను. అలా చదువుతూ, 'నా పంటి నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను బాబా' అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నొప్పి తగ్గిపోయింది.


ఇంకోసారి నేను నెలసరి ఇబ్బందులతో చాలామంది డాక్టర్ల దగ్గరకి వెళ్తూ చాలా రోజులు ఇబ్బందిపడ్డాను. తర్వాత, "ఈసారి డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా చూడు బాబా" అని అనుకున్నాను. అంతే, బాబా నాకు ఆ ఇబ్బంది లేకుండా చూశారు. ఇలాంటి మహిమలు నా రోజువారీ జీవితంలో లెక్కకు అందనన్ని. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని చూపులు, దీవెనలు అన్నివేళలా అందరి యందు ఉండేలా చూడు స్వామి".


ఎంతో టెన్షన్ పడాల్సిన పరిస్థితిని తప్పించిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిభక్తులకి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ప్రతి అనుభవం నాకు సాయి అనుగ్రహం పట్ల విశ్వాసాన్ని పెంచింది. ఆయన అనుగ్రహం చూస్తుంటే ప్రతిక్షణం తన భక్తుల అవసరాలు(అవి ఎంత తాత్కాలికమైనవైనా సరే) తీరుస్తూ పిల్లలకు బొమ్మలు కొనిచ్చి, వాటితో వాళ్ళు ఆడుకుంటుంటే చూసి సంతోషించే తండ్రిలా అనిపిస్తుంది. సరే, నేను ఇప్పుడు రెండు అనుభవాలను పంచుకోబోతున్నాను. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్‌గా పని చేస్తున్నాను. ఈమద్య ఒక కేసు విషయంలో ఎంక్వయిరీ రికార్డ్ చేయడానికి నన్ను కమీషనర్‌గా వేసారు. ఆ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టు నుంచి తీసుకొని విచారణ అయిపోయాక కోర్టులో తిరిగి అప్పగించాలి. అప్పటిదాకా వాటిని జాగ్రత్త పరచడం నా బాధ్యత. అయితే నేను కోర్టు నుండి డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత సరిగా కోర్టులో కమీషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను తీసుకున్న పత్రాలలో ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి లేదని గమనించాను. అసలు ఆ డాక్యుమెంట్ నేను తీసుకున్నానో, లేదో కూడా నాకు గుర్తుకు రాలేదు. ఆ డాక్యుమెంట్ గనక పోతే నేను మాటలు పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కమీషన్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు నాకు అదే ఆలోచనతో దిగులుగా ఉండింది. కోర్టు నుండి చాలా దూరంలో ఉన్న మా ఇంటికి వెళ్లి మునుపు ఫైల్ పెట్టిన చోట వెతకాలని అనిపించింది. కానీ ఒకవేళ ఆ డాక్యుమెంట్ ఇంట్లో లేకపోతే నేను మరో రెండు రోజులు మరింత టెన్షన్ పడాలి. ఎందుకంటే, తర్వాత రెండు రోజులు కోర్టు సెలవులు. ఇలా పరిపరివిధాలా ఆలోచిస్తూ మా అమ్మకి ఫోన్ చేసి, ఇంట్లో నేను అదివరకు ఫైల్ పెట్టిన చోట డాక్యుమెంట్ ఉందో, లేదో చూసి చెప్పమని చెప్పాను. మా అమ్మ చూసి లేదని చెప్పింది. దాంతో నా టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోయింది. చివరికి ఏదైతే అదే అయిందని ఉన్న డాక్యుమెంట్లు అయిన కోర్టులో తిరిగి ఇచ్చేద్దామని కోర్టు కార్యాలయ గదికి వెళ్ళాను. అక్కడ నేను అదివరకు డాక్యుమెంట్లు తీసుకునేటప్పుడు ఏయే డాక్యూమెంట్లు తీసుకున్నానో వాటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్‌లో కనక నాకు కనిపించని డాక్యుమెంట్ పేరు ఉంటే, నా పని ఇంకా అయిపోయినట్లేనని అనిపించి, 'బాబా' అనుకుంటూ ఆ లిస్ట్ చూశాను. బాబా దయ ఆ లిస్ట్‌లో ఆ డాక్యుమెంట్ పేరు లేదు. అంటే నేను ఆ డాక్యుమెంట్ తీసుకోలేదు. కానీ కమిషన్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు నా మనసుకి నేను ఆ డాక్యుమెంట్ తీసుకునట్టే అనిపించింది. అందుకే, "ఈ గండం గనుక తప్పితే, నా ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అలా ఆ గడ్డం గట్టెక్కాను. "చాలా ధన్యవాదాలు బాబా. పెద్ద ఒత్తిడి నుండి తప్పించావు. ఆ సమయంలో నేను కనుక ఇంటికి వెళ్లి వెతికుంటే ఇంట్లో ఆ పత్రం లేనందున అనవసరంగా రెండురోజులు చాలా ఒత్తిడి అనుభవించేదాన్ని. కానీ కోర్టు కార్యాలయ గదికి వెళ్లి ఉన్న డాక్యుమెంట్లు అయినా తిరిగి ఇచ్చేలా మీరు ప్రేరణ ఇవ్వబట్టి నాకు ఆ ఒత్తిడి తప్పింది బాబా. ఇలాగే మీ అనుగ్రహవీక్షణలలో నన్ను ఉంచుకొని నా ఆలోచనలను మీవిగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ".


20 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri pl bless him

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Amma nannalu bagundali, chelli ki intern location hyd ki change ayye la chai tandri, pls

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Baba please take care of my child baba 🙏

    ReplyDelete
  9. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  10. sai natha, maa sai madava bharam antha meede baba. maavaru madava birthday ki schoolki kotha dress vesukoni vellataniki opuukunelaga cheyandi baba. maa tammudiki manchi job vachhelaga chudu baba

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. గురుబ్రహ్మ పరమాత్మ సాయినాథనాలోని సకలకోటి రోగాలు సకల కొట్టి దోషాలు సకల కొట్టి పాపలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేశాను చూడు సాయి

    ReplyDelete
    Replies
    1. Om shree Jai Sai Ram 💐💐💐💐💐

      Delete
  13. Baba, pending bills clear ayyi memu evarini ebbandi pettakunda vundela chudandi baba....intha duram thesuku vachina mere mammalni munduki kuda thesuku velli vache kastam lo maku thodu gaa vundi thattukune laga dairyam ichi nadipinchandi....Mee padale maku raksha 🙏

    ReplyDelete
  14. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo